Chepala Pulusu : ఏ చేప అయినా సరే పులుసు అదిరిపోవాలంటే ఇలా ట్రై చేయండి.. చేప పులుసులంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. గుండె సమస్యలు రాకుండా నివారిస్తుంది. వారానికి రెండు సార్లు అయినా చేపలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. చాపల పులుసు ఎంతో టేస్టీగా రావాలంటే కొన్ని పదార్థాలను వాడాలి. అప్పుడు మాత్రమే చేపలు పులుసు టేస్ట్ బాగా వస్తుంది. విలేజ్ స్టయిల్లో చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు.. చేపలు-1 కేజీ, నూనె, కారం, ఉప్పు, ధనియాలు -2 టేబుల్ స్పూన్, ఉల్లిగడ్డ -3, వెల్లుల్లి రెబ్బలు-10, అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టేబుల్స్ స్పూన్, చింతపండు-60 గ్రాములు, జిలకర-1 టీ స్పూన్, టమాట-2, మెంతులు -1టీ స్పూన్, బగారా ఆకులు-2, కరివేపాకు- 2 రెమ్మలు, దాల్చిన చెక్క-2 ఇంచులు, లవంగాలు-5, యాలకులు-5, మిరియాలు-1 టీ స్పూన్,
తయారీ విధానం.. ముందుగా చేప ముక్కలను నిమ్మరసం ఉప్పుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో చేప ముక్కలు తీసుకొని ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు బాగా కలిపి అరగంట ఎంతసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.
ఇప్పుడు మిక్సీ జార్లో రెండు పెద్ద టమాటాలు మెత్తగా గ్రైండ్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న మూకుడు పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత ఒక టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి తర్వాత ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయి తేలేంతవరకు ఫ్రై చేసుకోవాలి.
రెండు బగారా ఆకులు, రెండు రెమ్మల కరివేపాకు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకొని ఒక నిమిషం కలపాలి. ఇప్పుడు రుచికి తగినంత కారం ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి (ఐదు నిమిషాలు)తర్వాత నూనె పైకి తేలేంతవరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి మూడు వేసి కలపాలి. ప్లే ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి చేప ముక్కలను వెయ్యాలి ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి.
ఇప్పుడు చేప ముక్కలపై చింతపండు రసం వేసుకొని చేప ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోయాలి. చేపల కూరను నెమ్మదిగా కలపాలి ఐ ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్ లో చేపల కూరలో నూనె పైకి తేలినప్పుడు ఆ తర్వాత ( దాచిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు) మసాలా దినుసులను కచ్చాపచ్చాగా దంచి పులుసు లో వేసి చేపల ముక్కలు విరగకుండా నెమ్మదిగా కలపాలి. పులుసు చిక్కబడేంత వరకు (20) నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన చిక్కటి గ్రేవీతో చేపల పులుసు రెడీ..