Dental Problems : పిప్పి పంటితో చాలా మంది బాధపడుతూనే ఉంటారు. వయస్సుతో సంబంధం లేకుండా ఇలాంటి సమస్యలు తలెత్తడం సాధారణమే. వీటికి ఎలా చెక్ పెట్టాలో చాలా మందికి తెలియదు. అలాంటి వారి కోసమే ఈ చిట్కా. జామ పండ్లు.. వీటిని చూస్తే చాలా మందికి నోరూరుతుంది. దీని నుంచి వచ్చే సువాసన మనసును దోచేస్తుంది. ఈ పండ్లు తింటే కొందరికి జలుబు చేస్తుంది. కానీ దీని వల్ల శరీరానికి అనేక ఉపయోగాలు. ఈ పండ్లతోనే కాకుండా.. ఆకులతో కూడా అనేక ఉపయోగాలున్నాయి. చాలా మంది నోటిలో పిప్పి పంటితో బాధపడుతుంటారు. దానిలోని పురుగులు పంటిని కొద్ది కొద్దిగా నాశనం చేస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యను ఎదుర్కునే వారు ఇష్టమైనవి సైతం తినలేక ఇబ్బందులు పడుతుంటారు.
భోజనం చేసే సమయంలో సైతం పంటి నొప్పితో ఇబ్బందులు పడతారు. ఆహారంలో ఏదైనా చిన్న ముక్క పంటిలో ఇరుక్కుంటే ఇక నరకమే. జామ ఆకులను ఉపయోగించి ఈ సమస్యను నివారించవచ్చు. ఇందుకు జామాకు మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. మొదటగా 5 నుంచి 6 జామాకులను తీసుకుని నీటిలో ఉప్పు వేసి వాటిని శుభ్రం చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ తీసుకుని బాగా మరిగించి ఆకులను అందులో వేసి ఇంకా మరిగించాలి.
గ్లాసు వాటర్ అరగ్లాసుకు వచ్చే వరకు ఇలా మరిగిస్తూనే ఉంటాలి. తర్వాత అందులోంచి ఆకులను తీసేసి జామ నీటిని గ్లాసులోకి తీసుకోవాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలిపాలి. ఇక ఆ నీటిని రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు నోట్లో పోసుకుని 5 నిమిషాల పాటు పుక్కిలించాలి. ఇలా చేస్తే రెండు నుంచి మూడు రోజుల్లోనే పిప్పి పంటి సమస్య తగ్గుతుంది. దీని వల్ల పిప్పి పంటి లోపల ఉన్న పురుగుల సైతం బయటకు వచ్చేస్తాయి.
Read Also : Heart Attack : ఎక్కువగా జిమ్ చేస్తే గుండెపోటు వచ్చే చాన్స్ ఉందట.. మరి ఏం చేయాలి?