Gongura Pachi Senagapappu Curry : గోంగూర పచ్చి శనగపప్పు పులుసు ఎప్పుడైనా తిన్నారా? గోంగూరతో ఎన్నో రకరకాల వంటలు తయారు చేస్తూ ఉంటాం. అయితే, విలేజి స్టైల్ గోంగూర పచ్చిశనగపప్పు పులుసు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో రుచికరంగా ఉంటుంది. ఆంధ్రా స్టైల్ గోంగూర సెనగపప్పు కూరను కూడా తయారుచేసుకోవచ్చు. పాతకాల పద్ధతిలో కూడా గోంగూర సెనగపప్పు పులుసు కూరను అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. ఇంతకీ, గోంగూర పచ్చి శనగపప్పు పులుసు కూర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు… గోంగూర- 1 పెద్ద కట్ట, పచ్చిశనగపప్పు -100 గ్రాములు, ఎండుమిర్చి-, కరివేపాకు- రెమ్మలు, నూనె, పసుపు-1 టీ స్పూన్, ఉల్లిపాయ-1, జిలకర-1 టీ స్పూన్, ఆవాలు-1 టీ స్పూన్, ఉప్పు, కారం, పచ్చిమిర్చి-2, మెంతులు -1టీ స్పూను,…
తయారీ విధానం... గోంగూరను శుభ్రంగా కడిగి చిల్లుల గిన్నెల తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఒక బౌల్లో పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి నాన పెట్టుకున్న శనగపప్పును కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించి ఆ తర్వాత విజిల్ తీసిన లో ఫ్లేమ్ లో ఉంచి అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలపాలి.
ఇప్పుడు గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి రుచికి తగినంత కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఆఫ్ గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.

ఇప్పుడు గోంగూర ఉడికిందో లేదో చూసుకుని పప్పు గుత్తితో గోంగూరని మెత్తగా మెదుపుకోవాలి. (పప్పు పలుకుగా అలాగే ఉంటుంది) గోంగూర పప్పు మరి గట్టిగా లేకుండా కొన్ని నీళ్లు పోసి (పులుసుల) కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి నూనె వేసి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ మెంతులు ఒక రెమ్మ కరివేపాకు రెండు ఎండు మిర్చి వేసి తాలింపు వేయించుకోవాలి. ఇప్పుడు గోంగూర పప్పు వేసి కొంచెం దగ్గరకు వచ్చేలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన గోంగూర పచ్చిశనగపప్పు పులుసు రెడీ…