Eye Cataracts : మన భారతీయ శాస్త్రాల్లో మనకు లభించే ఎన్నో చెట్ల బెరడుల నుంచి ఔషధాలు తయారు చేయొచ్చని విపులంగా రాశారు. కానీ వాటికి గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అలా అనేక ఔషధ గుణాలు కలిగిన వృక్షం రావి చెట్టు. ఈ చెట్టును పీపుల్స్ ట్రీ అని కూడా పిలుస్తారు. రావి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ చెట్టును అధ్యాత్మికంగా కూడా ఎక్కువగా పూజిస్తారు. అందుకోసమే రావి చెట్టును కొట్టేందుకు ఎక్కువ శాతం మంది జంకుతారు. ఇలా రావి చెట్లు తమ ఉనికిని కోల్పోకుండా ఉన్నాయి. రావి చెట్లను పంచాయతీకి భవనాలు లేని చోట మరియు స్కూళ్లకు తరగతి గదులు లేని చోట కూర్చునేందుకు వీలుగా ఉపయోగిస్తున్నారు. రావి చెట్టు ఆకులలో ఆక్సిజన్ లెవల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.

ఇక మనదేశంలో పాత రోజుల నుంచే ఎన్నో రకాల వ్యాధులను నయం చేసేందుకు రావి చెట్టు ను ఉపయోగిస్తున్నారు. ఈ చెట్టు హిందువులు మరియు బౌద్ధులకు ఎక్కువగా పూజనీయం. జలుబుతో బాధపడే వారు ఈ ఆకులను వేడి నీటిలో వేసి మరిగించి దాని ద్వారా వచ్చిన రసంలో చెక్కర వేసుకుని రోజుకు రెండుసార్లు తాగితే జలుబు నయమవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా ఉన్న వారు రాగి పండ్లను ఉపయోగించడం వలన త్వరిత ఉపశమనం పొందొచ్చు.
Eye Cataracts : రావి చెట్టు ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
ఈ రావి పండ్ల నుంచి రసాన్ని బయటకు తీసి ఆ పండ్లను ఎండలో ఎండబెట్టాలి. తర్వాత ఆ పండ్లను పొడి చేసి ఆ పొడిని నీటిలో కలుపుకుని 14 రోజుల పాటు తాగితే ఆస్తమా తగ్గుతుంది. రావి ఆకుల నుంచి వచ్చిన పాలను కంటి శుక్లాలు ఉన్న వారు వినియోగిస్తారు. శుక్లాలు వచ్చినపుడు కళ్ల నొప్పి పోయేందుకు రావి ఆకులను పిండుకుని రసాన్ని కళ్లకు అప్లై చేస్తే కొద్ది నిమిషాల్లోనే నొప్పి మటుమాయం అవుతుంది. రావి ఆకుల రసాన్ని పిండి ముక్కులో పోస్తే ముక్కు నుంచి రక్తం కారే వారికి వెంటనే తగ్గిపోతుంది.
Read Also : Zodiac Signs : ఈ రాశుల వారు చాలా ఎమోషనల్.. ప్రతీ చిన్న విషయానికే కన్నీరు పెట్టుకుంటారట!