Categories: LatestRelationship

Health Tips for Pregnant : ప్రెగ్నెన్సీ వచ్చిందా? ఈ విషయంలో జర జాగ్రత్త!

Advertisement

Health Tips for Pregnant : ప్రెగ్నెన్సీ వచ్చిందా? అయితే ఈ విషయంలో జర జాగ్రత్తగా ఉండండి. ప్రెగ్నెన్సీ టెస్టు చేయించుకుంటే కన్ఫామ్ అయిందా? రెండు లైన్లు వచ్చాయా? అలాగే నెలసరి కూడా రాలేదా? అయితే ప్రెగ్నెన్సీ వచ్చినట్టే.. ఆధునిక జీవితంలో ప్రెగ్నెన్సీకి ప్రయత్నించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ రావడం ఒక ఎత్తు అయితే.. దాన్ని నిలుపుకోవడం మరో ఎత్తు.. అలాగే కడుపులో పెరిగే బేబీ ఆరోగ్యంపై కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

ప్రెగ్నెన్సీ టెస్టులో తేలిన తర్వాత వెంటనే వైద్యున్ని కలవండి.. చెకప్ చేయించుకోండి. మీలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయో నిర్ధారించుకోండి. చాలామందిలో ఇతర అనారోగ్య సమస్యల కారణంగా గర్భం దాల్చిన సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరిలో గర్భం నిలవకపోవడం, గర్భస్రావం కావడం వంటి సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. గర్భం దాల్చాక వైద్యుని సలహాతో మందులు, మంచి డైట్ పాటించాలి. సప్లిమెంట్స్, విటమిన్స్ తీసుకోవాలి. సప్లిమెంట్స్ తీసుకుంటే బేబీ హెల్త్ బాగుంటుంది.

నీళ్లు ఎక్కువగా తాగాలి :
ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత కెఫిన్‌ వాడొద్దు. రోజుకి కెఫీన్ 200 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. 200 మిల్లీ గ్రాముల కెఫిన్ కంటే ఎక్కువ తీసుకుంటే మిస్ క్యారేజ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యపరంగా ఎంతో మేలును కలిగించే పోషక విలువలు ఎక్కువగా ఉండేలా తీసుకోవాలి.

ఆహార పదార్థాలు ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తాయి. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదంటున్నారు. మహిళల్లో తలనొప్పి, కొంత అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ఎక్కువ నీళ్లు తాగాలి. పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. మానసికపరంగా కూడా చాలా ధైర్యంగా ఉండాలి.

అనవసరమైన ఆలోచనల వల్ల కూడా బేబీ ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. చాలామందిలో బ్లీడింగ్, కడుపు నొప్పి సమస్యలు వస్తుంటాయి. తప్పనిసరిగా వైద్యున్ని సంప్రదించాలి. తొమ్మిది నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకునే పోషకాహారం బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొంత మంది గర్భిణీలు నిర్లక్ష్యంగా ఉంటారు. సరైన ఆహారం తీసుకోరు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సలహా తీసుకోవాలి.

సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది మహిళలు ఆందోళన చెందుతుంటారు. ప్రతివిషయానికి కంగారుపడిపోతుంటారు. మానసికంగా కూడా కృంగిపోతుంటారు. అది వారి కడుపులోని బేబీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని గుర్తించాలి. ఆరోగ్యపరంగా బేబీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే బేబీ ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడే ముప్పు ఉంటుంది.

కొంతమంది గర్భిణీలు నెలలు నిండకముందే ప్రసవిస్తుంటారు. కొన్నిసార్లు బేబీ కూడా మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే.. పుట్టే శిశువు సరిగా ఎదకపోవడం.. అవయవాలు పెరగకపోవడం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు.  పిల్లలు పుట్టిన సమయంలో ఆరోగ్యంగా లేకపోతే మందుల సాయంతో పిల్లలను కాపాడుకోవచ్చు.

ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి డెలివరీ అయ్యేవరకు ప్రతి క్షణం చాలా కఠినమైనదే అని చెప్పాలి. ఇలాంటి సమయాల్లో గర్భిణీలు ఆత్మవిశ్వాసం కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే కుటుంబ సభ్యులు వారికి ధైర్యంతో పాటు మానసికంగా దృఢంగా ఉండేలా సాయపడాలి. అప్పుడు మానసిక ఆందోళనల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. వారు చాలా ఒత్తిడికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు.

ఇలా ఉంటే.. అబార్షన్ల ముప్పు ఎక్కువ :
మహిళలు ఆందోళనతో ఉండే సమయాల్లో అబార్షన్లు ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వీరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. వీరికి ఒత్తిడిని కలిగించే విషయాలకు దూరంగా ఉంచాలి. కుటుంబ సమస్యలతో బాధపడే గర్భిణీలకు పుట్టే పిల్లలు ఆరోగ్య సమస్యలతో పుట్టే అవకాశం ఉంది. గర్భం దాల్చిన సమయంలో మంచి ఆలోచనలతో పాటు మనస్సు ప్రశాంతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. స్వచ్ఛమైన గాలి, వెలుతూరు ఉండేలా చూసుకోవాలి. సంతోషకరమైన, మనస్సుకు నచ్చిన ఆహ్లాదకరమైన విషయాల పట్ల ఆసక్తి పెంచుకోవాలి.

ప్రెగ్నెంట్ అయిన మొదటి నెల నుంచి అనేక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలా తొమ్మిది నెలల పాటు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వైద్యులు సూచించిన మందులను వేళకు తీసుకుంటుండాలి. కొద్దిపాటి వ్యాయామాలు చేస్తుండాలి. అప్పుడు పుట్టే బిడ్డ కూడా బలంగా ఆరోగ్యంగా పుట్టేందుకు వీలుంటుంది.

పుట్టేబిడ్డకు ప్రమాదమే :
ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీలకు ఆహారంపై పెద్దగా ఆసక్తి అనిపించదు. కానీ, పులుపు తినేందుకు ఇష్టపడుతుంటారు. వారికి నచ్చిన ఆహార పదార్థాలను అందించాలి. తల్లి కాబోయే సమయంలో కొన్ని ఆహారపు పదార్థాలకు దూరంగా ఉండాలి. తెలిసి తెలియక ఆ ఆహారపు పదార్థాలను తీసుకుంటే పుట్టే బిడ్డకు ప్రమాదమని గుర్తించాలి. అందరికి బాగా తెలిసిన విషయం.. బొప్పాయి తినకూడదు.. ఇలాంటి ఆహార పదార్థాల పట్ల ఎక్కువగా పెద్దలకు అవగాహన ఉంటుంది. వారి సలహా సూచనలతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటుండాలి. అప్పుడే తల్లికి, పుట్టే బిడ్డ ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు.

నిండు గర్భిణీలు మెట్లు ఎక్కరాదు. మొదటి నెలలో ఏమి కాదులే అని చాలామంది గర్భిణీలు మెట్లు, మెడపైకి ఎక్కేస్తుంటారు. కానీ, దాని ప్రభావం తరువాతి నెలల్లో పుట్టే బిడ్డపై పడుతుందని మర్చిపోవద్దు. మీరు చేసే ఈ చిన్న తప్పు బిడ్డ ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. బరువు పట్టడంతో పాటు ఎత్తైన ప్రదేశాల్లోకి ఎక్కడం వంటి పనులు అసలే చేయొద్దు.. సాధ్యమైనంత వరకు ఉన్నచోట నుంచి కొద్దిదూరం నడవచ్చు. చిన్నపాటి ఎక్సర్ సైజులు చేయడం ద్వారా మంచి ఆరోగ్యంతో పాటు మనస్సు ప్రశాంతంగా అనిపిస్తుంది.

Read Also :  First Night Milk Secret : ఫస్ట్‌నైట్ రోజు పాలే ఎందుకు తాగాలి.. అందులో ఉన్న సీక్రెట్ ఏంటి?

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More

1 year ago

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More

1 year ago

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More

1 year ago

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More

1 year ago

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Sky Fruit :  స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More

1 year ago

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More

1 year ago