Thursday, 19 November 2026
తాజా
Sorakaya SarvaPindi : సాంప్రదాయ సొరకాయ సర్వపిండి వంటకం.. Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ Cure Diabetes : మెంతులు ఇలా తింటే షుగర్ ఇట్టే తగ్గుతుంది.. ఎంత ఉన్నా నార్మల్‍కు వస్తుంది Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..! Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు… Mughlai Chicken Curry Recipe : రెస్టారెంట్ దాబా స్టైల్లో చిక్కటి గ్రేవీతో మొగలాయ్ చికెన్ కర్రీ.. సూపర్ టేస్టీ గురూ..! Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే
Ayurvedam

Fenugreek Benefits : మెంతికూరతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. ఈ సమస్యలు ఉన్నవారు తప్పక తినాల్సిందే..!

mearogyam May 29, 2022
fenugreek-benefits-good-for-your-brain-function-with-methi-seeds

Fenugreek Benefits : ప్రతిరోజు ఆకుకూరలను ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదు. మనకు నిత్యం పలు రకాల ఆకుకూరలు లభిస్తుంటాయి. వాటిలో మెంతికూర ఒకటి. మెంతికూరను తరుచు ఆహారంలో తీసుకుంటే అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఆకుతో పాటు మెంతి గింజలు కూడా వినియోగించుకోవచ్చు. ప్రధానంగా మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు తగ్గించడంలో మెంతికూర కీలక పాత్ర పోషిస్తుంది. కాల్షియం, మాంగనీస్, మినరల్స్, సెలీనియం, ఐరన్, జింక్ లాంటి పోషకాలు కలిగి ఉంటాయి.

టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నవారు పచ్చి మెంతి ఆకులు తింటే చక్కర స్థాయి నియంత్రణలో ఉంటుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్‏ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిచడంలో మెంతికూర సహాయపడుతుంది. దీంతో గుండె సమస్యల ముప్పును నివారిస్తుంది. మెంతి ఆకుల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తూ.. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.

fenugreek-benefits-good-for-your-brain-function-with-methi-seeds
fenugreek-benefits-good-for-your-brain-function-with-methi-seeds

అధిక రక్తపోటుతో బాధపడేవారు మెంతి ఆకులు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఇందులో ఉంటే గెలాక్టోమన్నన్, పొటాషియం కారణంగా రక్త ప్రసరణ నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గడానికి, కడుపులో అల్సర్, పేగు మంట సమస్యను నివారించడంలో మెంతికూర ఉపయోగపడుతుంది.

దగ్గు, బ్రోన్కైటిస్ ఎగ్జిమా వంటి వ్యాధులతో బాధపడేవారు మెంతికూర తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే శరీరంలో ఎసిడీటీ స్థాయిని తగ్గిస్తుంది. పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. తరుచు మెంతికూర తింటే పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే బాలింతల్లో తల్లిపాలు పెరగడానికి మెంతికూర సహాయపడుతుంది. రోజు ఒక స్పూన్ మెంతి ఆకుల రసాన్ని పిల్లలకు తాగిస్తే.. నులిపురుగులు తగ్గుతాయి.

Read Also : Eating Gaggery : బెల్లం.. మోతాదుకు మించితే అసలుకే ఎసరు..!

సంబంధిత వార్తలు