Amla Juice Benefits : ఉసిరికాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పుల్లగా ఒగరుగా ఉండే ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం శీతాకాలంలో మాత్రమే ఉసిరికాయలు మనకు దర్శనమిస్తాయి. వీటిని ఊరగాయకే కాకుండా మెడిసిన్ తయారీలో కూడా వాడుతుంటారు. ఉసిరి చూర్ణాన్ని ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తుండగా.. ఉసిరి ఆయిల్ శిరోజాలకు ఎంతో మేలు చేస్తుంది.
సీజనల్ వ్యాధులకు కూడా ఉసిరికాయ లేదా జ్యూస్‌తో చెక్ పెట్టవచ్చు. చాలా మందికి ఉసిరి వలన కలిగే ఉపయోగాలు తెలియక వీటిని ఆహారంలో తీసుకోవడానికి అయిష్టత చూపుతుంటారు. అనేక అనారోగ్య సమస్యలకు ఉసిరి సంజీవని వంటిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉసిరి వలన కలిగే ప్రయోజనాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. దీనివలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది. అనేక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. ఉసిరికాయతో చేసిన జ్యూస్ పరిగడుపున రోజూ 30 ఎంఎల్ తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది. రక్త ప్రసరణ కూడా బాగా అవుతుంది. అంతేకాకుండా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. డయాబెటీస్ అదుపులోకి వస్తుంది.
ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.దీంతో గుండె జబ్బులు దరిచేరవు. ఇక విటమిస్ -సి అనేది శిరోజాలకు మేలు చేస్తుంది. ఉసిరి పొడిని నీటిలో కలుపి కాసేపయ్యాక ఆ నీటితో తలస్నానం చేస్తే కుదుళ్లు బలంగా తయారవుతాయి. ఉసిరి జ్యూ్స్ కూడా పరిగడుపున తాగితే జుట్టు కుదుళ్లు గట్టిపడతాయి. చర్మ వ్యాధులు రాకుండా ఉసిరిలోని గుణాలు కాపాడతాయి.
ఫలితంగా చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. జీర్ణసంబంధిత సమస్యలకు కూడా ఉసిరి జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది. పచ్చి ఉసిరికాయలు తినడం వలన శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులకు ఉసిరి చక్కటి మెడిసిన్…
Read Also : Knee Pains Tips : 7 రోజులు ఇలా చేస్తే చాలు.. కీళ్ల నొప్పులు, బాడీ పెయిన్స్, కాల్షియం లోపానికి చెక్