Curry Leaves : కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారు ఇది తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు .. ఎలా తీసుకోవాలంటే..?

Curry Leaves : కరివేపాకు.. ఇది అందరికీ తెలుసు.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంటకాల్లోని ప్రతి కూరలో దీనిని వేస్తుంటారు. ఇది కేవలం రుచి కోసమే కాదు.. వివిధ సమస్యల నుంచి బయట పడేస్తుంది. వీటి గురించి తెలియక చాలా మంది దానిని కూరల్లోంచి తీసి పక్కన పెడుతుంటారు. అసలు కరివేపాకు వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం..

కొలెస్ట్రాల్, అధిక బ‌రువు లాంటి ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడేవారు ప్రతి రోజూ దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కరివేపాకును తినడం వల్ల పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువుతో ఇబ్బందులు పడేవారు దీనిని తినడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు.

మన బాడీలో ఉన్న చెడు కొవ్వును కరిగించేందుకు సైతం కరివేపాకు ఉపయోగపడుతుంది. డైలీ భోజ‌నం చేసేట‌ప్పుడు మూడు పూట‌లా ఓ టీ స్పూన్ క‌రివేపాకు పొడిని తినడం మంచిది. మజ్జిగలో కరివేపాకు పొడి కలిపి తాగితే మలబద్ధకం, మోషన్స్ తగ్గుతాయి. పడిగడుపును 5 నుంచి 6 కరివేపాలకు తినాలి. దీని వల్ల వికారం తగ్గుతుంది. కడుపుతో ఉన్న వారు పడిగడుపున వీటిని తింటే సిక్ నెస్ తగ్గుతుంది.

Curry Leaves : అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నాారా?

curry-leaves-could-help-your-body-lower-cholesterol-and-blood-sugar
curry-leaves-could-help-your-body-lower-cholesterol-and-blood-sugar

క‌రివేపాకులో చాలా వరకు యాంటీ వైర‌ల్, యాంటీ బాక్టీరియ‌ల్స్ ఉంటాయి. ఈ ఆకులను నీటిలో మ‌రిగించి ఆ నీళ్లతో ప్రతి రోజూ రెండు సార్లు తాగాలి. దీని వల్ల విష జ్వరాల నుంచి తర్వగా బయటపడొచ్చు. ప‌ర‌గ‌డుపునే క‌రివేపాకు తింటే కంటి చూపు మెరుగు అవుతుంది.

కంటి స‌మ‌స్యలు తగ్గుముఖం పడతాయి. కాలిన గాయాలపై, పుండ్లపై ఈ ఆకులను పేస్ట్‌గా రాసి క‌ట్టు క‌ట్టడం వల్ల అవి తర్వగా మానతాయి. క‌రివేపాకు ఆకులను పేస్ట్‌‌గా చేసుకుని జుట్టుకు అప్లై చేసి కొద్ది సేపటి తర్వాత తలస్నానం చేస్తూ ఉండాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే జుట్టు పెరుగుతుంది. చండ్రు సైతం తగ్గుతుంది.

Read Also :  Dhoopam Benefits : ఇంట్లో ధూపం ఎందుకు వేయాలి.. లేదంటే ఏమౌతుందో తెలుసా? అసలు రహస్యం ఇదే..!

Leave a Comment