Gongura Chicken Recipe : గోంగూర చికెన్ ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది.. ఇలా చేస్తే కొంచెం కూడా మిగల్చకుండా తినేస్తారు..!

Gongura Chicken Recipe : చికెన్ లో ఎన్నో ప్రోటీన్ పోషక విలువలు కలిగి ఉంటుంది. చికెన్ తో ఎన్నో రకరకాల వంటలు తయారు చేస్తూ ఉంటా. ఎప్పుడైనా గోంగూరతో కలిపి చికెన్ వండారా!! ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో అద్భుతంగా టేస్ట్ గా ఉంటుంది ఒక్కసారి తింటే అయితే మళ్లీ మళ్లీ తినాలి అనిపిస్తుంది. వేడివేడి అన్నం, చపాతి, పలావ్, జొన్న రొట్టెలు, రాగిసంకటి, బిరియాని, బగారా తో కలిపి తింటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం గోంగూర చికెన్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు… చికెన్ ఆఫ్ కేజీ, నూనె 5 టేబుల్ స్పూన్స్, పసుపు1 టీ స్పూన్, కారం1, ఉప్పు, ధనియాల పొడి1 టీ స్పూన్, గరం మసాలా పొడి1 టీ స్పూన్, జీలకర్ర పొడి1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్2 టీ స్పూన్, ఉల్లిపాయ 3, పచ్చిమిర్చి 3, టమాటా 2, కొత్తిమీర 1 కట్ట, కరివేపాకు 2 రెమ్మలు,

తయారీ విధానం....ముందుగా చికెన్ ని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక కళాయిలో హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, వన్ అండ్ ఆఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, రెండు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు, నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, రెండు రెమ్మల కరివేపాకు చికెన్ ముక్క ఆ తర్వాత ఐదు స్పూన్ల నూనె వేసి చికెన్ ముక్కలకు మసాలా బాగా పట్టేలా కలపాలి.

Gongura Chicken Recipe In Telugu
Gongura Chicken Recipe In Telugu

మూత పెట్టుకొని ఒక అరగంటసేపు పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న గోంగూర గోంగూర ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే అందులో పులుపు ఎక్కువగా ఉంటుంది కనుక ఒక మూకుడులో చిన్న కట్టలు మూడు గోంగూర తీసుకొని పచ్చిమిర్చి కారానికి తగినంత 10, ఆఫ్ గ్లాస్ నీళ్లు పోసి ఇప్పుడు స్టవ్ వెలిగించి గోంగూర మెత్తగా అయ్యేంతవరకు లో ఫ్లేమ్ లో ఉంచి ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు చల్లారిన గోంగూరను మిక్సీ జార్ లో వేసి పేస్టు చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కలిపి పెట్టుకున్న చికెన్ కళాయి పెట్టుకొని ఫ్లేమ్ ని ఐ ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉంచి కూర అడుగంటకుంట మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ లో ఉన్న వాటర్ ఇనికి పోయే..నూనె పైకి తేలే అంతవరకు ఉడికించండి. చికెన్ ఎర్రగా వేగిన తర్వాత గోంగూర పేస్టు వేసుకోవాలి ముందే వేసుకుంటే చికెన్ ఉడకదు. చికెన్ కర్రీ లో గోంగూర పేస్ట్ వేసి బాగా కలపాలి అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి కలపాలి.

ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కూరలో నూనె పైకి తేలి చిక్కటి గ్రేవీ వచ్చేవరకు ఉడికించాలి. కొంచెం సన్నగా తరిమిన కొత్తిమీర వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే  ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ రెడీ…

Read Also : Gongura Royyalu Curry : రొయ్యల గోంగూర కర్రీ.. చూస్తూనే నోరూరిపోతుందిగా.. ఇంట్లో ఇలా టేస్టీగా చేస్తే.. కొంచెం కూడా మిగల్చకుండా తినేస్తారు..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment