Tippa Teega Health Benefits : తిప్పతీగ ఆకుల రసంతో ఆయుర్వేద వైద్యంలో ప్రత్యేకత మాటల్లో చెప్పలేనిది. కరోనా వైరస్ సమయంలో ఆయుర్వేదానికి మంచి డిమాండ్ పెరిగింది. వైరస్ ప్రభావంతో ప్రతి ఇల్లూ ఒక ఆయుర్వేద వైద్యశాలగా మారిపోయిందనే చెప్పాలి. ఆయుర్వేదంలో రకరకాల మూలికలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయని పలు అధ్యయనాల్లో రుజువైంది కూడా. అందులో తిప్పతీగ ఒకటి.. తిప్పతీగలో ( tippa teega benefits in telugu) అంటువ్యాధులను నివారించే ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి.
రోగనిరోధక శక్తికి తిప్పతీగ (Tippa Teega Immunity Booster) బాగా పనిచేస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నివారణలోనూ తిప్పతీగ చేసే మేలు అంతాఇంతాకాదు.. ఆయుర్వేదంలో తిప్పతీగకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తిప్పతీగ (thippa theega)తో లివర్ దెబ్బ తింటుందనే అపోహలు ఉన్నాయి. తిప్పతీగతో లివర్ దెబ్బ తింటుందని, లివర్ సమస్యలు వస్తాయనే ప్రచారంలో వాస్తవం లేదని అంటున్నారు.

ఆయుర్వేదంలో తిప్పతీగతో రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ వంటి సమస్యలతో కూడా తిప్పతీగలోని యాంటీ ఆక్సిడెంట్స్ ధీటుగా పోరాడగలవు. అంతేకాదు.. శరీరంలోని రక్త కణాలు దెబ్బతినకుండా తిప్పతీగ అద్భుతంగా సాయపడుతుంది. అనారోగ్య సమస్యలను కూడా వెంటనే తగ్గించగలదు. అలాగే వానాకలం సీజన్ సమయంలో వచ్చే సీజనల్ వ్యాధుల్లో డెంగ్యూ, మలేరియా లాంటి విషజ్వరాలను కూడా తేలికగా తగ్గించగలదు. మానసిక సమస్యలతో బాధపడేవారిలో ఒత్తిడి, ఆందోళన సమస్యలను ఇట్టే తగ్గించుకోవచ్చు.
మానసిక ఒత్తిడి తగ్గాలంటే (Mental Stress) :
మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు తిప్పతీగ అద్భుతంగా పనిచేస్తుంది. తిప్పతీగ వాడటం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆందోళన సమస్యలను తగ్గించుకోవచ్చు. జ్ఞాపక శక్తి కూడా పెంచుకోవచ్చు. తిప్పతీగ ద్వారా అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. జీర్ణ వ్యవస్థను బాగా మెరుగుపర్చడంలో తిప్పతీగ బాగా పనిచేస్తుంది. అజీర్తి వంటి అసిడిటీ సమస్యలతో ఇబ్బంది పడేవారు తిప్పతీగతో తయారుచేసిన మంచి ఔషధాలను వాడటం ద్వారా తొందరగా ఉపశమనం పొందవచ్చు. అలాగే షుగర్ వ్యాధికి కూడా తిప్పతీగ అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. టైప్ 2 డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నవారికి తిప్పతిగ దివ్యౌషధంగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా బాగా తగ్గిస్తుంది. తిప్పతీగ ఆకుల రసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధిక మొత్తంలో ఉంటాయని ఆయుర్వేద వైద్యం చెబుతోంది.
శ్వాసకోస సమస్యలు తగ్గాలంటే :
శ్వాసకోస సమస్యలతో బాధపడేవారికి తిప్పతీగ ఆకుల రసం దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారికి తిప్పతీగ బాగా పనిచేస్తుంది. కీళ్ళ వ్యాధులకు కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది. కంటి చూపును పెంచుకోవడానికి తిప్పతీగను మించిన ఔషధం లేదంటోంది ఆయుర్వేదం. వృద్ధాప్యం వంటి ఛాయలు దరిచేరకుండా అడ్డుకుంటుంది. తిప్పతీగతో రక్తాన్ని శుద్ధి చేసుకోవచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నిర్మూలిస్తుంది. లివర్ సమస్యలను కూడా వెంటనే తొలగిస్తుంది. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా వెంటనే నివారిస్తుంది. తిప్పతీగలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జ్ఞాపక శక్తిని మెరుగు పరిచడమే కాదు.. ఒత్తిడిని కూడా తగ్గించగల శక్తి అధికంగా ఉన్నాయి.

బౌల్ సంబంధిత సమస్యలను కూడా తొందరగా నిర్మూలించగలదు. పింపుల్స్ సమస్యలతో పాటు డార్క్ స్పాట్స్ కూడా తొందరగా తగ్గించగలదు. తిప్ప తీగ రసాన్ని అధికంగా తీసుకుంటే మలబద్దకం సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే మితంగా తిప్పతీగ తీసుకోవాలని ఆయుర్వేద వైద్యం సూచిస్తోంది. అంతేకాదు.. సొంత వైద్యం ఎప్పటికీ చేటు అనే విషయం గుర్తించుకోవాలి. ఏ ఔషధం తీసుకున్నా ఆయుర్వేద వైద్యులు సలహాలతో మాత్రమే తిప్పతీగ ఔషధాన్ని తీసుకోవాల్సి ఉంటుందని గుర్తించాలి. అలాగే ప్రసవించిన తల్లులు తమ పిల్లలకు పాలు ఇచ్చే సమయంలో ఈ తిప్పతీగను వాడడరాదు.. లేదంటే చాలా ప్రమాదమని గుర్తించుకోవాలి.
కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో తిప్పతీగను ఎక్కువ వాడేవారి సంఖ్య పెరిగిపోయింది. కరోనా కారణంగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారంతా ప్రకృతిసిద్ధమైన వనమూళికలను వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే కెమికల్ మందుల కంటే ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయని నమ్ముతున్నారు. కరోనా ప్రభావంతో 60శాతం మంది ఇండియన్స్ తిప్పతీగను వినియోగిస్తున్న ఓ నివేదక వెల్లడించింది. ఎన్నో రకాల సమస్యలకు కూడా తగ్గించిందని నిర్ధారించారు.
లివర్ దెబ్బతినే ప్రమాదం ఉందా? (Liver Problems) :
తిప్పతీగను రసం రూపంలోగానీ, మాత్రల ముద్దలా గానీ ఎలా తీసుకున్నా పెద్దగా సమస్యలేమి రావని పలువురు వైద్యులు చెబుతున్నారు. కానీ, తిప్పతీగతో లివర్ సమస్య వస్తుందని దెబ్బతింటుందని అందోళన చెందుతున్నారు. వాస్తవానికి తిప్పతీగతో ఎలాంటి దుష్ర్పభావాలు ఉండవని వైద్యులు చెబుతున్నారు. కొద్దిమొత్తంలో అనారోగ్యకర సమస్యలు తలెత్తాయని అంటున్నారు. అందులో కొంతమందికి షుగర్ లెవల్స్ తగ్గిపోవడం, స్పృహ కోల్పోవడం వంటివి జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకానీ, ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. గర్భిణులు, ప్రసవించిన తల్లులు మాత్రమే ఈ తిప్పతీగ తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎంత గొప్ప ఔషధమైనా అతిగా వాడితే ప్రమాదమేననే విషయం అందరూ గుర్తించుకోవాలి.
Tippa Teega Health Benefits : తిప్ప తీగలో ఎన్ని ఔషధ గుణాలో తెలుసా?
తిప్ప తీగ అనగానే చాలామంది అదేదో పిచ్చి మొక్క అనుకుంటారు. చూడాటానికి అచ్చం అలానే ఉంటుంది. చాలామందికి మొక్క ఎలా ఉంటుందో తెలియదు కూడా. అందుకే అది పనికిరాని మొక్కగా చూస్తుంటారు. తిప్పతీగ చూడటానికి పాలతీగ లానే ఉంటుంది. కొంచెం ఆకుల పరిమాణం తెలిసినవాళ్లు చూస్తే ఈజీగా గుర్తుపట్టొచ్చు కూడా. తిప్పతీగ ఔషధ గుణాల గురించి తెలిస్తే ఈ మొక్కను అసలే వదిలిపెట్టరు. సాధారణంగా చుట్టుపక్కలా గడ్డి పెరిగే ప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతుంది. పంట పోలాల్లో చెట్లపొదల మధ్యలో ఈ తిప్పతీగ పాకినట్టుగా ఉంటుంది.
ఈ మొక్క తీగ చెట్లకు పాకుతుంది. ఆకులను చూసి తిప్పతీగను కనిపెట్టొచ్చు. తిప్పతీగను తెంచుకుని వచ్చి బాగా కడిగేయాలి. ఎందుకంటే.. తిప్పతీగపై అనేక రోగకారక క్రిములు దాగి వుంటాయి. అందులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నా పైభాగంలో ఆకులపై కాండంపై కీటకాలు, క్రీములు దాగి ఉంటాయి. ఇంటికి తీసుకురాగానే ఆ మొక్కను శుభ్రంగా కడిగేయాలి. కంటికి కనిపించని ఏమైనా క్రీములు, బ్యాక్టిరీయా ఉంటే తొలగిపోతాయి. శుభ్రంగా కడిగిన తర్వాత రసాన్ని తీసుకోవాలి. తిప్పతీగను ఎంచుకునే ముందు మంచి ఆకులను తీసుకోవాలి. మట్టిలో మొక్క ఉండటం ద్వారా అనేక రోగకారక క్రీములు ఉంటాయి.

తీగను బాగా శుభ్రపరుచుకోవాలి. అవసరమైతే గోరు వెచ్చని నీటిలో కూడా వేసి కాసేపు ఉంచి తీసిన పర్వాలేదు. ఆ తర్వాత ఔషధంగా తయారుచేసుకోవాలి. తయారు చేసిన మిశ్రమాన్ని ఒక గాజు సీసాలోగానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలోగానీ భద్రపరుచుకోవాలి. అప్పటికప్పుడూ తీసిన తిప్పతీగ రసాన్ని ఎక్కువ మొత్తంలో తయారుచేయడం కంటే అవసరానికి తగినట్టుగా తయారుచేసుకోవడం మంచిది. తాజాగా తిప్పతీగ రసాన్ని తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేదం సూచిస్తోంది. మీ ఇంట్లో ఈ మిశ్రమాన్ని తయారుచేసుకునే ముందు అవసరమైన అన్ని రెడీ చేసుకోవాలి.
అలర్జీ సమస్యలు ఉన్నాయా? :
తిప్పతీగ ద్వారా ఔషధాన్ని తయారుచేసే ముందు అది ఆరోగ్యానికి సురక్షితమా లేదా అనేది పూర్తిగా విశ్లేషించుకోవాలి. ఎందుకంటే చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ తిప్పతీగ ఔషధాన్ని సేవించడం ద్వారా ఏమైనా ఇతర అలర్జీల వంటి సమస్యలు తలెత్తుతాయో లేదో ముందుగా తెలుసుకోవాల్సిన అంశం. ఆ తర్వాతే తిప్పతీగ వినియోగించుకోవడం చాలా ఉత్తమమైన పనిగా గుర్తించుకోవాలి.
మీరు ఎంచుకున్న తీగపై ఏమైనా తెల్లటి చారలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సాధారణంగా ఆకులపై ఇతర క్రీమికీటకాలు విసర్జిస్తుంటాయి. అలాగే పురుగులు తినేస్తుంటాయి. అలాంటి ఆకులు కాకుండా స్వచ్ఛమైన ఆకులు, తీగలనే తీసుకోండి. మీరు తీసుకునే ఆకులు శుభ్రంగా ఉంటే.. మీరు తయారుచేసుకునే ఔషధం కూడా అంత పరిశుభ్రంగా వస్తుంది. ఔషధ గుణాలు ఉన్న తిప్పతీగ రసాన్ని శుభ్రంగా వడకట్టుకోవాలి.
అందులో మీరు తీసిన మొక్క తాలుకూ పిప్పి కూడా వస్తుంది. అది కూడా తాగినా మంచిదేకానీ, అలర్జీల వంటి కొన్ని రకాల సమస్యలు కూడా రావొచ్చు. అది అందరికి కాదు.. బాగా సెన్సిటీవ్ గా ఉండేవారికి మాత్రం ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. ఏది ఏమైనా ప్రకృతిపరంగా లభించే ప్రతిమొక్కలో ఏదో ఒక రకమైన ఔషధ గుణం ఉండే ఉంటుంది. అది ఎలా ఏ ఆరోగ్య సమస్యకు ఉపయోగపడుతుందో గుర్తించడమే కష్టం..
Read Also : Gas Pain or Heart Attack : గుండెనొప్పి, గ్యాస్ నొప్పికి మధ్య తేడాలివే.. ఇలా గుర్తించండి..