Subramanya Swamy Pooja : సాధారణంగా దేవాలయాలలో రావి చెట్టు వేప చెట్టు కలిసిన దగ్గర సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్టించి ఉంచుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరు ముఖాలు కలిగిన స్వామిని షణ్ముఖుడు, కుమారస్వామి అని పిలుస్తారు. ప్రతి మంగళవారం లేదా శుక్రవారం, చవితి, షష్టి ,పంచమి రోజులలో సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే చాలా మంచిది. ఎలాంటి గ్రహ దోషాలు, నాగ దోషాలు, కాలసర్ప దోషాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, చర్మ సమస్యలు, ఉన్న తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం ఇలా చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, నమ్మకంతో ఏ పూజ అయినా మనస్ఫూర్తిగా చేయాలి.. అలా చేసినప్పుడే ఫలితాలు వస్తాయి.
ముందు స్వామివారికి సంకల్పం చెప్పుకొని ప్రదక్షణ చేసి జంట నాగులు కలిసి ఉన్న విగ్రహానికి నీళ్లతో శుభ్రముగా కడగాలి స్వచ్ఛమైన ఆవుపాలతో అభిషేకం చేయాలి. ఓం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామియే నమో నమః అంటూ గంగాజలంతో అభిషేకం చేయాలి. మీ చేతి వేళ్లకు ఉంగరాలు ఉంటే తీసి స్వామి విగ్రహానికి గంధం లేదా పసుపు రాసి తడి పొడి లేకుండా నిండుగా రాయాలి.
కుంకుమ బొట్లు పెట్టి స్వామివారిని పూలతో అలంకరించుకోవాలి. మట్టి ప్రమిత తీసుకొని నువ్వుల నూనె పోసి రెండు వత్తులను ఒక ఒత్తిగా చేసి అగరబత్తులతో దీపరాధన చేసుకోవాలి. స్వామివారికి ధూపం వెయ్యాలి నైవేద్యంగా అరటి పండ్లు, నువ్వులు బెల్లం కలిపిన ఉండలు, బియ్యం చలివిడి, నానబెట్టిన పెసరపప్పు బెల్లం ముక్క వీటిలో ఏవైనా నైవేద్యంగా పెట్టవచ్చు. నువ్వులు బెల్లం కలిపిన ఉండలు పెడితే 6 ఉండేటట్టుగా నైవేద్యం పెట్టాలి. స్వామివారికి హారతి ఇవ్వాలి..
స్వామివారికి 16 వారాలు లేదా 42 రోజులు అంటే ప్రతిరోజు మధ్యలో పూజ చేయలేని అప్పుడు ఆ తర్వాత పూజ చేసుకోవచ్చు అలా 42 రోజులు పూర్తి చెయ్యాలి. రావి, వేప చెట్లను లక్ష్మీనారాయణ లాగా కొలుస్తారు. సంతానం లేని వారు తెల్ల దారం పసుపు రాసి రావి వేప చెట్లకు చుట్టు కడతారు. అలాగే ముడుపు కూడా కడతారు. ఇలా చేయడం వల్ల సంతానం కలుగుతుందనే నమ్మకం.