Gongura Chicken Pulao : గోంగూర చికెన్ పులావ్… ఆహా.. చూస్తూనే నోరూరిపోతుందిగా.. అదే నేరుగా తింటే ఎలా ఉంటుంది టేస్ట్ అదిరిపోద్ది అంతే.. ఎప్పుడు తినే కన్నా మరో నాలుగు ముద్దలు ఎక్కవే తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. సాధారణంగా గోంగూర కాంబినేషన్‌లో ఏ వంటకమైన కమ్మగా ఉంటుంది. ఎందుకంటే.. గోంగూర పుల్లగా చాలా రుచిగా ఉండటమే.. అదే గోంగూర చికెన్ పులావ్ (Gongura Chicken Pulao) చేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ గోంగూర చికెన్ పులావ్ (Sorrel Leaves Chicken Pulao) చాలా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు.. చికెన్-1/2 కేజీ, గోంగూర-, బాస్మతి రైస్-1/2 కేజీ, సాజీర-1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకులు-3, దాచిన చెక్క-2 ఇంచులు, లవంగాలు-4, యాలకులు-3, నల్ల యాలక్కాయ-1, స్టార్ పువ్వు, ఉల్లిపాయ-2, పచ్చిమిర్చి-5, నూనె, నెయ్యి-1 టేబుల్ స్పూన్, జీడిపప్పు-10, కారం ఉప్పు( రుచికి తగినంత), పసుపు-1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్-1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి-1 టీ స్పూన్, గరం మసాలా పొడి-1 టీ స్పూన్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు రెండు రెమ్మలు.. (Gongura Chicken Recipe)
తయారీ విధానం… ముందుగా బాస్మతి రైస్ మూడు సార్లు కడిగి అరగంటసేపు నానబెట్టుకోవాలి. తర్వాత చికెన్ పసుపు ఉప్పు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న గోంగూర ఆరనివ్వాలి ఆ తర్వాత స్టాప్ ఆన్ చేసి కళాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత గోంగూర వేసి మగ్గనివ్వాలి గోంగూర పేస్ట్ అయ్యేంతవరకు మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి.
స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత గోంగూర పేస్టు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూర చికెన్ పులావ్ కోసం స్టాఫ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక టీ స్పూన్ నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి అయిన తర్వాత బిర్యానీ రెండు ఆకులు, దాల్చిన చెక్క రెండించులు, నల్ల యాలక్కాయ ఒకటి, కొంచెం పువ్వు, నాలుగు లవంగాలు, మూడు యాలకులు, ఆఫ్ స్పూన్ సాజీర జీడిపప్పు (ఆప్షనల్) వేసి ఒక నిమిషం తర్వాత నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి.
లో ఫ్లేమ్ లో ఉంచి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత చికెన్ వేసి ఐదు నిమిషాలు చికెన్ లో ఉన్న వాటర్ అంత పోయేంతవరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ( గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి..) రుచికి తగినంత కారం ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి ము క్కలకు పట్టేలా బాగా కలపాలి.
Gongura Chicken Pulao : ఘుమఘుమలాడే గోంగూర చికెన్ పులావ్ తయారీ ..
(గోంగూర మీరు తినే పులుపును బట్టి వేసుకోండి) ఇప్పుడు గోంగూర పేస్ట్ ఒక కప్పు వేసి కలిపి నూనె పైకి తేలేంతవరకు మగ్గనివ్వాలి. కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత రైస్ వేసుకొని నెమ్మదిగా కలపాలి. ( బియ్యం విరగకుండా) ఏ గ్లాస్ తో అయితే బియ్యం తీసుకున్నారు అదే గ్లాసుతో వాటర్ ని ఒక గ్లాస్ తీసుకుంటే గ్లాస్ ఉన్నారా వాటర్ పోసుకోవాలి ఉప్పు రుచికి తగినంత ఉప్పు ఉందో లేదో ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి ఐ ప్లేంలో ఉంచి రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి.
ఆ తర్వాత లో ఫ్లేమ్ లో రెండు నిమిషాల ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ మూత వెంటనే తీయొద్దు కుక్కర్ విజిల్ అంతా పోయిన తర్వాత(10 నిమిషాలు) కుక్కర్ మూత తీయాలి అలా చేయడం వల్ల ముద్దగా కాకుండా గోంగూర చికెన్ పులావ్ పొడిపొడిగా వస్తుంది. ఎంతో రుచికరమైన వేడి వేడి గోంగూర చికెన్ పులావ్ రెడీ…
Read Also : Mutton Pulao : కుక్కర్‌లో మటన్ పులావ్ ఇలా చేస్తే.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. తినకుండా వదిలిపెట్టరు..!