Covid-19 Vaccine : ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేదా? ఇది తెలుసుకోండి.. లేక‌పోతే చాలా ప్ర‌మాదం..!

Covid-19 Vaccine : క‌రోనా మూడేళ్ల కింద‌టి వ‌ర‌కు ఈ పేరు ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. 2019 జ‌న‌వరి నుంచి సాధార‌ణ ప్ర‌జ‌లకు దీని గురించి తెలిసింది. దేశంలో అక్క‌డ‌క్కడా కేసులు న‌మోదు కావ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయ్యింది. ​ రాష్ట్రాల‌కు కొన్ని సూచ‌న‌లు చేసింది.

మార్చిలో కేసులు బాగా పెరుగుతుండ‌టంతో ఇక చివ‌రి మార్గంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించింది. ఆ లాక్ డౌన్ చాలా మంది జీవితాల‌ను అత‌లాకుత‌లం చేసింది. ఓ వైపు క‌రోనా చాలా మందిని బ‌లిగొంది. లాక్ డౌన్ వ‌ల్ల ఆక‌లి, నిరుద్యోగం పెరిగింది. అంత‌లా జీవితాల‌ను ప్ర‌భావం చేసింది ఈ క‌రోనా మ‌హ్మ‌మారి.

​ప్ర‌భుత్వ చ‌ర్య‌ల ఫ‌లితం, ప్ర‌జ‌లు క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌డం వ‌ల్ల క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. దీంతో పాటు క‌రోనాకు వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వ‌చ్చింది. వ్యాక్సినేష‌న్ ప్రక్రియ వేగ‌వంతం అయ్యే కొద్దీ క‌రోనా కూడా త‌గ్గుముఖం ప‌ట్టింది.

అయితే ఇప్పటికీ చాలా మంది మొద‌టి డోస్ వ్యాక్సిన్ వేసుకోలేదు. ఇది చాలా ఆందోళ‌న‌క‌ర‌మైన విష‌యం. ఓ వైపు ప్ర‌జ‌ల్లో కూడా నిర్ల‌క్ష్యం కూడా క‌నిపిస్తుడంతో మ‌రో వైపు కేసులు కూడా పెరుగుతున్నాయి. మాస్కులు ధ‌రించ‌క‌పోవ‌డం, క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డం ఒక కార‌ణ‌మైతే, వ్యాక్సిన్ వేసుకోక‌పోవ‌డం మ‌రో కార‌ణం.

తెలంగాణ రాష్ట్రంలో మొద‌టి డోస్ కూడా తీసుకోని వారు 36 ల‌క్ష‌ల మంది ఉన్నారు. మొద‌టి డోస్ తీసుకున్న వారిలో 60 శాతం మంది ఇంకా రెండో డోస్ తీసుకోలేదు. దీంతో కేసులు పెరుగుతున్నాయి. ఓ వైపు యూకేలో కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. అక్క‌డి నుంచి రాక‌పోక‌లు సాగుతున్నాయి కాబ‌ట్టి అవి ఇత‌ర రాష్ట్రాల‌కు పాకే అవ‌కాశం లేక‌పోలేదు.

దీనిని రాకుండా అడ్డుకోవాలంటే క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌డంతో పాటు వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే మార్గం. అందుకే తెలంగాణ ప్ర‌భుత్వం ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తోంది. ప్ర‌తీ ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని సూచిస్తోంది.

కరోనావ్యాక్సిన్లు తప్పనిసరిగా అందరూ వేయించుకోవాలి? కరోనా రెండో వేవ్ తగ్గిన తర్వాత కేసులు తగ్గుముఖం పట్టాయి. వైరస్ తీవ్రత కూడా తక్కువగానే ఉంది. అయినప్పటికీ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. సామాజిక దూరాన్ని పాటించాలి.

కొవిడ్ నిబంధనలను పాటించాలి. కరోనా తీవ్రత తగ్గిందని చాలామంది వ్యాక్సిన్లు వేయించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. కరోనా ఇంకా పోలేదని గుర్తించుకోవాలి. కరోనా తీవ్రత మాత్రమే తగ్గింది. వైరస్ ఇంకా పూర్తిగా పోలేదు. ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయరాదని గుర్తించుకోవాలి. వ్యాక్సిన్ల సమర్థతపై కూడా చాలామందిలో ఇంకా అపోహలు ఉన్నాయి.

వ్యాక్సిన్ల విషయంలో అసలే నిర్లక్ష్యం చేయరాదు. కరోనా రెండు డోసులను తప్పనిసరిగా వేయించుకోవాలి. మరికొంతమంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాక నిర్లక్ష్యంగా ఉంటున్నారు. తమకు వైరస్ సోకదులే అని భావిస్తున్నారు.

వాస్తవానికి కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కూడా కరోనా సోకుతుందనే విషయం గుర్తించుకోవాలి. ఎందుకంటే.. కరోనా తీవ్రతను వ్యాక్సిన్ అడ్డుగోలదు కానీ, వైరస్ వ్యాప్తిని మాత్రం కంట్రోల్ చేయలేదు. అలా అనీ వ్యాక్సిన్ వేయించుకోకుండా ఉంటే ప్రాణాలకే ప్రమాదమని గుర్తించుకోవాలి.
Read Also : Papaya Health Benefits :కరోనా వస్తే బొప్పాయి తీసుకుంటే ఎంత త్వరగా కోలుకుంటామో తెలుసా ?

Leave a Comment