Sore Throat Infection : రాబోయేది అసలే వింటర్.. ఈ సీజన్‌లో చాలామంది జలుబుతో బాధపడుతుంటారు. ఇక కొంచెం ముక్కు సమస్యలు ఉన్న వారికి ఈ సీజన్‌తో మరింత ఇబ్బంది. చలి కాలంలో దగ్గు, జ్వరం బారిన సైతం పడుతుంటారు. ఈ క్రమంలో వీటి నుంచి బయట పడేందుకు చాలా మంది డాక్టర్ల సూచనలతో మందులు వాడుతుంటారు. ఇలా.. ప్రతి చిన్న విషయానికి మందులు వాడటం అంత మంచిది కాదని నేచురల్ డాక్టర్ హెచ్చరిస్తున్నారు.
మనం రెగ్యులర్ గా ఇంట్లో వాడే ఇంగ్రీడియన్స్‌తో వీటి నుంచి ఉపశమనం పొందొచ్చని సూచిస్తున్నారు. మనదేశ ఆయుర్వేదానికి ఉన్న స్పెషాలిటీ గురించి స్పెషల్ చెప్పాల్సిన అవసరమే లేదు. పెద్ద పెద్ద వ్యాధులకు సైతం ప్రకృతి పరంగా లభించే మూలికలతో నయం చేయొచ్చు. ఇక జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న వ్యాధులకు మన ఇంట్లోని పదార్థాలతోనే చెక్ పెట్టొచ్చు. ప్రస్తుత కాలంలో కరోనా వ్యాపిస్తుండటంతో దీనిని సైతం ఎదుర్కోవచ్చు.
చిన్న మట్టి కుండలో ఓ గ్లాసు నీరు పోసి మరిగించాలి. దానిలో దాల్చినచెక్క, రెండు లవంగాలు, యాలకులు వేసి కాస్త తురిమిన అల్లం, కొంచెం నల్ల ఉప్ప, పసుపు నల్ల మిరియాలు వేయాలి. 6 తులసి ఆకులు సైతం అందులో వేయాలి. ఈ నీరు సగం అయ్యే వరకు అలాగే మరిగించాలి. తర్వాత దానికి వడపోసి రోజుకు రెండు సార్లు తాగితే జలుబు, చాతినొప్పొ వంటి వాటి నుంచి ఉపశమనం పొందొచ్చు. దీనితో పాటు రోగ నిరోధక శక్తిని పెరిగి వైరస్‌ల నుంచి రక్షణ లభిస్తుంది. ఇలాగే అల్లంతో కషాయాన్ని తయారు చేసుకోవచ్చు. దీని వల్ల గొంతునొప్పి, జలుబు, దగ్గు వంటి వాటి నుంచి రిలీఫ్ పొందొచ్చు.
కప్పు నీటిని వేడి చేసి అందులో మిరియాలు, కాస్త నిమ్మరసం వేసి బాగా మరగనివ్వాలి. తర్వాత దించెయ్యాలి. దీనిని ప్రతిరోజూ ఉదయం తాగడం వల్ల చలి నుంచి రిలీఫ్ పొందొచ్చు. దీనితో శరీరంలో వేడి పెరుగుతుంది. బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ సైతం తగ్గుతుంది. శీతాకాలం వచ్చిందంటే చాలు..
చాలామందిని ఇబ్బంది పట్టే సమస్య.. జలుబు, దగ్గు, తుమ్ములు.. ఎలర్జీ సమస్యలు అధికంగా వస్తుంటాయి. ఈ సమస్యలను సాధారణ రెమడీలతో సులభంగా తగ్గించుకోవచ్చు. కానీ, కొంతమంది వెంటనే తగ్గిపోవాలనే తొందరలో అవసరంలేని యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. ఈ మందులు జలుబును తొందరగా గట్టిపడేలా చేస్తాయి కావొచ్చు.. కానీ, సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి.
ఆయుర్వేదపరంగా జలుబుకు అనేక ఆరోగ్యకరమైన చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అందులో వంటంటి దినుషులతో మహా అద్భుతంగా పనిచేస్తాయి. జలుబును, కోరింత దగ్గను నివారించడంలో ఈ ఆయుర్వేద చిట్కాలు బ్రహ్మండంగా పనిచేస్తాయనడంలో సందేహం లేదు. శరీరంలో వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోయినప్పుడే వ్యాధులు సంక్రమిస్తాయి.
రోగసూక్ష్మజీవులను ఎదుర్కొగల శక్తి మన రోగనిరోధక వ్యవస్థకు లేనప్పుడు వైరస్, బ్యాక్టీరియాలు రెచ్చిపోతాయి. ఫలితంంగా అనారోగ్యానికి తొందరగా గురవుతుంటారు. ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టాలంటే ఆయుర్వేదంలో లభించే అనేక ఔషధ గుణాలు కలిగిన మూలికలతో పాటు వంట దినుషులు మంచి ప్రయోజకరంగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీజనల్ వ్యాధుల నుంచి తొందరగా బయటపడేందుకు ఈ రెమడీలు బాగా ఉపయోగపడతాయి.
Read Also : Ayurveda Tea Benefits : ఆయుర్వేద ‘టీ’తో జీర్ణక్రియ సమస్యలకు చెక్.. కాంతివంతమైన చర్మం మీ సొంతం..