
Graha Dosha Nivarana Remedies in telugu
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా ఎదురవుతూ ఉంటాయి. ఏ వ్యక్తికైనా సరే రాహు కేతువుల బలం తక్కువగా ఉన్నట్లయితే అనేక రకాలైన సమస్యలు వస్తూ ఉంటే అనుకున్న పనులు పూర్తి కావడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది జాతక చక్రంలో రాహువు గాని కేతువు గాని చంద్రుడితో కలిసి ఉన్నట్లయితే దాన్ని చంద్రగ్రహణ దోషము అనే పేరుతో పిలుస్తారు అలాగే రాహువు గాని కేతువు గాని సూర్యుడితో కలిసినట్లైతే దాన్ని సూర్యగ్రహణ దోషము అంటారు. ఒక వ్యక్తి జీవితంలో అభివృద్ధి సాధించాలంటే సూర్యుడు బలం ఉండాలి. ఒక వ్యక్తికి మానసిక ప్రశాంతత ఉండాలంటే చంద్రుడి బలం ఉండాలి. సూర్యుడు రాహు కేతువులతో కలిసిన చంద్రుడు రాహు కేతువులతో కలిసిన సూర్యచంద్రులకి జాతకంలో గ్రహణం ఏర్పడుతుంది దీన్ని గ్రహణ దోషం అంటారు దాని వల్ల జీవితంలో అభివృద్ధి ఆలస్యం అవుతూ ఉంటుంది మనశ్శాంతి తక్కువగా ఉంటుంది.
ఈ గ్రహణ దోషాలు పోగొట్టుకోవాలంటే సూర్యచంద్రులను బలోపేతం చేసుకోవాలంటే దానాలు విశేషంగా సహకరిస్తే అందుకే వీలైనప్పుడల్లా ఆదివారం పూట గోధుమలు దానం సోమవారం పూట బియ్యం దానం ఎవరికైనా ఇస్తూ ఉన్నట్లయితే జాతకంలో ఉన్న గ్రహణ దోషాలు తగ్గిపోతాయి. దాని వల్ల శుభ ఫలితాలను సిద్ధింప చేసుకోవచ్చు అలాగే ఎవరైనా సరే పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్న భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తున్న దానికి కారణం త్రి దోషము అని గుర్తించాలి. ఈ స్త్రీ దోషాన్ని స్త్రీ శాపం అనే పేరుతో కూడా పిలుస్తారు జాతకంలో స్త్రీ దోషం లేదా స్త్రీ శాపం ఉన్నట్లయితే పెళ్లిళ్లు ఆలస్యం అవుటము భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా రావటం సంభవిస్తూ ఉంటాయి. పూర్వ జన్మలో తెలిసి కానీ తెలియక గాని ఎవరైనా స్త్రీలకు అపచారం చేసినట్లయితే ఎవరైనా స్త్రీలకి దోషం కలిగించినట్లయితే ఈ జన్మలో అది వెంటాడుతూ ఉంటుంది. జాతకంలో శుక్రుడు అనే గ్రహము రాహువుతో గాని శనితో గాని కేతువుతో గాని కలిసి ఉన్నట్లయితే దాన్ని స్త్రీ దోషమంటారు దీనివల్ల వివాహాలు ఆలస్యం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా రావటం జరుగుతూ ఉంటాయి.
ఈ దోషాలు పోగొట్టుకోవాలంటే వీలైనప్పుడు చిన్నపిల్లలకి భోజనం పెట్టి ఏవైనా ఆభరణాలు బహుకరించాలి. అలా చేస్తే ఈ స్త్రీ శాపము స్త్రీ దోషమనేవి తగ్గిపోతాయి. అలాగే ఎవరైనా కన్యక వివాహం జరుగుతున్నట్లయితే వివాహ నిమిత్తమై కొంత ఆర్థిక సహాయం చేయాలి. దాని వల్ల కూడా ఈ దోషాల నుంచి బయటపడవచ్చు అలాగే గోదానం చేయడం. ద్వారా కూడా ఈ దోషాలని పోగొట్టుకోవచ్చు జాతకంలో స్త్రీ దోషము స్త్రీ శాపం ఉన్న లేదా గ్రహణ దోషాలు ఉండి జీవితంలో అభివృద్ధి లేకపోయినా వీలైనప్పుడు పండితుడికి గోదానం చేస్తే చాలా మంచిది గోవును దానం ఇవ్వలేని వాళ్ళు వెండితో అయినా సరే తయారు చేయబడినటువంటి గోవు బొమ్మను పండితుడికి దానం ఇచ్చినా కూడా గ్రహణ దోషాలు స్త్రీ శాపాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అక్షింతల దోషము అని ఇంకొక దోషం ఉంటుంది 35 సంవత్సరాలు వచ్చిన వివాహాలు జరగటం ఆలస్యం అవుతూ ఉంటుంది.
అక్షింతల దోషం ఉందని కొన్ని సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎవరైనా పెళ్లి చూపుల నిమిత్తమై బయటికి వెళ్లేటప్పుడు ఒక చెడు శకుని ఎదురైతే అక్షింతల దోషము ఉందని తెలుసుకోవచ్చు. అలాగే పెళ్లిచూపులు నిమిత్తమై బయలుదేరుతున్నప్పుడు కాకి అడ్డంగా ఎగురుతూ వెళ్లిన లేదా ఏదైనా దుర్వార్త చెడు వార్త మనం విన్నా కూడా అక్షింతల దోషము ఉన్నట్లుగా గుర్తించాలి. అలాగే పెళ్లి చూపులకు వెళ్లి వచ్చిన తర్వాత పీడకలలు ఎక్కువగా వస్తున్నా కూడా అక్షింతల దోషం ఉన్నట్లుగా గుర్తించాలి. ఇలా అక్షింతల దోషం ఉండి పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే వీలైనప్పుడల్లా ఈశ్వరుని సన్నజాజి పూలతో పూజిస్తూ ఉండాలి. అక్షంతల దోష తీవ్రతను తగ్గింప చేసుకోవచ్చు. అలాగే కన్యలైతే అక్షింతల దోషం వల్ల వయస్సు పెరిగిన పెళ్లి నిశ్చయం కాకపోతే కాత్యాయని వ్రతం చేసుకోవాలి.
కాత్యాయని వ్రతం చేసుకుంటే తొందర్లోనే ఈ అక్షింతల దోషాన్ని తొలగింప చేసుకొని చక్కగా వివాహ ప్రాప్తిని సిద్ధింప చేసుకోవచ్చు. జాతకంలో అక్షింతల దోషమున్న స్త్రీ దోషమున్న గ్రహణ దోషాలు ఉన్న వాటన్నిటినీ పోగొట్టేటటువంటి శక్తి ఒక శక్తివంతమైనటువంటి విష్ణు మంత్రానికి ఉంది ఆ శక్తివంతమైనటువంటి విష్ణు మంత్రం ఓం జయ అధీశ జయ అజేయ జయ విశ్వగురోహరే జయ మృత్యు జరాతీత జయ అనంత జయ అచ్యుతాయ నమః.. ఇది వామన పురాణంలో చెప్పబడినటువంటి సర్వసిద్ధికర విష్ణు శ్లోకము ఇది చాలా శక్తివంతమైనది జాతకంలో ఎంత తీవ్రమైనటువంటి దోషాలు ఉన్నా సరే ఆ దోషాలన్నీ పోగొట్టేటటువంటి శక్తి వామన పురాణంలో చెప్పబడిన ఈ శ్లోకానికి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే జీవితంలో గ్రహణ దోషాల వల్ల అభివృద్ధి లేకపోయినా మనశ్శాంతి లేకపోయినా అక్షింతల దోషం వల్ల గాని స్త్రీ శాపం వల్ల గాని స్త్రీ దోషం వల్ల గాని భార్యాభర్తల గొడవలు ఎక్కువగా ఉన్న పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్న వామన పురాణంలో చెప్పబడినటువంటి. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు స్నానం చేశాక 21సార్లు చదువుకోండి శ్రీమన్నారాయణ మూర్తి విశేషమైన అనుగ్రహం వల్ల ఆ దోషాల తీవ్రతను తగ్గింప చేసుకోవచ్చు మీకున్న సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అంతటి శక్తివంతమైనటువంటి వామన పురాణంలో చెప్పబడిన ఆ శ్లోకం..
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.