Relationship : మన ప్రియురాలైనా, ప్రియుడైనా, జీవిత భాగస్వామైనా కానీ ఏదైనా విషయంలో మీ అంచనాలకు తగ్గట్లుగా లేకపోతే మీరు చికాకు పడడం దాంతో వారు మీ మీద కోపాన్ని పెంచుకోవడం చేస్తారు. ఇలా కోపాలు పెంచుకుని రిలేషన్ షిప్ ను పాడు చేసుకునే బదులు ఒక్క 30 సెకన్ల పాటు ఆలోచించి మీ జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవడం చాలా మంచిది. ఇలా ఈ 30 సెకన్ల ట్రిక్ ను పాటించడం వలన మీ జీవితంలో సుఖసంతోషాలకు లోటుండదు.

మీరు ఏదైనా సందర్భంలో మీ పార్ట్ నర్ కు మెస్సేజ్ లేదా మెయిల్ కానీ పంపితే వారు మీకు రిప్లై ఇవ్వడం ఒక్కోసారి ఆలస్యం కావచ్చు. కానీ ఆలస్యమైనపుడు మీరు వారి మీద కోపాన్ని ప్రదర్శించే బదులు శాంతంగా వ్యవహరించడం అవసరం. అలా చేయడం వలన మన బంధంలో ఎటువంటి గొడవలు జరగకుండా ఉంటాయి.
కేవలం మనకు ఏదైనా కోపం కలిగించే సందర్భం ఎదురైనపుడు 30 సెకన్ల పాటు డీప్ బ్రీత్ ను తీసుకొని ఆలోచించడం వలన అనేక గొడవలు తగ్గుతాయి. ముందు శ్వాస తీసుకుని అసలు ఈ విషయంలో నేను ఎందుకు కోపగించుకోవాలి? ఒక వేళ కోప్పడితే నష్టపోయేది ఎవరు? అనవసరంగా వారిని ఎందుకు హర్ట్ చేయాలని ఆలోచించుకోవడం వలన మీ బంధం చాలా రోజుల పాటు ఎటువంటి గొడవలకు తావు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక వేళ మీరు ఆవేశపడి కోప్పడితే కనుక మీ మీద ఆశలు పెట్టుకున్న మీ జీవిత భాగస్వాములు హర్ట్ అవుతారు. తర్వాత సందర్భాల్లో వారు మీతో చనువుగా ఉండలేరు. కావున మీరు కోప్పడడం మానుకోండి..
Read Also : Relationship : ఇలాంటి వ్యక్తులతో జర జాగ్రత్త.. మీరు అప్రమత్తంగా లేకుంటే ఇక అంతే..!