Romantic Life : చాలా మంది తమ లైంగిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అందుకోసం ఏమి చేయాలో తెలియకపోవచ్చు. కొందరికి తెలిసినా టైం లేక ఆచరించకపోవచ్చు. దీంతో వారి లైంగిక జీవితంలో పెద్దగా ఆనందాన్ని పొందలేకపోవచ్చు. దీంతో వారి శృంగారం లైఫ్‌లో చివరకు మిలిగేది నిరాశ, నిస్పృహే. కొందరు మాత్రం శృంగార జీవితంలో తన భాగస్వామిని సంతోషంగా ఉంచేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. వారికి ఏమి ఇష్టమో కనుక్కుని ఆ విధంగా సంతోష పెట్టేందుకు ఎప్పుడూ తాపత్రయపడుతుంటారు. ఫలితంగా వారు శృంగారం లైఫ్‌లోనే కాకుండా పర్సనల్ లైఫ్‌లోనూ చాలా సంతోషంగా ఉంటారు.
మీ లైంగిక జీవితంలో ఆనందంగా గడపాలంటే కొందరు నిపుణులు ఈ సలహాలు, సూచనలు ఇచ్చారు. వీటిని ఫాలో అయితే, తప్పకుండా మీ రొమాన్స్ లైఫ్‌లో మంచి అనుభూతిని పొందుతారట. మీ భాగస్వామి కూడా ఆ టైంలో మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు కావాల్సింది ఇవ్వడానికి రెడీ అవుతుందని తెలిసింది. మొదటిది మీ భాగస్వామితో శృంగారం చేయడానికి ముందు బాడీ మసాజ్ చేసుకోవాలట.. ఇలా చేయడం వలన శరీరం చాలా యాక్టివ్ నెస్ పొందుతుంది. కొందరు సెక్స్ తర్వాత మసాజ్ వంటివి చేయించుకుంటారు. సెక్స్‌కు ముందే మసాజ్ చేయించుకుంటే రొమాన్స్ చేసుకోవడానికి, మూడ్ ఆన్ లో ఉండటానికి ఆస్కారం ఉంటుందట.
ఇకపోతే, చాలా మంది శృంగారం చేసేటప్పుడు సౌండ్స్ చేయడం, మౌనంగా సంభోగంలో పాల్గొనడం వలన ఎక్కువ సేపు అనుభూతిని పొందలేరట.. అందుకే మాట్లాడుకుంటూ సెక్స్ చేస్తే ఇద్దరూ మంచి ఫీల్‌ను పొందుతారు. ఇంకో ముఖ్యమైన విషయం సెక్స్ చేస్తున్నపుడు ఇద్దరూ గాఢంగా ఊపిరిపీల్చుకుంటే కోరికలు బాగా కలుగుతాయట..ఎక్కువ సేపు శృంగారాన్ని ఆస్వాదించవచ్చట.. చివరగా శృంగారాన్ని ఎప్పుడు ఒకే దశలో చేయడం కంటే పలు రకాలుగా, కొత్త కొత్త యాంగిల్స్‌లో చేస్తే హాయిగా అనిపించడమే కాకుండా మీ భాగస్వామి మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడటానికి స్కోప్ ఉంటుంది.
Read Also : Romance Time : శృంగారం ఏ సమయంలో చేస్తే మంచిది.. నిపుణులు ఏమంటున్నారంటే…?