Green Chicken : ఎప్పుడూ ఒకేలా చికెన్ కాకుండా ఈసారి గ్రీన్ మసాలాతో కొరియాండర్ చికెన్.. ఇలా చేశారంటే.. చాలా బాగుంటుంది. మంచి గ్రేవితో చపాతీలోకైనా రైస్‌లోకి అయినా దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కొత్తిమీర చికెన్ తయారు చేశారా? ఇప్పుడు టేస్ట్ టేస్టీగా మంచి గ్రేవితో కొరియాండర్ చికెన్ ఎలా తయారుచేయాలో చూద్దాం. మప్పావు కిలో చికెన్ తీసుకోవాలి. మీకు ఎన్ని పీసెస్ కావాలో తీసుకోవచ్చు. చికెన్ ముక్కలను కావలసిన సైజు కట్ చేసుకోవచ్చు. ముందుగా ఈ చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. 1 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
బాగా మిక్స్ చేసుకుని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అరగంట సమయం అలానే ఉంచితే కూడా బాగుంటుంది. ఈ మసాలా ఒక్క నిమిషం వేగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ అందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. నీళ్లు ఇంకిపోయే వరకు బాగా ఉడికించుకోవాలి. ఒక మిక్సీ జార్‌లో 8 పచ్చిమిర్చి వేసుకోవాలి. కారాన్ని బట్టి వేసుకోవాలి. రెండు మూడు అల్లం ముక్కలు, ఒక వెల్లుల్లిపాయని తొక్క తీసి వేసుకోవాలి. ఒక కప్పు కొత్తిమీర వేసుకోవాలి. కాడలతో సహా కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆయిల్ నుంచి చికెన్ బయటకు తీసేయాలి.
Green Chicken : నోరూరించే కొత్తిమీర చికెన్ కర్రీ..
ఇదే ఆయిల్లో వన్ టీ స్పూన్ సాజీర వేసుకోవాలి. ఆ తర్వాత రెండు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మూత పెట్టుకుంటే తొందరగా వేగుతాయి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ మసాలా వేసుకోవాలి. డిఫరెంట్ చికెన్ కర్రీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా గ్రీన్ మసాలాతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతిలో కైనా రైస్‌లోకి అయినా దీంట్లోకైనా చాలా బాగుంటుంది. రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి పావు టీ స్పూన్, గరం మసాలా పావు టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు అవన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి.

మూత పెట్టుకోకుండానే ఇది వేయించుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి. కొంచెం సేపు ఉడకనివ్వాలి. అంతకుముందు ఉడికించి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని 10 నిమిషాల నుంచి 11 ఉడకనివ్వాలి. ఈ గ్రీన్ మసాలా అంతా ఈ చికెన్ ముక్కలకు బాగా పట్టాలి. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని చికెన్ బాగా ఉడికించుకోవాలి. గ్రేవీ చిక్కబడేవరకు అలానే చేయాలి. అంతే.. టేస్టీ టేస్టీగా కొరియాండర్ చికెన్ రెడీ అయింది. ఎప్పుడు చేసుకునే చికెన్ మాదిరిగా కాకుండా ఇలా డిఫరెంట్ గా గ్రీన్ మసాలాతో చేసుకుంటే చికెన్ చాలా రుచిగా ఉంటుంది చపాతీల్లో లేదా అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ గ్రీన్ చికెన్ ఇంట్లో ట్రై చేయండి.