Chicken Liver Gravy : చికెన్ లివర్ గ్రేవీ కర్రీ ఇలా చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. ఇలా చేసుకోండి ఏ రెస్టారెంట్ కూడా పనికిరాదు అంత టేస్టీగా ఉంటుంది కావలసిన ఇన్ గ్రేట్ అన్ని సమ పాలల్లో వేసుకుంటే నీచువాసన అనేది కూడా ఉండదు… తినే కొద్ది తినాలని అనిపిస్తుంది. చికెన్ లివర్ గ్రేవీ కర్రీ కోసం..
కావలసిన పదార్థాలు… చికెన్ లివర్-1/2 కేజీ, అల్లం-2 అంగుళాలు, వెల్లుల్లి రెబ్బలు-8, ఉల్లిపాయ-1, టమాట-1, నూనె, కారం ఉప్పు( రుచికి తగినంత), ధనియాల పొడి-1 టీ స్పూన్, గరం మసాల పొడి-1/2 టీ స్పూన్, ఎండు కొబ్బెర( కొంచెం), నల్ల యాలక్కాయ-1, లవంగాలు-4, యాలకులు-3, దాచిన చెక్క-2 ఇంచులు, నిమ్మకాయ, కొత్తిమీర..
తయారీ విధానం.. ముందుగా లివర్స్ ని ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి.. మసాలా కోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయను స్టవ్ పై కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఉంచి కాల్చుకోవడం వల్ల ఉల్లిపాయ లోపట వరకు ఉడుకుతుంది. మిక్సీ జార్లో అర ఇంచు అల్లం ముక్కలు, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, 8 వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ చల్లారాక నాలుగు భాగాలుగా కట్ చేసి వేసుకోవాలి.
కొంచెం కొత్తిమీర, ఒక టమాట తీసుకొని పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత వీటన్నిటిని మెత్తటి పేస్టులా గ్రైండ్ చేయాలి. మసాలా పేస్ట్ ను పక్కన పెట్టుకోవాలి. స్టాప్ ఆన్ చేసి కళాయి పెట్టి ఐదు టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వేడైన తర్వాత రెండించిన దాచిన చెక్క, నాలుగు లవంగాలు, మూడు యాలకులు, నల్ల యాలక్కాయ ఒకటి వేసుకొని ఒక నిమిషం తర్వాత ముందుగా తయారుచేసి మసాలా పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
Chicken Liver Gravy : చికెన్ లివర్ గ్రేవీ కర్రీ..
ఒక టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి మసాలా పేస్టులో నూనె పైకి తేలేంతవరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత చికెన్ లివర్లు వేసి కలపాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉంచి లివర్స్ ని మధ్య మధ్యలో కలుపుతూ 50% ఫ్రై అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. అలా చేయడం వల్ల లివర్స్ బాగా ఫ్రై అవుతాయి లివర్సు పచ్చివాసన పోయి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రుచికి తగినంత కారం ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి చికెన్ లివర్స్ కు పట్టేలా కలపాలి. కూరలో కారం మగ్గిన తర్వాత గ్రేవీ కోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా పోయకూడదు..
ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి గ్రేవీ అంతా చిక్కబడి నూనె పైకి తేలే అంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. గ్రేవీ పర్ఫెక్ట్ గా ఉంటేనే కూర రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు సగం చెక్క నిమ్మరసం వేసుకొని కలపాలి. రెండు నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన చికెన్ లివర్ గ్రేవీ కర్రీ రెడీ…