Ajwain Leaves Benefits : ఈ మొక్క ఆకులలో ఎన్ని ఔషధ గుణాలో.. కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకోండి..!

Ajwain Leaves Benefits : మన ఇంటి పరిసరాల్లో కనిపించే చాలా మొక్కల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. కానీ, చాలామంది వాటి ప్రయోజనాలు తెలియక పిచ్చి మొక్కలుగా భావిస్తుంటారు. ఏయే మొక్కలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ప్రతిఒక్కరూ తమ ఇంట్లోకి తప్పనిసరిగా తెచ్చిపెట్టుకుంటారు. అందులో వాము మొక్క (Ajwain Leaves) ఒకటి.. ఈ వాము మొక్క ఆకులతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు.

వాము ఆకులు (ajwain leaves in telugu) కూడా మంచి సువాసన వస్తాయి. వాము ఆకులు చూడటానికి చాలా మందంగా ఉంటాయి. ఈ ఆకుల‌ను బాగా న‌లిపితే అందులో నుంచి నీరు బయటకు వ‌స్తుంది. వాస‌న‌ మాత్రమే కాదు.. ఔషధ గుణాలు కూడా ఉన్నాయని అనేక పరిశోధనల్లో తేలింది. వాము ఆకుల్లోని ర‌సాయ‌నాలు జీర్ణ వ్య‌వ‌స్థ‌ను మరింత మెరుగుపరుస్తాయి. ఈ ఆకులను తినడం ద్వారా ఆక‌లి బాగా పెరుగుతుంది. అంతేకాదు.. ఆహారం కూడా బాగా జీర్ణ‌ం అవుతుంది.

Ajwain Leaves Benefits : వాము ఆకులతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..

వాము ఆకుతో ఎంజైమ్‌లను ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది. ఈ ఆకులలోని కెర్వ‌కాల్, థైమాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు వైర‌స్, బ్యాక్టీరియాలను నిర్మూలిస్తాయి. ర‌క్తంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో వాము ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. బీపీని కంట్రోల్ చేయగలవు. న్యూమోనియాను తగ్గించడంలో వాము ఆకు బాగా పనిచేస్తుంది. ఇందులోని ప్రోటీన్లు శ‌రీరంలోని కాల్షియాన్ని పెంచుతుంది. మూత్ర‌పిండాల్లో రాళ్లు రాకుండా నివారిస్తుంది.

ajwain leaves health benefits in telugu
ajwain leaves health benefits in telugu

వంటకాల్లో కూడా వాముకు మంచి పేరుంది. ఈ వాము ఆకుల‌తో బ‌జ్జీల‌ను వేసుకోవచ్చు. వాము ఆకుల‌ను కూర‌ల్లో కూడా వేసుకుని వండుకోవచ్చు. అనేక క‌షాయాల్లోనూ వాము ఆకులను వేసుకోవచ్చు. తులసీ ఆకులతో కషాయాల‌ మాదిరిగా చేసుకోవ‌చ్చు. వాము ఆకుల్లో లేత ఆకుల‌ను మాత్రమే ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొందవచ్చు. (Ajwain Leaves Benefits)

Read Also : Andhra Chicken Gravy Recipe : ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ.. ఈ కోడి కూరను ఇలా గ్రేవీతో చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది.. ఓసారి మీరూ ట్రై చేయండి!

Leave a Comment