Munagaku Pappu Recipe : మునగాకు కందిపప్పు కర్రీ.. మునగాకు ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే కంటి చూపు మెరుగు పరుస్తుంది. బరువు, కొవ్వు తగ్గడానికి, పొట్టలో ఉన్న ఇన్ఫెక్షన్స్, మూత్రశయంలో రాళ్లు ను కరిగించడానికి మునగాకు సహాయపడుతుంది.. మునగాకుతో ఎన్నో రకరకాల వంటలు తయారు చేస్తూ ఉంటాం పప్పులో వేసి చూడండి ఎంతో రుచికరంగా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి తింటే వదిలిపెట్టారు. అంత టేస్టీగా అద్భుతంగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు… మునగాకు, కందిపప్పు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, నూనె, పసుపు, ఉప్పు, ఇంగువ, కరివేపాకు రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు,
తయారీ విధానం.. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న కందిపప్పు అలాగే శుభ్రంగా కడిగిన మునక ఆకులను, కరేపాకు రెమ్మలను, కట్ చేసిన ఉల్లిపాయ, నిలువ కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ పసుపు, ఒక టమాటా కట్ చేసి వెయ్యాలి ఆ తర్వాత ఒక గ్లాసు కందిపప్పు కు రెండు గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసి పప్పు ఉడికిందో లేదో చూసుకుని రుచికి తగినంత ఉప్పు, చింతపండు వేడి నీళ్లలో నానబెట్టి రసం వేసి బాగా కలపాలి.

పప్పు మరీ గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడైన తర్వాత తాలింపు గింజలు, జిలకర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు రెమ్మలు, కొంచెం ఇంగువ వేసి కలపాలి. తాలింపు మగ్గిన తర్వాత మునగాకు పప్పు వేసి కలపాలి. ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మునగాకు పప్పు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో రుచికరంగా ఉంటుంది.