Vastu Tips for Watch : ఇంట్లో గడియారం ఈ దిశలో ఉంటే ఏమౌతుందో తెలుసా? మీకు బ్యాడ్ టైమ్ మొదలైనట్టే.. వెంటనే సరి చేసుకోండిలా..!

Vastu Tips for Watch : ప్ర‌తి ఒక్క‌రికీ స‌మ‌య పాల‌న పాటించ‌డం త‌ప్ప‌ని స‌రి. ఏమైన ప‌ని చేస్తున్న‌ప్పుడు త‌ప్పని స‌రిగా టైమ్ చూస్తుంటాం. ప్ర‌తి ఇంట్లో ఒక గ‌డియారం ఉంటుంది. ఉద‌యం లేవ‌గానే చాలా మందికి గ‌డియారం చూడ‌డం అట‌వాటు. ఇంట్లో గ‌డియారం ఉండ‌డం ఏంత ముఖ్య‌మో.. అది ఏ ప్ర‌దేశంలో ఉందో చూసుకోవ‌డం కూడా అంతే ముఖ్యం? ఇంట్లో గ‌డియారం ఏ దిశ‌లో పెట్ట‌డం అనేది ఇంటికి సానుకుల శ‌క్తి. ఇంట్లో గ‌డియారం స‌రైన ప్ర‌దేశంలో లేక‌పోతే ఇబ్బందులు ఎదుర‌వుతాయి. అందుకే గ‌డియారం పెట్టే దిశ‌లో వాస్తు చిట్కాల‌ను పాటించ‌డం మంచింది.

wall clock direction as per vastu in telugu
wall clock direction as per vastu in telugu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో గ‌డియారాన్ని తూర్పు, ప‌డ‌మ‌ర లేదా ఉత్త‌రం వైపు ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల‌న మీరు ప‌ని చేసే స‌మ‌యంలో టైమ్ చూడానికి వీలుగా ఉంటుంది. ఇంట్లో ఉత్త‌రం దిక్కు గ‌డియారం వేలాడ‌దీయం వ‌ల‌న సంప‌ద‌, శ్రేయ‌స్సును ఆక‌ర్షిస్తుందని చాలా మంది న‌మ్ముతారు. ఉత్త‌రం వైపు కుబేరుడు, గ‌ణ‌ప‌తి దిశ‌గా న‌మ్మ‌తారు. వ్యాపారం వృద్ది చేయ‌డానికి అనుకులంగా ఉంటుంది.

త‌ర్పూ దిక్కు గ‌డియారాన్ని ఉంచ‌డం కుటుంబానికి మంచి జ‌రుగుతుంది. వాస్తు ప్ర‌కారం చూస్తే గ‌డియారం ద‌క్షిణ ముఖ గోడ‌పైన ఉండ‌డం ఇంటికి మంచికాదు. ముఖ్యంగా ఇంట్లో గ‌డియారాన్ని ఇంటి నైరుతి లేదా ఆగ్నేయంలో ఉంచ‌రాదు. దీనివ‌ల‌న ఇంట్లో వారికి ప్ర‌భ‌వం చూపుతోంది.

గ‌డియారాన్ని ఎప్పుడు త‌లుపు పైన పెట్ట‌కుడ‌దు. ప‌డ‌క‌గ‌దిలో గ‌డియారం ఉత్త‌మ‌మైన ప్ర‌దేశం తుర్పు ముఖ్యంగా ఉంటుంది. తుర్పూ వైపు అందుబాటులో లేక‌పోతే ఉత్త‌రం పైపు గ‌డియారం ఉంచ‌వ‌చ్చు. ప‌డ‌క‌గ‌దిలో గ‌డియారం త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. ఎందుకు కంటే నిద్రంలోంచి లేవ‌గానే గ‌డియారం చూసుకోవ‌చ్చు. ఒక్కోసారి గ‌డియారం అద్దంగా చూసుకోవ‌డానికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

Read Also :  Vastu Tips : మీ ఇంట్లో ఈ పక్షి ఫొటో ఉంటే ఏమౌతుందో తెలుసా?

Leave a Comment