Mamidi Bobbatlu Recipe : మామిడి పండుతో బొబ్బట్లు… ఈ పేరు వినగానే నోరూరిపోతుంది కదా.. బొబ్బట్లు అందరికీ చాలా ఇష్టమైన స్వీట్ పండుతో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మామిడి పండుతో ఎన్నో రకరకాల వంటలు తయారు చేస్తూ ఉంటాం. మామిడి పండుతో ఒకసారి బొబ్బట్లు ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఈజీగా చేయగల రెసిపీ.. మళ్లీ మళ్లీ తినాలనిపించేలా నోరూరించే మామిడి పండుతో ఈ రెసిపీ ఇలా చేస్తే పిల్లలకు ఎంతో ఇష్టంగా తింటారు. ఆహా.. ఏమి రుచి.. తినరా మైమరిచి అనకుండా ఉండలేరు..
కావలసిన పదార్థాలు… మామిడి పండ్లు, మైదాపిండి లేదా గోధుమపిండి, నెయ్యి, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం లేదా పంచదార, యాలకుల పొడి… ఈ పదార్థాలతో కలిపి మామిడి బొబ్బట్లను చాలా రుచికరంగా చేసుకోవచ్చు. ఇందులో ఏ ఒక పదార్థం తక్కువ అయినా బొబ్బట్లు అనుకున్నట్టుగా రావు. అందుకే ఈ పదార్థాలను తప్పకుండా కలుపుకోవాలి.

తయారీ విధానం… ముందుగా ఒక బౌల్లో మైదా పిండి లేదా గోధుమపిండి తీసుకొని కొంచెం ఉప్పు వేసి ఇప్పుడు పిండిలో గోరు వెచ్చని నీళ్లు పోసుకుంటూ సాఫ్ట్ గా చపాతి ముద్దలా కలుపుకోవాలి. మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మామిడి పండు తీసుకొని పై పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకోవాలి. అలాగే పచ్చి కొబ్బెరను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
Mamidi Bobbatlu Recipe : మామిడి పండుతో బక్షాలు లేదా బొబ్బట్లు రుచిగా రావాలంటే..
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పచ్చికొబ్బరి తురుము వేసి కలపాలి మీడియం ఫ్లేమ్ లో ఉంచి మంచి సువాసన వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత పంచదార లేదా బెల్లం తురుము వేసి కలుపుకోవాలి ఆ తర్వాత మామిడిపండు గుజ్జు వేసి కలపాలి. ఫ్లేమ్ నీ మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని అడుగంటకుండా బాగా దగ్గర అయ్యేంతవరకు వేయించుకోవాలి. రుచి కోసం హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.

(ఫ్యాన్) కి సపరేట్ అయ్యేంతవరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత.. ఇప్పుడు మామిడి పండు తో చేసిన పూర్ణా చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అందులో మందంగా చపాతీల్లా ఒత్తుకోవాలి ఆ తర్వాత తయారు చేసుకున్న మామిడి పూర్ణం లడ్డూలను పెట్టుకొని రౌండ్ గా చుట్టి పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా లైట్ గా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి.. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని కొంచెం నెయ్యి అప్లై చేసి పెనం వేడి అయిన తర్వాత ఈ చపాతీలను వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ బొబ్బట్లు వేయించుకోవాలి.. ఇలా చేయడం వల్ల సాఫ్ట్ గా పొంగుతూ బొబ్బట్లు చాలా రుచిగా వస్తాయి.. అంతే ఎంతో రుచికరమైన మామిడిపండు బొబ్బట్లు రెడీ..