Chitti Muthyalu Kodi Pulao : చింత చిగురు చిట్టి ముత్యాల కోడి పులావ్ ఎప్పుడైనా తిన్నారా? ఒకసారి ఇలా వండుకుని తిన్నారంటే అసలే వదిలిపెట్టరు.. అంత టేస్టీగా ఉంటుంది. చింత చిగురు, కోడి పులావ్ కాంబినేషన్ అదిరిపోద్ది. ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ చింత చిగురు చిట్టి ముత్యాల కోడి పులావ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా? ఈ కోడి పులావ్ తయారీకి ఏయే పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు… చింత చిగురు- 250 గ్రాముల ,చికెన్-1 కేజీ, నూనె, ఉప్పు కారం( రుచికి తగినంత), పసుపు-1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్-3 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకులు-3, లవంగాలు- 10, దాల్చిన చెక్క-3 ఇంచులు, సాజీర- 1టీ స్పూన్, స్టార్ పువ్వు-2, యాలకులు-10, జాపత్రి-1/2, రాతి అనాసపువ్వు- ఒక టేబుల్ స్పూన్, నెయ్యి -3 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ -1టేబుల్ స్పూన్, ఉల్లిపాయ-3, జీడిపప్పు-1 కప్పు,(20-30), పెరుగు – 400 గ్రాములు తీసుకోవాలి.
తయారీ విధానం…. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి ఒక బౌల్లో చికెన్ తీసుకొని టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత కారం ఉప్పు, యాలకులు 10, లవంగాలు 10, మూడించుల దాచిన చెక్క, జాపత్రి సగం, స్టార్ అనాసపువ్వు రెండు, ఒక టేబుల్ స్పూన్ రాతి పువ్వు, మూడు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాజీర వన్ టీ స్పూన్, బిర్యానీ ఆకులు మూడు, ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అన్ని చికెన్ కి పట్టేలా బాగా కలుపుకోవాలి.
Chitti Muthyalu Kodi Pulao : చింత చిగురు చిట్టి ముత్యాల కోడి పులావ్ తయారీ ఇలా :
ఇప్పుడు 400 గ్రాముల పెరుగు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి అరగంటసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ చిట్టి ముత్యాలను మూడు గ్లాసులు తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత నీళ్లు పోసి అరగంట పక్కన పెట్టుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకుని నిలువుగా కట్ చేసుకోవాలి..

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ గిన్నె పెట్టుకుని (80ml) 6 టేబుల్ స్పూన్ల నూనె వేసి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి అయిన తర్వాత లో ఫ్లేమ్ లో ఉంచి ఒక కప్పు జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర గుప్పెడు వేసుకొని ఒక నిమిషం తర్వాత ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టిన చికెన్ వేసుకొని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి.
మూడు నాలుగు నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ ఉండండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉంచి మూత పెట్టి పది నిమిషాల పాటు అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి.. పెరుగు అంతా కరిగిపోయి చికెన్ లో ఉన్న వాటర్ అంతా పోయి నూనె పైకి తేలేంతవరకు ఉడికించాలి. 250 గ్రాముల చింతచిగురు వేసుకోవాలి ఇప్పుడు నాలుగు లేదా ఐదు నిమిషాలు తర్వాత చింత చిగురు మగ్గుతుంది.
ఆ తర్వాత ముందుగా నాన పెట్టుకున్న రైస్ చిట్టి ముత్యాలను వేసి నెమ్మదిగా కలపాలి. మూడు నిమిషాల తర్వాత వేడి నీళ్లు ఆరు గ్లాసులు నర వేసుకోవాలి.. చిట్టి ముత్యాల బియ్యానికి వాటర్ ఎక్కువగా పడుతుంది మనం తీసుకున్న 3 గ్లాసుల బియ్యానికి 61/2 గ్లాసులు వేడి వాటర్ పోసుకోవాలి. ఐ ఫ్లేమ్ లో ఉడికించాలి.. రైస్ కు మసాలా ఫ్లేవర్ పట్టే అంతవరకు కలుపుకోవాలి.80% ఉడికిన తర్వాత సిల్వర్ పేపరు బిర్యానీ గిన్నెపై చుట్టాలి పెట్టాలి ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వావ్ అదిరిపోయే పొడి పొడి లాడే చింత చిగురు చిట్టి ముత్యాల కోడి పులావ్ రెడీ అవుతుంది…