Idli Dosa Recipe : స్ట్రీట్ ఫుడ్.. ఎక్కువ మంది ఇష్టపడే ఫుడ్ ఇది.. రోడ్ల పక్కన కనిపించే ఇడ్లీ, దోసె కనిపిస్తే చాలు.. తినకుండా అక్కడి నుంచి పోరు.. బండి మీద దొరికే ఇడ్లీతో పాటు కరకరలాడే దోసె తిని పోవాల్సిందే. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి మరి. ఇడ్లీ, దోసెతో పాటు నోరూరించే మూడు రకాల చట్నీలు ఉంటాయి. అబ్బా.. అంతే.. ఆ టేస్ట్ మామూలుగా ఉండదు.. తింటుంటే మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటాయి. స్ట్రీట్ ఫుడ్ ఇడ్లీ, దోసెలను మనం ఇంట్లో చేసుకోలేమా? అంటే.. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ మూడు రకాల చట్నీలను మరింత టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ, దోసెలు, చట్నీలను ఎలా తయారుచేయాలి? ఏయే పదార్థాలు అవసరమో ఇప్పుడు చూద్దాం.. (Street Style Idli Dosa Recipe in telugu)
దోశలు తయారు చేసే విధానం :
మినప గుండ్లు ఒక గ్లాస్ తీసుకొని బియ్యం మూడు గ్లాసులు మెంతులు హాఫ్ టీ స్పూన్ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి నానబెట్టుకోవాలి. ఇప్పుడు దోశపిండి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసిన దోశపిండిని 6,7 రాత్రంతా పులవనివ్వాలి. మరుసటి రోజు దోశపిండి బాగా పులుస్తుంది.. ఇప్పుడు బండిమీద దోశలలో కొంచెం ఇడ్లీ పిండి, కొంచెం పంచదార, ఒక కప్పు మైదాపిండి లేదా గోధుమపిండి వేసి కలుపుతారు. అలా వేస్తేనే సాఫ్ట్ గా క్రిస్పీగా వస్తాయి. అందులో రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.మరుసటి రోజు ఆ తర్వాత స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టుకొని దోశ వేసుకోవాలి రౌండ్ వేసుకోవాలి చుట్టూ కొంచెం ఆయిల్ అప్లై చేయాలి అంతే దోశ రెడీ…
మసాలాదోశ వేసుకోవాలంటే దోశ వేసిన తర్వాత తరిమిన ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, సన్నగా తరిమిన క్యారెట్, సన్నగా తరిగిన క్యాప్సికం, ఆలు కర్రీ వేసి అప్లై చేయాలి కొంచెం ఆయిల్ వేసుకొని చుట్టూ ఎంతో రుచికరమైన మసాలా దోశ రెడీ….
దోశ కర్రీ తయారీ విధానం..
స్టవ్ వెలిగించి ఒక బాణీ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకున్న తర్వాత ఉడకపెట్టిన ఆలుగడ్డలు మూడు వేసి ఒక స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఆలు మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే ఎంతో రుచికరమైన దోశ కర్రీ రెడీ…
ఇడ్లీ తయారీ విధానం..
ఒక గ్లాస్ మినప గుండ్లు తీసుకొని ఒకసారి కడుక్కొని రెండు గంటల సేపు నానబెట్టాలి అలాగే ఇడ్లీ రవ్వ మూడు గ్లాసులు తీసుకొని శుభ్రముగా కడిగి నానబెట్టుకోవాలి.. నానిన మినప గుండ్లను కొన్ని నీళ్లు యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.. మిక్సీ జార్లో కన్నా గ్రైండర్లో పట్టడం వల్ల పిండి ఒదుగు వస్తుంది. నానబెట్టిన ఇడ్లీ రవ్వను వాటర్ రాకుండా చేతులతో ప్రెస్ చేస్తూ పిండిలో బాగా కలుపుకోవాలి.. 6,7 గంటలు రాత్రి అంతా పులవనివ్వాలి. మరుసటి రోజు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర లో రెండు గ్లాసులు వాటర్ పోసి మరగనివ్వాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ లో పిండిని వేసి ఇడ్లీలను పది నిమిషాలు ఉడికించాలి ఇలా చేస్తే సాఫ్ట్ గా వస్తాయి ఇడ్లీ రెడీ…

మూడు రకాల చట్నీలు తయారీ విధానం..
పల్లీలు చట్నీతయారీ విధానం.. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి పల్లీలు వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి తడి ఆరిపోయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. అందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు, మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని మిక్సీ జారులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవాలి ఎంతో రుచికరమైన పల్లి చట్నీ రెడీ..
టమాటా చట్నీ తయారీ విధానం..
స్టవ్ వెలిగించి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నూనె వేడి అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, రెండు స్పూన్ల నువ్వులు, ఐదు మీడియం సైజు టమాటో ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. కారం సరిపడా అంతా పచ్చిమిర్చి, పసుపు ఒక స్పూను వేసి కలపాలి టమాటాలు మగ్గెంతసేపు మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు అందులో పుదీనా వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలి. అందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి.ఇప్పుడు చల్లారిన తర్వాత కొన్ని పల్లీలు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని మిక్సీ జార్ లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీని పోపు వేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన టమాటా చట్నీ రెడీ…
అల్లం చట్నీ తయారీ విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ మినప్పప్పు వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి మగ్గిన తర్వాత తీసి ఒక బౌల్ లో వేయాలి. ఇప్పుడు అల్లం ముక్కలు అరకప్పు వేసి నానపెట్టిన చింతపండు అరకప్పు, బెల్లం అరకప్పు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు వేసి ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్ లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీని పోపు వేసుకోవాలి అంటే ఎంతో రుచికరమైన అల్లం చట్నీ రెడీ… (Street Style Idli Dosa Recipe in telugu)
Read Also : Mirapakaya Bajji : బండి మీద దొరికే మిర్చి బజ్జి, గారెలు ఇంట్లోనే ఇలా టేస్టీగా చేసుకోవచ్చు తెలుసా?