Dondakaya Karam Kura : మీ ఇంట్లో దొండకాయ ఫ్రై ఎప్పుడైనా చేశారా? అందరిలా కాకుండా కొంచెం కొత్తగా అద్భుతమైన రెసిపీని ఇలా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే దొండకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ రైస్‌లోకి అయినా రోటీస్ లోకైనా చపాతి పుల్కా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా రకాలైన దొండకాయ రెసిపీస్ ఉన్నాయి. అందులో ఇలా దొండకాయ కూర ఒక స్పెషల్ అని చెప్పవచ్చు. డిఫరెంట్‌గా దొండకాయను ఇలా చేస్తే ఎవరికైనా నచ్చుతుంది. ఇప్పుడు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఒక పావు కేజీ దొండకాయలను తీసుకోవాలి. కొంచెం లేతగా ఉన్న దొండకాయలు తీసుకుంటే బాగుంటుంది. చిన్న సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం పొడవుగా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ముందుగా పాన్ వేడెక్కిన తర్వాత 1 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి.
హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక్క నిమిషం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలి. దొండకాయల్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. మధ్యమధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది. దొండకాయలు వేగడానికి 5 నుంచి 6 నిమిషాలు పడుతుంది. ఈ దొండకాయలు వేగేలోపు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. వేయించిన పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కూడా వేయించి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ పుట్నాలు వేసుకోవాలి. మీ దగ్గర పుట్నాల పప్పు లేకపోయినా పర్లేదు శనగపిండిని కూడా వేసుకోవచ్చు.
కానీ, శనగపిండి కొంచెం వేయించుకుని వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా చేయొద్దు. కొంచెం కచ్చాపచ్చాగా చేసుకోవాలి. దాంట్లో 1 1/2 టీ స్పూన్ కారంపొడి వేసుకోవాలి. టేస్ట్ బట్టి వేసుకోవచ్చు. వన్ టీ స్పూన్ సాల్ట్ టెస్ట్ తగినంత వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా వేసుకోవాలి. వీటి అన్నింటిని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. దొండకాయలు మంచిగా వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని ఇందులో వేసుకోవాలి.
ఉల్లిపాయల్ని ఒక్క నిమిషం వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. దొండకాయలు బాగా వేగిన తర్వాతనే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక్క నిమిషం వేగిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్‌లో పెట్టుకోవాలి. ఒకవేళ మరి పొడిపొడిగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకోవాలి. కొన్ని చేత్తో కొన్ని వాటర్ చిలకరించుకోవాలి. ఎందుకంటే.. ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీగా దొండకాయ ప్రిపేర్ అయిపోయింది. ఈ దొండకాయ ప్రైని అన్నంలో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రుచికరమైన నోరూరించే దొండకాయ ప్రై ఓసారి ఇంట్లోనే ట్రై చేయండి.
Read Also : Kakarakaya Ulli Karam : కాకరకాయ ఉల్లికారం చేయడం చాలా ఈజీ.. వేడివేడి అన్నంలో కలిపి తింటే ఆ టేస్టే వేరబ్బా..!