Coriander Seeds Benefits : చాలా మంది తమకు కొంచెం అనారోగ్యంగా అనిపించినా ఆస్పత్రులకు పరిగెడుతుంటారు. డాక్టర్లు ఇచ్చే ట్యాబ్లెట్లను మింగుతుంటారు. అంతేకాకుండా వేలకు వేలకు డబ్బులను వృథాగా ఆస్పత్రులపై ఖర్చుచేసుంటారు. అయితే, సీజనల్ వారీగా వచ్చే వ్యాధుల కోసం హాస్పిటల్స్ మెట్లు తొక్కకుండానే వంటింట్లో దొరికే ధనియాలతో మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చట.. దానికి మీరు చేయవలసిందల్లా కొన్ని చిట్కాలు పాటించడమే.. ఆయుర్వేదంలో ధనియాలకు ఎంతో విశిష్టత ఉంది. ఎన్నో ఔషధ గుణాలు ధనియాలు ఇమిడి ఉంటాయట.. అందుకే వీటిని వంటింటి సంజీవని గా పిలుస్తుంటారు.
అయితే, ధనియాల గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కిచెన్‌లో అడుగు పెట్టని వారికి కూడా ధనియాల ఉపయోగం తెలిసే ఉంటుంది. సాధారణంగా ధనియాలను మసాలాలకు వాడుతుంటారు. ఇది లేకపోతే ఎంత మంచి వంటకం అయినా సువాసన వెదజల్లదు. నాన్ వెజ్ వంటకాల్లో అయితే కొత్తిమీర ఎంత వేసినా ధనియాల పొడి తప్పనిసరి. ఈ పౌడర్ లేకపోతే నాన్‌వెజ్ సువాసనను గుర్తించడం కూడా చాలా కష్టం.. అందుకే వంటింట్లో ధనియాల పొడికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇకపోతే ఈ ధనియాలకు ఎన్నో వ్యాధులను నివారించే శక్తి ఉందట..ఇందులో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ధనియాలను వాడటం వలన గ్యాస్ట్రిక్ నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరం వేడి ఎక్కకుండా చేస్తుంది. అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ ధనియాలు కొత్తిమీర మొక్కలకే కాస్తాయని మనలో చాలా మందికి తెలియక పోవచ్చు. ధనియాలను నలిపి మట్టిలో వేస్తే కొత్తిమీర మొలుస్తుంది.
ఇక ధనియాల కాషాయం తాగడం వలన శరీరంలో అధిక హీట్ తగ్గి జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం వంటి వ్యాధులు దూరమవుతాయి. షుగర్ వ్యాధి రాకుండా నియత్రిస్తుంది. మధుమేహం ఉన్నవారికి షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. టైఫాయిడ్ కారకమయ్యే బ్యాక్టీరియా, వైరస్‌తో పోరాడుతుంది. ఫ్రీ రాడికల్స్ ను నివారిస్తుంది. రోగనిరోధక శక్తి పెంచడమే కాకుండా జీర్ణవ్యవస్థను యాక్టివ్ గా ఉంచుతుంది.
Read Also : Lettuce Juice Benefits : పాలకూర జ్యూస్‌తో కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.