Elaichi Benefits in ayurveda : యాలకులను ఏళ్ల తరబడిగా ఆయుర్వేద శాస్రీయ వైద్యంలో వినియోగంలో ఉందని సుశ్రుత సంహిత , కరక సంహిత వంటి అనేక గ్రంథాలలో ఉంది. యాలకుల తయారి ఇలాది మొదక, ఇలా ద్యారిష్ట, అరవిందసవ ఇలాదికర్న, ఇలాదివతి, ఇలాదిక్వత వంటి ఔషధాలు ఇందులో ఉంటాయి. శరీరానికి చలువ చేసే గుణాలు ఉంటాయి. దీంతో అనవాయితీగా విటిని వంటకాలలో వినియోగిస్తున్నారు.
యాలకుల్లో అద్భతుమైన ఔషధ గుణాలు :
యాలకులకు సుంగంధ ద్రవ్యాల్లో ఓ ప్రత్యేకత. మన పూర్వీకులు యాలకులను ఆయుర్వేదంలో వాడేవారు. ఆధునిక జీవన శైలిలో చాలా మంది రుగ్మతలతో బాధపడుతుంటారు. వారిలోని ఆరోగ్య సమస్యలకు యాలకులు ఆయుర్వేదంగా పని చేస్తాయి. యాలకులతో ఎక్కవగా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఎన్నో సమస్యలకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. యాలకులు ఎక్కవగా మన పక్కనే ఉన్న దేశాలు భూటాన్, నేపాల్, ఇండోనేషియాతో పాటు భారత్‌లో లభిస్తాయి. యాలకులను వంటకాలలో ఉపయోగిస్తారు. సాధారణంగా ఇవి అందరి ఇంట్లో ఉంటాయి. వంటింట్లో లభించే యాలకుల్లోని గుణాలు ఆహారాన్ని జీర్ణం చేయగల శక్తితో పాటు జీర్ణశక్తిని బాగా మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా యాసిడ్ రిఫ్లిక్స్ పొగొడుతుంది. యాలకులలో పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషీయం ఉంటుంది. ఇటి గుండె పని తీరు, రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
సుగంధ ద్రవ్యాల్లో మూడో స్థానం :
యాలకులలో ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. యాలకులతో ఆస్తమా కూడా తగ్గుతుంది. యాలకులు జింగీబెరాసెయ్ మొక్క నుంచి దొరకుతాయి. ఇటి భారత్‌లో పాటు ఇండోనేషియా, నేపాల్, భూటాన్ దేశాలలో దొరుకుతాయి. ఇవి ప్రపంచంలో ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో మూడో స్థానంలో ఉన్నాయి. యాలకులు కాన్సర్ వ్యాధిని కూడా అడ్డుకుంటాయి. ఎవరైనా డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే యాలకులతో చేసిన టీ, లేదా పాలు తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా సంతాన సాఫల్యత పెంచడానికి కూడా యాలకులు ఎంతోగానో ఉపయోగపడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. యాలకులలో సినియోల్ కాంపౌండ్ పురుషులలో నరాల పటిష్టం చేస్తోంది. సంతానం లోపం ఉన్న దంపతులు రోజు విడిగా యాలకులు వాడితే మంచి ఫలితం వస్తుంది డాక్టర్లు చెబుతున్నారు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :
ముఖ్యంగా యాలకుల్లో మెటబాలిజంను మెరుగుపరిచి, చక్కగా జీర్ణక్రియ పని చేసేలా చేస్తుంది. కడుపులో మంట,నొప్పి పొగొడతాయి. చాలా మంది కుటుంబ సమస్యలు తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. కొన్ని సార్లు ఆత్మహత్య చేసుకుంటారు. ఇలాంటి వారికి యాలకులు మారిని సాధారణ పరిస్థితికి తీసుకొస్తాయి. డిప్రెషన్‌లో ఉన్న వారు టీ లేదా పాలులలో యాలకులు కలుపుకుని తాగితే డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందుతారు.
యాలకులు ఆస్తమాకి విరుగుడుగా పని చేస్తాయి. దగ్గు, కఫంతోొ పాటు శ్వాస ఊపిరాడకపోవడం, రొమ్ము దగ్గర ఏదో పట్టేసినట్లుగా అనిపిస్తుంటుంది. ఇటివారు రెగ్యులర్‌గా యాలకులు వాడితే మంచి ఫలితం ఉంటుంది. యాలకులు రక్త ప్రసవరణను తెలియ చేస్తాయి. మన ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి, కఫాన్ని కూడా వెంటనే తగ్గిస్తాయి గ్రీన్ యాలకులతో ఆస్తామా శ్వాస సంబంధితం వ్యాధులను నయం చేస్తాయి. డయాబెటిస్‌కి ఉన్న వారు రోజు యాలకులు తీసుకుంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. యాలకులతో ఉండే మాంగనీస్ డయాబెటిస్‌కు బాగా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. బీపీని తగ్గించేందుకు యాలకులు పని చేస్తాయి. సూప్స్, బేకింగ్ ఐటెమ్స్‌లో వాటిని పొడి చేసి వాడితే మంచి ఫలితం ఇస్తుంది.
కాన్సర్‌ను తగ్గించగలదు :
యాలకులకు కాన్సర్‌ను తగ్గించే అవకాశాలు ఉంటాయి. యాలకులు కాన్సర్‌ను తగ్గిస్తాయని ఇటివల పరిశోధనలు స్పష్టమైంది. జంతువులపై జరిపిన పరిశోధనలలో తేలింది. యాలకులలో సువాసన, రుచి హార్ట్ ఫెయిల్యూర్ తగ్గిస్తాయి. మానసిక ఒత్తిడితో బాధపడే వారు పాలు లేదా టీలో యాలకుల పొడి వేసుకుని తాగడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. యాలకులు గుండెకు ఎంతో మేలు స్తాయి. వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, ఫైబర్, ఇతర పోషకాలు.. ఉండెలోని కొలోస్ట్రాల్ లెవెల్ తగ్గిస్తాయి. రక్త సరఫరా అయ్యేలా చూసి, గుండెను కాపాడతాయి.
యాలకుల ద్వారా శరీరంలో ఉన్న దుమ్ము ధూళి వలన వచ్చే సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మానసికంగా ఒత్తిడితో ఉన్న వారు యాలకుల టీ, లేదా పాలు తాగడం నూతన ఉత్సాహం కలిగిస్తుంది. మాంసాహారంతో తిన్న తరువాతో నోటిలో యాలకులు వేసుకుని నమిలి తింటారు. యాలకుల ద్వారా నోటిలో ఏర్పడిన క్రిముల తొలగిపోయి నోరు దుర్వాసన రాకుండా ఉంచుతుంది. ఆహారం కూడా తేలికగా జీర్ణం అవుతుంది. అధిక బరువుతో బాధపడే వారు రోజు పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో యాలకులు వేసుకోని తాగడం వలన బరువు తగ్గొచ్చు.
శృంగార సమస్యలకు చెక్ :
యాలకులు శృంగార పరమైన సమస్యలకు బాగా పని చేస్తాయని ఇటివల చేసిన పరిశోధనలో వెల్లడైంది. శృంగారంలో సరిగ్గా పాల్గొనలేక బాధపడుతున్నవారు. రోజు యాలకులు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రోజు ఒకటి లేదా రెండు స్పూన్ల యాలకులు తీసుకుంటే పురుష్యలలో వీర్య కణాల వృద్ది చెందుతాయని పరిశోధనలలో వెల్లడైంది. ఎక్కవ మంది శృంగారంలో శీఘ్ర స్ఖలన సమస్యతో బాధపడుతుంటారు. వారి సమస్యను యాలకులతో చెక్ పెట్టవచ్చు. యాలకులు విధిగా వాడితే శృంగారంలో బాగా పాల్గొనవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. యాలకుల లో లిమొనెన్, టెర్పినోల్ టర్పనైన్, లాంటి గుణాలు ఉంటాయి. వాటిని సంప్రదాయ వైద్యంలో మందుగా వాడతారు. కెమోధెరఫీ వల్లన వచ్చే దుష్ప్రభావాలు తగ్గించే శక్తి యాలకులతో ఉంటుంది. అజీర్తి, శ్వాస సంబంధమైన ఆస్థమా, జలుబు, మలబద్దకం, అల్సర్ మొదలైన వ్యాధులలోను ఇవి బాగా పని చేస్తాయి.
Read Also : Instant Breakfast Recipes : 5 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్ ఫాస్ట్‌ల గురించి మీకు తెలుసా?