Tella Galijeru : తెల్ల గలిజేరు మొక్క గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ తెల్లగలిజేరు మొక్క ఎక్కువగా బయటి పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ తెల్లగలిజేరుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎలాంటి రోగమైన కొద్ది రోజుల్లోనే నయం చేయగల అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ తెల్లగలిజేరు ఆకులతో కూరలను కూడా వండుకోవచ్చు. ఈ మొక్క ఆకులతో కిడ్నీల్లో ఎంతంటి రాళ్లు అయినా వెంటనే కరిగిపోవాల్సిందే. ఈ తెల్ల గలిజేరు మొక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అంతే దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.
ఇంతకీ, ఈ తెల్ల గలిజేరు మొక్క ఎక్కడ దొరుకుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ మొక్కని ఎలా గుర్తించాలంటే.. ఈ మొక్కకి ఉన్న పువ్వును బట్టి గుర్తించవచ్చు. తెల్ల గలిజేరు మొక్కతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. శరీరంలోని అవయవాలను సరిగా పనిచేసేలా చేయగలదు. వర్షం పడగానే ఎక్కడపడితే అక్కడ పెరిగే అద్భుతమైన ఆయుర్వేద మొక్కగా చెబుతారు.
తెల్ల గలిజేరు అత్యంత ప్రాణాంతకమైన అనారోగ్యాలకు ఔషధాలను అందిస్తుంది. ఆయుర్వేదంలో ఈ తెల్లగలిజేరు మొక్క పేరు పునర్నవా అని పిలుస్తారు. ఆయుర్వేద మందుల్లో నొప్పిని తగ్గించే ఔషధంగా ఈ మొక్క ఆకులను వాడుతారు. రక్తాన్ని శుద్ధిచేయడంలో కూడా ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది.
నేల మీద పాకే ఈ మొక్క మూడు రకాలుగా దొరుకుతుంది. అందులో తెలుపు, ఎరుపు, నలుపు ఔషధ గుణాలు మూడింటికి ఒకేలాగా కనిపిస్తాయి. ఇందులో తెల్ల గలిజేరు చాలా ఉత్తమమని చెబుతారు. ఈ మొక్కకు చిన్న చిన్న పువ్వులు ఉంటాయి. రంగులను బట్టి అది ఏ రంగు మొక్క అని చెప్పవచ్చు. తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు మనకి దగ్గరలో దొరుకుతుంది. కానీ, నల్ల గలిజేరు చాలా అరుదుగా దొరుకుతుంది. తెల్ల గలిజేరు ఉపయోగాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Tella Galijeru : కిడ్నీలో రాళ్లను కరిగించే తెల్లగలిజేరు..
తెల్ల గలిజేరును వేడి నీటిలో మరిగించి తాగితే కఫం, దగ్గు, పాడు రోగాలు తగ్గిపోతాయి. శరీరానికి కలిగే వాపులు, వాత వ్యాధులు కడుపుకి సంబంధించిన వ్యాధులు కాలేయ వాపుని, గుండె బలహీనత వల్ల వచ్చిన వ్యాధిని తగ్గిస్తుంది. మూత్రపిండాలను బాగు చేసి సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. కిడ్నీల్లో ఏమైనా రాళ్లు ఉంటే వెంటనే కరిగిపోతాయి. నెలరోజులు ఈ తెల్లగలిజేరు ఆకులను తింటే కుష్టు రోగాన్ని కూడా హరిస్తుంది.

ఈ వేరు నీటిలో అరగదీసి కంటికి పెడితే రేచీకటి తొలగిపోయి కంటిచూపు మెరుగుపడుతుంది. ప్రతిరోజూ ఈ ఆకులను తింటుంటే రక్తం శుభ్రపడతుంది. నడకరాని పిల్లలకు ఇదే తైలం మర్దన చేసి తర్వాత స్నానం చేస్తే నడక వస్తుందని మూలిక వైద్యులు చెబుతున్నారు. గలిజేరు ఆకు వేడి చేసి కడితే బోదకాలు కూడా తగ్గుతుంది. ఈ మొక్క ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు కూడా మాయమైపోతాయి. ఈ తెల్లగలిజేరు మొక్కను ఎవరు తినకూడదో తెలుసుకుందాం..
ఎవరైనా సరే ఈ తెల్లగలిజేరు మొక్కను అతిగా తినకూడదు. తీవ్రమైన వ్యాధులు కలిగిన వారు, ఇతర మందులను తీసుకునే వాళ్లు తప్పనిసరిగా వైద్యుడి సలహా తీసుకొని వాడాలి. డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు చలువ చేసే పదార్థాలు అధికంగా తినాలి. ఈ తెల్లగలిజేరు ఆకుకూరని మాత్రం మితంగా తీసుకోవాలి. పాలిచ్చే తల్లులు, గర్భిణీలు ఈ ఆకుకూరను అసలు తినకూడదు. ఆరోగ్యం మంచిగా ఉన్నవారు వర్షాకాలంలో వారానికి ఒకసారి తింటే సరిపోతుంది.
ఈ మొక్కలోని పోషక విలువలు పుష్కలంగా అందుతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు వారానికి రెండు నుంచి మూడు సార్లు పప్పులో వండుకొని తింటే మంచిది. ఇలా చేస్తే.. త్వరగా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సాధారణంగా తెల్లగలిజేరు మొక్క పల్లెటూరులో ఎక్కడపడితే అక్కడ బాగా దొరుకుతుంది. ఇప్పుడు సిటీల్లో కొంచెం ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటే ఈజీగా ఈ మొక్కను పెంచుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్ మార్కెట్లో కూడా ఈ మొక్క విత్తనాలు దొరుకుతాయి.
Read Also : Ranapala Helath Benefits : రణపాల మొక్క.. సర్వ రోగాలకు దివ్యౌషధం.. రోగం ఏదైనా ఇట్టే పారిపోవాల్సిందే..!