Cholesterol Control : మందులు లేకుండా కొలెస్ట్రాల్‌ను ఇలా తగ్గించుకోండి..

how to reduce cholesterol without medication quickly : ఇటీవల కాలంలో కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయి చిన్న వయసు వారు ఊబకాయులు అవుతుండటం మనం చూడొచ్చు. ఈ కొలెస్ట్రాల్ పెరగడానికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది జీవనశైలి. ఒకప్పటితో పోల్చితే జనాలు ప్రస్తుతం పూర్తిగా ఉరుకుల పరుగుల జీవనానికి అలవాటు పడిపోయారు. ఈ క్రమంలోనే ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మరుస్తున్నారు.

శరీరానికి భౌతికమైన పని అస్సలు తగలనీయడం లేదు. కనీసంగం ఎక్సర్‌సైజెస్ అయినా చేయడం లేదు. దాంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతుంది. దాన్ని తగ్గించుకునేందుకుగాను జనాలు డాక్టర్స్‌ను సంప్రదించి ఇంగ్లిష్ మందులను వాడుతున్నారు. ఫలితంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి డిఫరెంట్ డిసీజెస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఈ పద్ధతులు ఫాలో అవండి.

వ్యాయామాలతో చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ :
బాడీతో పాటు రక్తంలోనూ చెడు కొలెస్ట్రాల్ (Bad cholesterol) ఉంటుంది. దానిని అదుపు చేయడం కోసం ప్రతీ రోజు సైక్లింగ్, వాకింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. అలా చేయడం మీ హార్ట్ హెల్త్‌కు చాలా మంచిది. మీ కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్‌లోకి వచ్చి, హెవీ వెయిట్ అనే ఇష్యూ ఉండదిక. క్రమంగా మీరు వెయిట్ కూడా లాస్ అవుతుంటారు. చాలా మంది వెయిట్ లాస్ అవడం కోసం రకరకాల మెడిసిన్స్ వాడుతుంటారు. కానీ, వాటి వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండకపోగా, సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా వేరే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చి చేరుతుండటం మనం గమనించొచ్చు.

ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు వాకింగ్, స్విమ్మింగ్‌తో పాటు ఇతర ఈజీ ఎక్సర్‌సైజెస్ చేయడం ద్వారా మీ హెల్త్‌కు చాలా మంచి జరుగుతుంది. ఎక్సర్‌సైజెస్ డెయిలీ చేయడంతో పాటు ఫుడ్ ఐటమ్స్ కొన్నిటినీ తీసుకోకపోవడం వల్ల కూడా మీ కొలెస్ట్రాల్ (cholesterol) కంట్రోల్‌లో ఉంటుంది. ఇకపోతే ప్రతీ రోజు ఎక్సర్ సైజెస్ చేయడం ద్వారా మీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. కరోనా నేపథ్యంలో ప్రతీ ఒక్కరు ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేసుకోవడంపైన దృష్టి పెట్టడం మనం గమనించొచ్చు. కొవిడ్ పుణ్యమాని చాలా మంది తాజా ఫుడ్ ప్లస్ విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

యాపిల్ పండుదే కీలక పాత్ర :
ఈ సంగతులు ఇలా ఉంచితే రక్తంలోని కొవ్వు నిల్వల్ని (cholesterol Levels) కంట్రోల్ చేయడంలో యాపిల్ పండు కీ రోల్ ప్లే చేస్తుంది. కొలెస్ట్రాల్ లేదా కొవ్వును కంట్రోల్ చేసేందుకుగాను యాపిల్ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతుంది. మానవ శరీరంలోని కాలేయంలో తయారయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయడంలోనూ యాపిల్ బాగా పని చేస్తుంది. యాపిల్ ఫ్రూట్‌లో ఉండే యాసిడ్, హ్యూమన్ బాడీలోని కొవ్వులను డైజెస్ట్ చేస్తుంది. ఇకపోతే బీన్స్‌లోని పీచు పదార్థం హెల్త్‌కు చాలా మంచిది. అది చెడు కొలస్ట్రాల్ తయారీని సంపూర్ణంగా అడ్డుకుంటుంది.

how to reduce cholesterol without medication quickly

బీన్స్‌లోని లేసిథిన్ అనే పదార్థం ఆల్రెడీ హ్యూమన్ బాడీలోని కొవ్వులను కరిగిస్తుంది కూడా. ఇక బీన్స్‌లో ఉండే మూలకాలు అయినటువంటి మాంగనీస్, పొటాషియం, భాస్వరం, మాంగనీసు, రాగి, ఫోలిక్ యాసిడ్స్ హెల్త్‌కు చాలా మంచివి. ఇకపోతే బ్లాక్ బెర్రీ కూడా గుండె, రక్తప్రసరణ వ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. బ్లాక్ బెర్రీలో ఉండే పెక్టిన్ అనే పదార్థం కొలెస్ట్రాల్‌ను హ్యూమన్ బాడీ నుంచి బయటకు పంపేస్తుంది.

వంకాయతో కొవ్వుకు చెక్ :
ఇక చాలా మంది వంకాయ కూర అంటే తినడానికి ఇష్టపడకపోవడం మనం చూడొచ్చు. కానీ, వంకాయలో ఉండే విటమిన్స్, ఖనిజ లవణాలు, ఫైటో న్యూట్రీయంట్స్ హెల్త్‌కు చాలా మంచి చేస్తాయి. ద్రాక్ష గురించి అందరికీ తెలుసు. ఇది రక్తం ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని. అయితే, దాంతో పాటు ద్రాక్షలో ఉండే ఆంథోసైనిన్స్, టానిన్స్‌లు హ్యూమన్ బాడీలోని బ్లడ్, ఇతర భాగాల్లో ఉండే కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గించేస్తాయి.

ద్రాక్షలో ఉండే పొటాషియం అనే మూలకం హ్యూమన్ బాడీలోని విషతుల్యాలను బ్యాలెన్స్ చేస్తుంది. ఇక సహజంగా ప్రకృతిలో లభించే జామ కూడా కొలెస్ట్రాల్ తగ్గించేయగలదు. ఇందులో ఉండే విటమిన్ సి, యాసిడ్స్ కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేస్తాయి. పుట్టగొడుగుల్లోని విటమిన్స్ కూడా హెల్త్‌కు చాలా మంచివి. పుట్టగొడుగుల్లోని పోషకాలు కొవ్వులను ఇట్టే కరిగిస్తాయి. బాదంలో ఉండే ఓలియిక్ యాసిడ్స్, వాల్ నట్స్‌లో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా చెడు కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

పోషకాల భాండాగారం సోయా :
ఇక సోయా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. పోషకాల భాండాగారంగా దీనిని పిలుస్తుంటారు. ఇందులోని మూలకాలు, మాంసకృత్తులు కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాదు.. దానిని బ్లడ్ నుంచి బయటకు పంపించేస్తాయి. సోయాలో ఉండే విటమిన్ బి6, బి3, ఈ కూడా హ్యూమన్ బాడీకి చాలా హెల్ప్ చేస్తుంటాయి.

ఈ ఫుడ్ ఐటమ్స్‌తో  కొలెస్ట్రాల్ కంట్రోల్ :
ఓట్స్‌లోని బీటా గ్లూకస్ అనే స్పెషల్ పీచుపదార్థం కొలెస్ట్రాల్‌ను గ్రహించేయడంతో పాటు దానిని బయటకు పంపేస్తుంది. ఇకపోతే సబ్జా గింజలు కూడా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా కీలకంగా పని చేస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించే అత్యంత శక్తిమంతమైన పదార్థంగా సబ్జా గింజలకు పేరుంది.

ఈ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. ప్రజెంట్ టైమ్స్‌లో ప్రతీ ఒక్కరు కూడా కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి దానిని కంట్రోల్ చేసుకోకపోతే ఆటోమేటిక్‌గా హార్ట్‌పై ప్రెషర్ పడుతుంది. అలా హార్ట్ అటాక్ వచ్చే చాన్సెస్ ఎక్కువై ప్రాణాలు పోయే ప్రమాదముంటుంది. ఈ నేపథ్యంలో కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం చాలా ముఖ్యం.

Leave a Comment