Mutton Pulao : మటన్ పులావ్.. ప్రెషర్ కుక్కర్‌లో చాలా స్పీడ్‌గా తయారుచేసుకోవచ్చు. రుచికరమైన మటాన్ పులావ్ తయారుచేసుకోవాలంటే అవసరమైన పదార్థాలను కలుపుకోవాలి. కుక్కర్ లో వండటం ద్వారా తొందరగా ఉడుకుతుంది. అంతే తినడానికి చాలా రుచిగానూ ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే మటన్ పులావ్ సింపుల్ గా ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
మటన్ పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు :
మటన్ 1/2 కేజీ, ఉప్పు1 టీ స్పూన్ , పసుపు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, బిరియాని ఆకు పొడి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట 1 టీ స్పూన్, పుదీనా, కొత్తిమీర, ఆఫ్ చెక్క నిమ్మకాయ, పచ్చిమిర్చి 3, మిరియాల పొడి 1/2టీ స్పూన్, ఆయిల్2 టేబుల్ స్పూన్ , 1/2 కప్పు పెరుగు, బాస్మతి రైస్ 1/2 కేజీ, బిరియాని ఆకులు 2, దాల్చిన చెక్క2ఇంచుల, జాపత్రి , స్టార్ పువ్వు 1, నల్ల యాలక్కాయ 1, లవంగాలు 4, యాలకులు 4, బ్లాక్ స్టోన్ ఫ్లవర్ , సాజీర 1 టీ స్పూన్, ఉల్లిపాయలు 2,కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, బాస్మతి రైస్ 1/2 కేజీ..
మటన్ పులావ్ తయారీ విధానం..
మటన్ పులావ్ కుక్కర్ లో ఎలా చేయాలో చూద్దాం ఎంతో టేస్టీగా… శుభ్రంగా కడిగిన మటన్ ఆఫ్ కేజీ, ఒక బౌల్ లో మటన్ వేసి అందులో ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, బిరియాని ఆకు పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట, కొంచెం సన్నగా తరిమిన పుదీనా, కొత్తిమీర, ఆఫ్ చెక్క నిమ్మకాయ రసం, పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేయాలి. మిరియాల పొడి, రెండు టేబుల్ స్పూన్ ఆయిల్, హాఫ్ కప్పు పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మ్యాగ్నెట్ చేసుకోవాలి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి మసాలా ఫ్లేవర్స్ అన్ని మటన్ ముక్కలకు బాగా పడుతుంది. మటన్ పులావ్ టేస్టీగా వస్తుంది. ఇంట్లో వాడే బియ్యంతో కూడా చేసుకోవచ్చు కానీ బాస్మతి రైస్ తోటైతే చాలా టేస్టీగా ఉంటుంది.

ఇప్పుడు ఒక బౌల్లో బాస్మతి రైస్ ఆఫ్ కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి రైస్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి అప్పుడు రైస్ పొడిపొడిగా వస్తుంది. ఇప్పుడు వన్ అవర్ తర్వాత స్టాప్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక బిరియాని ఆకులు రెండు వేయాలి ఇప్పుడు రెండు ఇంచుల దాల్చిన చెక్క, కొంచెం జాపత్రి , స్టార్ పువ్వు , నల్ల యాలక్కాయ, లవంగాలు, యాలకులు, బ్లాక్ స్టోన్ ఫ్లవర్ కొంచెం, టీ స్పూన్ సాజీర.. బిరియాని మసాలా ఫ్లేవర్స్ వేసుకొని దోరగా వేయించాలి. సన్నగా తరిమిన రెండు ఉల్లిపాయలు తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి.. ఆ తర్వాత మ్యాగ్నెట్ చేసిన మటన్ మిశ్రమాన్నంత వేసుకోవాలి.
ఇప్పుడు మటన్ ముక్కలో నుంచి వాటర్ పోయి చిక్కటి గ్రేవీ వచ్చేంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. నూనె పైకి తేలేంతవరకు.. 15 నిమిషాలు తరవాత ఒక గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టుకోవాలి ఏడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మటన్ బాగా ఉడికిందో లేదో చూసుకోవాలి మటన్ మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో మటన్ ముక్కలన్నీ తీసుకోవాలి.. ఇప్పుడు ఏ గ్లాస్ తోఅయితే బాస్మతి రైస్ తీసుకుంటాను అదే గ్లాసుతో మటన్ సూప్ ను గ్లాస్ తో కొలుచుకోవాలి పులావ్ కి ఎన్ని వాటర్ యాడ్ చేయాలో తెలుస్తుంది.
ఇప్పుడు స్టాప్ వెలిగించి కుక్కర్లో సూపు మటన్ ముక్కలు వేసి ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి ఒక గ్లాస్ సూపు వస్తే రెండు గ్లాసులు వాటర్ పోయాలి. ఇప్పుడు రుచికి తగినంత కారం, ఉప్పు యాడ్ చేసుకోవచ్చు.. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి రైసు విరగకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంతవరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల తర్వాత ప్రెషర్ తీసి ఇప్పుడు కుక్కర్ మూత తీసుకోవాలి. ఎంతో రుచికరమైన పొడిపొడి లాడేటి మటన్ పులావ్ రెడీ. ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు.
Read Also : Mutton Fry : మటన్ ఫ్రై.. ఒక్కసారి ఇలా చేసి చూడండి.. ఫంక్షన్లలో ఉన్నట్టే ఎంతో టేస్టీగా ఉంటుంది..!