Infatuation vs Love : ప్రేమ.. ఇదొక అందమైన ఫీలింగ్. ఎవరిలో.. ఎప్పుడు.. ఎలా పుడుతుందో తెలియదు. మనకు నచ్చిన వ్యక్తి కనిపించగానే మనలో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఒకే సారి గాలిలో తేలిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక ఫస్ట్ లవ్ మరీ డిఫరెంట్. ప్రపంచంలో వారిద్దరు తప్ప మరెవ్వరూ లేరనె భావనకు వస్తారు.
ఒకరికొకరు వారే కొత్త లోకంగా కనిపిస్తారు. అయితే లవ్ లో పడిన వారు నైట్ టైంలో ఎక్కవగా ఫోన్ మాట్లాడటం, సీక్రెట్‌గా కలుసుకోవడం వంటివి చేస్తుంటారు. లవ్ లో పడిన వారికి అందంపైన ఫోకస్ ఎక్కువవుతుంది. ఇలాంటి ఇండికేషన్స్‌ను గమనిస్తే ఆ వ్యక్తి లవ్‌లో పడ్డారని చెప్పొచ్చు. ఇక తన లవర్‌తో విచ్చలవిడిగా ఎంజాయ్ చేయాలనుకుంటారు చాలా మంది.
ఈ క్రమంలో కొందరు తమ డ్రీమ్స్‌ను నెరవేర్చుకుంటారు. ఫస్ట్ టైం లవ్ లో పడిన వారు పనులన్నీ పక్కన పెట్టి తన లవర్ కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. వారికి సంబంధించిన బాధలను, సంతోషాలను షేర్ చేసుకుంటారు. ఇలాంటి వారు లవ్ లో ఉన్నట్టు భావించక తప్పదు. లవ్‌కు ఏజ్ తో సంబంధం లేదంటారు. కానీ లవ్ లో ఉన్నవారు వారు తమ మనసును ఎంతో యంగ్‌గా ఫీల్ అవుతారంట. వీరు చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తారట. ఇక వారిద్దరు ఒకరికోసం మరొకరు పుట్టారని అనుకుంటారు. లవర్‌కు నచ్చేలా ఉండేందుకు తమని తాము మార్చుకుంటారు.
ఒకరిని ఒకరు ఇంప్రెస్ చేసుకునేందుకు ట్రై చేస్తూ ఉంటారు. మీరు రియల్ గా లవ్ లో పడితే… మీ లవర్ కు సంబంధించిన ఆలోచనలు ఎప్పుడు మిమ్మల్ని కదుపుతూనే ఉంటాయి. లవ్ ను ఎంజాయ్ చేయడంతో పాటు వారితో స్పెండ్ చేసిన మెమొరీస్ ను ఎప్పడూ గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఈ విషయాలను ఎప్పటికప్పుడు ఎదుటి వారిపై సైతం షేర్ చేసుకునేందుకు ఇష్టపడతారు.
Read Also : Life Partner Love : మీకు సెట్ అయ్యే పర్‌ఫెక్ట్ పర్సన్‌ను గుర్తించడం ఎలా? వీటిని గుర్తుంచుకోండి..!