Kakarakaya Ulli Karam : కాకరకాయ ఉల్లికారం ఎప్పుడైనా తిన్నారా? మీ ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ఇప్పుడు చేయండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. కాకరకాయ ఉల్లికారాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అంతేకాదు.. కాకర కాయ, ఉల్లి కారాన్ని వేడి వేడి అన్నంలో కలిపి తింటే ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మాటల్లో చెప్పలేం.. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా నోరూరించే రుచికరమైన కాకర కాయ ఉల్లి కారాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు :
కాకరకాయ హాఫ్ కేజీ, ఉల్లిపాయలు నాలుగు, వెల్లుల్లి రెబ్బలు 10, కారం, ఉప్పు, పసుపు1 టీ స్పూన్, కరివేపాకు, పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్, జిలకర 1టీ స్పూన్, ఆవాలు 1టీ స్పూన్, మినప్పప్పు1 టీ, నిమ్మకాయ సైజు అంత చింతపండు, ధనియాలు,
తయారీ విధానం :
ముందుగా కాకరకాయలు లోపటి గుజ్జును చెంచాతో తీసేసి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలను రౌండ్ గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కాకరకాయలో తీసిన గుజ్జు వేసి తర్వాత చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, వేసి వేయించుకోవాలి తీసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే మూకుడు లో ఒక స్పూన్ ఆయిల్ వేసి రెండు చెంచాల సాయి మినప్పప్పు, రెండు చెంచాల పచ్చనగపప్పు వేసి దోరగా వేయించి ఉల్లిపాయ ప్లేట్లో వేసుకోవాలి చల్లారాక మూడు స్పూన్ల కారం వేసి మిక్సీ జార్ లో పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కారం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోండి.
ఆ తర్వాత కాకరకాయ ముక్కలను వేయించుకోవాలి. చల్లారిన తర్వాత వేయించిన. కాకరకాయ ముక్కల్లో ఉల్లికారం పేస్టును స్టఫింగ్ గా పెట్టాలి. స్టవ్ వెలిగించి కళాయిలో మీడియం ఫ్లేమ్ లో ఉంచి డీప్ ఫ్రై కి సరిపోయినంత నూనె పోసి కాకర ముక్కలు వేయించుకోవాలి. మిగిలిన ఉల్లికారం పేస్టును అందులో వేసుకొని ఐదు నిమిషాలు వేయించుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన కాకరకాయ ఉల్లికారం రెడీ…
Read Also : Mutton Pulao : కుక్కర్‌లో మటన్ పులావ్ ఇలా చేస్తే.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. తినకుండా వదిలిపెట్టరు..!