Men Behavior Female : దాంపత్య జీవితంలో ఆడవాళ్లు మగవారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. అయితే, ఈ విషయాన్ని కొందరు పురుషులు గుర్తిస్తారు. మరికొందరు మాత్రం అస్సలే గుర్తించరు. నా పెళ్లాం, ఇది ఆమె డ్యూటీ.. తప్పనిసరిగా చేయాల్సిందే అని కొందరు మొండిగా ప్రవర్తిస్తారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి..
భార్య అంటే భర్తతో జీవితం పంచుకోవడానికి, మీ మంచి చెడులు చూసుకోవడానికి వచ్చి మీ ఇంటి యాజమాని. అంతేకానీ పనిమనిషి కాదన్న విషయాన్ని నేటితరం మగవాళ్లు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈరోజుల్లో ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదు.. మగవారితో సమానంగా కష్టపడుతున్నారు. సంపాదిస్తున్నారు కూడా..!
అయితే, భార్యభర్తలు ఇద్దరూ సంతోషంగా జీవితం గడపాలంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండాలి. మీ భాగస్వామి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి. మర్యాదపూర్వంగా మెలగాలి. కష్టనష్టాలను షేర్ చేసుకోవాలి. ఇంటి పనిలో అప్పుడప్పుడు సాయం చేయాలి. ఓపెన్ గా ఉండాలి. ఈ రోజుల్లో ఇలాంటి లేకపోవడంతోనే దంపతుల మధ్య గొడవలు పెరిగి చాలా మంది విడాకుల వరకు వెళ్తున్నారు.

భర్తల ప్రవర్తన కొన్నిసార్లు భార్యలకు తెగ చిరాకు తెప్పిస్తుందట.. అవి ఎలాంటి సందర్భాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో బట్టలు చిందరవందరగా పడవేసినప్పుడు.. షేవింగ్ చేసుకుని సింక్ లేదా ఆ ప్రదేశాన్ని క్లీన్ చేయనప్పుడు, భార్య ఏదైనా చెప్పినప్పుడు వినకుండా తలఊపితే.. ప్రతీసారి వస్తువులు మర్చిపోతూ ఎక్కడపెట్టావ్ అని భార్యను విసిగిస్తే.. ఇక మీ పర్సనల్స్ గురించి మీ భార్య వద్ద పదేపదే గుర్తుచేసినపుడు వారు అస్సలు సహించలేరట.. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలియనిది కాదు.. అందుకే మగాళ్లు బీ కేర్ ఫుల్..
Read Also : Sleep Late : మీరు రాత్రి టైంకు పడుకోవడం లేదా.. మీ గుండె డేంజర్‌లో ఉన్నట్టే.. జాగ్రత్త…!