Coconut Milk for Hair : ప్రతి ఒక్కరూ తమ హెయిర్ ఒత్తుగా, కర్లీగా, డ్యాండ్రఫ్ లేకుండా ఉండాలని కోరుకుంటారు. కానీ చాలా మందికి ఆ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెడుతుంటాయి. కొందరైతే అన్ని రకాల షాంపూలను, క్రీమ్ లను ట్రై చేస్తుంటారు. అందులో ఉండే రసాయనాల వల్ల హెయిర్ మరింత డ్యామేజ్ అయ్యే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత సైడ్ ఎఫెక్ట్ ఎటాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇలా కెమికల్ తో కాకుండా నెచురల్ పదార్థాలతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్స్ ఉండవు. పైగా ఇదంతా నెచురల్ థెరఫిలో భాగమే. ఇలాంటివి వాడటం వల్ల హెయిర్ ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది. జుట్టు సైతం కర్లీగా మారుతుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని మెంతులను ఒక బౌల్ లోకి తీసుకుని వాటిని రాత్రి నుంచి పొద్దటి వరకు నానబెట్టుకోవాలి. తర్వాత కొబ్బరికాయను తీసుకుని దానికి గ్లాస్ వాటర్ కలుపుకుని మెత్తగా తయారు చేసుకోవాలి. ఒక పొడి బట్టను తీసుకుని అందులో మిక్సీ పట్టిన కొబ్బరను వేసుకోవాలి. గట్టిగా పిండిన తర్వాత అందులోంచి వచ్చే పాలను పక్కన తీసి పెట్టుకోవాలి.
మెంతులు తీసుకుని దానికి కొంచెం కొంచెం ఈ కొబ్బరి పాటు యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టాలి. మెత్తగా పేస్ట్ అయ్యేలా చేసుకోవాలి. అనంతరం దానిని జుట్టుకు పేస్ట్ లాగా పెట్టుకోవాలి. సుమారు అరగంట తర్వాత కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల హెయిర్ ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో ప్రొటీన్, ఐరన్ ఉండటం వల్ల ఇవి జుట్టును బలంగా చేయడంలో ఎంతో సహాయపడతాయి. ఇలా వారానికి ఒక సారి ట్రై చేయడం వల్ల జుట్టు తో పాటు కుదుళ్లు బలంగా మారతాయి. ఒక సారి మీరు కూడా ప్రయత్నించండి మరి..
Read Also : Hair Care Tips : జుట్టు అధికంగా రాలుతుందా.. ఆయుర్వేదంతో ఇలా చేస్తే.. మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!