Multigrain Dosa : సిరి ధాన్యాలతో ఎప్పుడైనా బ్రేక్ ఫాస్ట్ చేసుకున్నారా? ఉదయాన్నే ఇలా మల్టీ గ్రైన్ దోసలు తిన్నారంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇంతకీ, మల్టీ గ్రైన్ దోస ఎలా తయారు చేసుకోవాలో తెలుసా? బియ్యం లేకుండా అన్ని రకాల పప్పులు, సిరి ధాన్యాలతో హెల్తీగా ఈ దోస చేసుకోవచ్చు. రుచి చాలా బాగుంటుంది. తయారు చేయడం కూడా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకునే వాళ్లు క్రమం తప్పకుండా ఈ హెల్తీ దోశను వారంలో మూడు సార్లు అయినా తిని చూడండి. ఆ తర్వాత మీ హెల్త్‌లో ఇట్టే తేడా కనిపిస్తుంది. చాలా హెల్తీగా ఉంటారు. ఈ మల్టీ గ్రైన్ దోస ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు : రాగులు 1 కప్పు, పచ్చ పెసలు 1 కప్పు, పచ్చ జొన్నలు (తెల్లజున్నలు) 1 కప్పు, సామలు 1 కప్పు లేదా 1 కప్పు ఊదలు, మినప గుళ్ళు (మినప పప్పు ) 1 కప్పు , గోధుమలు 1 కప్పు, శనగలు 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు తీసుకోవాలి.
తయారీ విధానం : ముందుగా ఒక పాన్ తీసుకొని ఒక కప్పు రాగులు ఒక కప్పు మినప గుళ్ళు వేసుకోవాలి. పొట్టు మినప్పప్పు ఉంటే.. పొట్టు మినప్పప్పు అయినా తీసుకోవచ్చు. ఒక కప్పు పెసలు అంటే.. పచ్చ పెసలు తీసుకోండి. తెల్లజొన్నల కన్నా ఒక కప్పు పచ్చ జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక కప్పు గోధుమలు కూడా తీసుకోవాలి. ఒక కప్పు సామలు కూడా తీసుకోవాలి. వాస్తవానికి సిరి ధాన్యాలను తొందరగా బరువు తగ్గాలనుకునే వాళ్లు, షుగర్ పేషెంట్స్ వండుకుని తినవచ్చు. రైస్ బదులు ఈ సిరి ధాన్యాలను తినవచ్చు. మీ దగ్గర సామెలు లేకపోతే ఊదలు లేదా ఇంకా ఏ సిరి ధాన్యాలు ఉంటే అవే ఒక కప్పు తీసుకోండి.
ఇందులోనే ఒక హాఫ్ కప్పు శనగలు తీసుకోండి. సెనగలు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. అలా అని చెప్పి ఎక్కువ వేసుకోకూడదు. ఒక హాఫ్ కప్ సరిపోతాయి. ఒక హాఫ్ కప్పు పల్లీలు కూడా తీసుకోండి. అన్నీ ఒక కప్పు తీసుకుంటే శనగలు ఇంకా పల్లీలు మాత్రం హాఫ్ హాఫ్ కప్ తీసుకోండి. ఇక ఇవన్నీ కాస్త డ్రైగా అయ్యేంతవరకు రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఇవన్నీ కాస్త పొడిపొడిగా అయ్యేంతవరకు ఉంచాలి. అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఏ పప్పులైనా సరే కాస్త డ్రైగా రోస్ట్ చేసుకున్న తర్వాత వాడితే వాటిలోని పోషకాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రుచి చాలా బాగుంటాయి.
Multigrain Dosa : సిరి ధాన్యాలతో మల్టీ గ్రైన్ దోస.. తిన్నారంటే అదిరిపొద్ది..
ఇక ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుని ఒకటికి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. ఇందులో కాస్త మట్టి లాంటిది ఇసుక లాంటిది ఉంటుంది నీళ్లలో రెండు మూడు సార్లు కడిగి గాలించి ఒక గిన్నెలోకి తీసుకున్నారంటే చక్కగా సపరేట్ అయిపోతాయి చూశారు కదా నేనైతే ఇలా ఒక మూడు నాలుగు సార్లు అయితే వీటన్నింటినీ కడిగేసి తీసుకున్నాను. ఇక ఇప్పుడు వీటిలో తగినన్ని ఫ్రెష్ వాటర్ ని పోసుకొని ఒక ఫుల్ నైట్ అంతా నానబెట్టేసుకోండి ముందు రోజు నైట్ 8:00 కి నానబెట్టారంటే మార్నింగ్ 6:00 టు 8 ఏ టైం లో అయినా సరే మీరు చక్కగా పిండి రుబ్బుకొని దోసలు వేసుకోవచ్చు.
కనీసం వీటిని 8 గంటల నుంచి 10 గంటల వరకు నానబెట్టుకోవాలి. అప్పుడే మీకు రాగులు జొన్నలు పర్ఫెక్ట్‌గా నాన్తాయి. ముందు రోజు రాత్రి 8 గంటలకు నానపెట్టి మరుసటి రోజు ఉదయం 8 గంటలకి ఈ పిండి రుబ్బుకోవాలి. ఈ నానిన పప్పులన్నింటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. నానపెట్టుకున్న నీళ్లతో పాటు తీసుకోండి. నీళ్లు వంపేయకుండా ఇక వీటన్నింటిని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడే ఇందులో ఒక పావు స్పూన్ దాకా మెంతి పౌడర్ వేసుకోవాలి. మీరు కావాలంటే ముందుగానే మెంతులు ఒక అర స్పూన్ దాక పప్పులో వేసి నానపెట్టుకోవచ్చు. అప్పుడు మెంతి పౌడర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు.

పిండిని రుబ్బేసుకుని ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత తగినంత ఉప్పు వేసుకొని పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి. మల్టీ గ్రైండ్ దోశ పిండి రెడీ చేసుకున్నాక.. ఈ పిండితో దోశ మాత్రమే కాదు ఒక 2 గంటల పాటు పులియబెట్టి ఇడ్లీ కూడా వేసుకోవచ్చు. చాలా సాఫ్ట్ గా వస్తాయి. గుంతపొంగనాలు కూడా వేసుకోవచ్చు. చిట్టి చిట్టి ఊతప్పలు కూడా వేసుకోవచ్చు. దోశల కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కాస్త ఆయిల్ వేసి క్లీన్ చేసుకోవాలి. పాన్ బాగా వేడి అయిన తర్వాత రుబ్బుకున్న పిండిని ఇలా దోసల్లాగా వేసుకోవాలి. నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్‌గా దోసలు వేసుకోవచ్చు. ఐరన్ టవర్ మీద ఈ దోసలు కాస్త ఎర్రగా కాలుతాయి. అదే నాన్ స్టిక్ తవ్వా అయితే.. ఇలా లేత ముదురు రంగులో వచ్చేస్తాయి. ఎన్ని దోశలు కావాలంటే అన్ని వేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఎవరికైనా నచ్చేలా ఉంటాయి.
ఈ దోశలు మీరు వారంలో ఒక 4 సార్లు తింటే తొందరగా బరువు తగ్గిపోతారు. చాలా హెల్తీగా ఉంటారు. ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్ గా తయారవుతాయి. ఈ దోస పిండితో నార్మల్ దోసలే కాదు ఎగ్ దోస ఆనియన్ దోశ మసాలా దోశ లాంటి రకరకాల దోశలు వేసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా తినొచ్చు. ఏ చట్నీలోనైనా మల్టీ గ్రైన్ దోసలు చాలా అద్భుతంగా ఉంటాయి. మల్టీప్లైన్ దోస పిండి ఒక్కసారి రుబ్బుకున్నారంటే చాలు.. ఆ రోజుకు ఎంత దోస పిండి కావాలో అంత బయట ఉంచుకోవచ్చు. మిగిలిన పిండి ఫ్రిజ్లో పెట్టుకున్నారంటే 3 రోజులు పాటు అలానే ఉంటుంది. ఈ ఈ మల్టీ గ్రైన్ ప్రోటీన్ దోస తింటే చాలా టేస్టీగా ఉండటమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.