Munagaku kobbari pachadi : మునగాకు కొబ్బరి పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? అయితే ఈసారి ట్రై చేయండి.. అందులోనూ మునగాకుతో కలిపి కొబ్బరి పచ్చడి చేస్తే రుచి చాలా బాగుంటుంది. ఒకసారి రుచి చూశారంటే లొట్టలేసుకుంటూ తినేస్తారు. మునగాకు, కొబ్బరి కాంబినేషన్ అదిరిపొతుంది అంతే.. రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట.. ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మునగాకు కొబ్బరి పచ్చడి కంటి చూపు మెరుగుపడేందుకు సాయపడుతుంది. మంచి పౌష్టిక ఆహారం కూడా. వేడి వేడి అన్నంలో అన్ని రకాల అల్పాహారాలకు కలిపి తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇంతకీ ఈ మునగాకు కొబ్బరి పచ్చడిని ఇంట్లో ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చునో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు… మునగ ఆకు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలు, జిలకర 1టీ స్పూన్, ఆవాలు1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్, మినప్పప్పు 2 టీ స్పూన్, పసుపు 1టీ స్పూన్, నూనె, ఉప్పు (రుచికి తగినంత), చింతపండు, ధనియాలు1 టీ స్పూన్, మిరియాలు 1టేబుల్ స్పూన్
తయారీ విధానం… ముందుగా గుప్పెడంత మునగాకును తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. అరచిప్ప కొబ్బరి తురుము కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కొబ్బరి ముక్కలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జిలకర, మిరియాలు, ధనియాలు మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అందులో మీరు తినగల కారాన్ని బట్టి సగంఎండుమిర్చి, సగం పచ్చిమిర్చి వేసి పోపు వేగిన తర్వాత చిన్న ఉల్లిపాయలు (10) ఈ ఉల్లిపాయలు వేస్తేనే చట్నీ టేస్టీగా ఉంటుంది.

లేదా ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత మునగాకు వేసుకొని లో ఫ్లేమ్ లో ఉంచి ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు పసుపు, చింతపండు వేసి ఆకు బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో వేసి కొన్ని నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
ఈ పచ్చడి రోట్లో వేసి దంచడం వల్ల చాలా రుచికరంగా ఉంటుంది) గ్రైండ్ చేసిన పచ్చడి పోపు… స్టాప్ వెలిగించి కళాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర,పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక రెమ్మ కరివేపాకు వేసి పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపులో తయారు చేసుకున్న పచ్చడి వేసి కలపాలి. ఎంతో రుచికరమైన మునగాకు కొబ్బరి పచ్చడి రెడీ…