Dhee Chaitanya Video : ఢీ డాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్.. సెల్ఫీ వీడియోతో బయటపడ్డ షాకింగ్ నిజాలు…!

Dhee Chaitanya Video : తెలుగు ఎంటర్‌టైన్మెంట్ షో ఢీ డాన్స్ (Dhee Dance Show)లో కొరియోగ్రాఫర్ చైతన్య (Master Chaitanya) ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మాస్టర్ చైతన్య వార్త షాకింగ్‌కు గురిచేస్తోంది. అప్పుల బాధను తట్టుకోలేకనే చైతన్య ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. చివరిసారిగా తన సెల్ఫీ వీడియోలో తన కష్టాలను చెప్పుకుంటూ చైతన్య ఇదే తన చివరి వీడియో అంటూ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. నెల్లూరు క్లబ్ హోటల్లో చైతన్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. చైతన్య సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్థిక ఇబ్బందులు కారణంగానే తాను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని వీడియోలో చెప్పుకొచ్చాడు.

ఒక అప్పు తీర్చేందుకు మరో అప్పు చేయాల్సి వచ్చిందని, ఇప్పుడు ఆ అప్పుల బాధ పెరగడంతో తట్టుకోలేక తనువు చాలిస్తున్నట్టు వాపోయాడు. అప్పు ఇఛ్చిన వారంతా ఒత్తిడి పెట్టడంతో ఇక మరణం ఒకటే దారని నిర్ణయించుకున్నట్టు వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుల బాధ నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నించానని, తన వల్ల కాలేదని చెప్పుకొచ్చాడు. సెల్ఫీ వీడియోలో తన తల్లిదండ్రులకు, చెల్లితో పాటు తన స్నేహితులందరికి చైతన్య క్షమాపణలు తెలియజేశాడు. ఢీ షో ద్వారా తనకు చాలా పేరు వచ్చిందని, కానీ, ఆర్థికంగా తనను ఆదుకోలేకపోయిందని వాపోయాడు.

Dhee Chaitanya Video _ Dhee Dance Chaitanya and his life before Selfie Video Viral
Dhee Chaitanya Video _ Dhee Dance Chaitanya and his life before Selfie Video Viral

అదే జబర్దస్త్ షోలో మాత్రం సంపాదన బాగుంటుందని, పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు వస్తుందని చైతన్య సెల్ఫీ వీడియోలో తెలిపాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఢీ షోలో నిలబడ్డానని, అదే స్థాయిలో కష్టాపడ్డానని, కానీ, ఇప్పటివరకూ కనీసం ఒక ఇల్లు, టీవీ కూడా కొనుక్కలేకపోయానని తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. చైతన్య సూసైడ్ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి మృతదేహాన్ని స్వస్థలం నెల్లూరులోని లింగసముద్రంకు తరలించారు.

Read Also : Optical illusion : మీ మెదడుకు మేత.. ఈ ఫొటోలో 6 నెంబర్ దాగి ఉంది.. అదెక్కడో కనిపెట్టండి చూద్దాం..

Leave a Comment