Ragi Chimili Recipe : రాగి చిమ్మిలి.. ఎంతో ఆర్యోగం.. అంతే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అనేక ఆరోగ్య సమస్యలకు సంజివనీ కూడా. రక్తహీనత సమస్యలతో బాధపడే వారు రాగి చిమ్మిలి తింటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు.. పళ్ళు కూడా బలంగా మారతాయి. బలహీనంగా ఉండే వాళ్లు ఈ రాగి చిమ్మిలి తినడం ద్వారా చాలా దృఢంగా మారుతారు. ఎదిగే పిల్లలకి ఎముకలు గట్టిగా అవ్వడానికి కూడా రాగి చిమ్మిలి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రాగి చిమ్మిలి మంచి పోషక పదార్థాలను అందిస్తుంది. రాగి పిండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాగి చిమ్మిలి చాలా ఈజీగా చేసుకోవచ్చు.. అవేంటో ఓసారి చూద్దాం..
కావలసిన పదార్థాలు… రాగి పిండి 2 కప్పులు, తాటి బెల్లం , నెయ్యి1 కప్పు , యాలకులు 2, పల్లీలు 1 కప్పు వంటి పదార్థాలను వినియోగించాల్సి ఉంటుంది.
తయారీ విధానం…
ఒక గిన్నెలో రెండు కప్పుల రాగి పిండి కొంచెం ఉప్పు వేసి ఆ తర్వాత ఈ పిండితో రొట్టెలు చేసుకుంటాం కాబట్టి చల్లటి నీళ్లయినా లేదా వేడినీళ్లయి తీసుకొని పిండిని ముద్దలా కలుపుకోవాలి. చపాతి ఉండలా చేసుకోవాలి ఇప్పుడు అరిటాకు పైన, లేదా కవర్ నెయ్యి వేసి పిండి ముద్దను చేతి వేళ్లతో ఒత్తుకోవాలి మరి పలచగా , మందంగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత దీనిని వేసి నెమ్మదిగా అరిటాకు తీయాలి. రాగి చపాతి పైన చుట్టూ ఆవు నెయ్యి లేదా నూనెను వేసి మంటను లో ఫ్లేమ్ లో నుంచి మీడియం ఫ్లేమ్ లోకి మార్చుకుంటూ లోపటవరకు ఉడికేలా.. రెండు వైపులా రాగి చపాతీని కాల్చుకోవాలి. ఆవిరి పట్టకుండా చపాతీలను జారి స్టాంటిపై పెట్టి చల్లార్చాలి.. స్టవ్ పై మూకుడు పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసి దోరగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పప్పు గుత్తితో మ్యాచ్ చేయాలి. పొట్టు తీసిన పల్లీలను, ఫ్లేవర్ కోసం రెండు యాలకులు వేసి మిక్సీ జార్ లో బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో ముందుగా చేసిన చపాతీలను చిన్న చిన్న ముక్కలుగా చేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు తాటి బెల్లాన్ని తీసుకోవాలి. తినే తీపిని బట్టి తీసుకోవాలి. తాటి బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది.లేదా ఇంట్లో వాడే బెల్లాన్ని అయినా తీసుకోవచ్చు. బెల్లాన్ని మిక్సీ జార్ లో వేసి బెల్లం పొడవడానికి గ్రైండ్ చేసుకున్న రాగి పొడిని వేసుకొని గ్రైండ్ చేస్తే బెల్లం మెత్తగా అవుతుంది.
ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని అందులో రాగి చపాతి పొడి, పల్లీల పొడి, బెల్లం పొడి వీటన్నిటిని బాగా కలపాలి. బెల్లంలో ఉన్న తేమకు చక్కగా కలిసిపోతుంది. కొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి.లేదా కొంచెం నెయ్యి వేసుకుంటూ లడ్డూల చుట్టుకోవాలి.. రాగి చిమిలి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ పాతకాలం రెసిపీ.. అంతే.. ఎంతో రుచికరమైన రాగి లడ్డు, రాగి చిమ్మిలి రెడీ..
Read Also : Jonna Laddu : ఈ జొన్న లడ్డు రోజుకు ఒకటి తింటే చాలు.. మీ ఆరోగ్యం మీ గుప్పెట్లో ఉన్నట్లే..