Ragi Upma Recipe in Telugu : రాగితో ఎప్పుడైనా ఉప్మా చేశారా? అందరిలా సాధారణ ఉప్మాలా కాకుండా ఈసారి డిఫరెంట్ రాగి ఉప్మాను తయారు చేద్దామా? రాగి ఉప్మా ఆరోగ్యానికి చాలా మంచిది. తొందరగా బరువు తగ్గాలని అనుకునేవారు తప్పక తినాల్సిందే. షుగర్, బీపీ ఉన్నవారు కూడా హాయిగా రాగి ఉప్మాను తయారు చేసుకుని తినవచ్చు. ఇందులో అన్ని కూరగాయలు వేసుకొని చేసుకోవచ్చు. ఇలా చేశారంటే.. చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఎంతో రుచికరమైన రాగి ఉప్మా ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం..
ముందుగా.. పాన్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. లేదంటే.. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇందులో మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. రెండు కలిపి వేయొద్దు. ఆయిల్ వేడిక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి.. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఇది కూడా మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. వద్దనుకుంటే వదిలివేయొచ్చు.
ఆ తర్వాత ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు తీసుకోవాలి. చిన్నగా తరిగిన అల్లం ముక్కలకు ఒక ఉల్లిపాయని ముక్క కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక్క నిమిషం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. కారాన్ని బట్టి వేసుకోవచ్చు. 3 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినాలంటే ఇంకా కొన్ని కూడా మిరపకాయలు వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఒక్క నిమిషం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వీటిన్నింటిని ఒక్క నిమిషం వేగనివ్వాలి. కూరగాయలు ఒక్క నిమిషం వేగిన తర్వాత రెండు టమాటాలను ముక్కలను వేసుకోవాలి.

ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్‌గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా వేయించుకోవాలి. అలాగే, కొంచెం మంచి వాసన వచ్చేవరకు వేయించుకోవాలి. ఉప్మా రవ్వ నిమిషం వేగిన తర్వాత హాఫ్ కప్ రాగి పిండి వేసుకోవాలి. ఈ పిండి కూడా మంచి ఫ్లేవర్ వచ్చేవరకు వేయించుకోవాలి. రాగి పిండి బాగా వేగిన తర్వాత మంచి వాసన వచ్చేంతవరకు ఉంచాలి. ఒకటన్నర టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకుని హాఫ్ కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. హాఫ్ కప్ రాగి పిండి వేసుకోవాలి. మొత్తం.. ఒక కప్పు పిండి, రవ్వకు మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇక్కడ మీరు వేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలి. చల్లటి నీళ్లు పోయొద్దు.
Ragi Upma Recipe in Telugu : రవ్వ కాంబినేషన్ రాగి ఉప్మా.. టేస్ట్ అదిరిపొద్ది..
ఇప్పుడు ఆ పిండిని ఎలాంటి ఉండల్లేకుండా బాగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఈ పిండిని పోసుకోవాలి. వాటరు నీళ్లు పోయగానే వెంటనే పిండిని బాగా కలుపుకోవాలి. లేదంటే.. ఉండలు కడుతుంది. అందుకే బాగా కలుపుకోవాలి. మనకి ఇంకా పల్చగా కావాలంటే మరో కప్పు నీళ్లు ఎక్కువ పోసుకోవచ్చు. పైనుంచి కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. రెండు నిమిషాల పాటు స్టవ్ సిమ్‌లో పెట్టి మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే.. టేస్టీ టేస్టీగా రాగి ఉప్మా రెడీ అయింది.
రాగి ఉప్మా చాలా హెల్తీ రెసిపీ.. ఇందులో అన్ని కూరగాయలే వేసుకోవచ్చు. ఈ రాగి ఉప్మా బరువు తొందరగా తగ్గడంలో బాగా సాయపడుతుంది. పలచగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. అదే రాగి ఉప్మా గట్టిగా ఉండాలంటే కొంచెం వాటర్ తగ్గించుకోవచ్చు. ఒక హాఫ్ కప్ వాటర్ పోసి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే.. ఎంతో రుచికరమైన వెయిట్ లాస్ రెసిపీ రెడీగా ఉన్నట్టే.