Venna Undalu Recipe in telugu : ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. పిల్లలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. స్నాక్స్ లా చేస్తే వెన్న ఉండలు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి నైవేద్యంగా పెడతారు. వెన్న ఉండలు. బియ్యం పిండితో నోట్లో వెన్నెల కరిగిపోయే పాతకాలం నాటి స్వీట్ రెసిపీ.. బియ్యం పిండితో ఎంతో కమ్మగా ఉంటాయి టేస్ట్. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. వెన్న ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి 6 గంటలు నానబెట్టుకోవాలి. క్లాత్ పై బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి మనం అరిసెలకు ఆరబెట్టుకున్నట్టుగా చాలు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి పొడి చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పిండిని జల్లెడ లో జల్లించుకోవాలి. తడి పొడి పిండి తో కూడా చేసుకోవచ్చు. పొడి పిండి అయితే రెండు కప్పులు తీసుకోవాలి. పిండిలో అర స్పూను ఉప్పు, పావు కప్పు వెన్న వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులో పచ్చిపాలు కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి ముద్దలా అయ్యే వరకు బాగా కలపాలి ఉండలు పగుళ్లు రాకుండా చూసుకోవాలి. పిండి సాఫ్ట్ గా కాకుండా గట్టిగా కలుపుకోవాలి.

ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండల్లా తయారు చేసుకోవాలి ఉండలు తడి ఆరకుండా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి సరిపోయినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడైన మీడియం ఫ్లేమ్ లో ఉంచి తర్వాత ఉండలను మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. పాకం కోసం స్టవ్వు ఆన్ చేసి ఒక గిన్నెలో ముప్పావు కప్పు తురిమిన బెల్లం మూడు టేబుల్ స్పూన్లు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. లేత పాకం వచ్చేవరకు ఉడికించాలి.
బెల్లం గవ్వలకు పట్టిన పాకంలా. ఒక గిన్నెలో నీళ్లు పోసి పాకం వేసి చూస్తే ముద్దలా తయారవుతుంది అంతే బెల్లం పాకం అయినట్లే స్టవ్ ఆఫ్ చేసి పాకంలో ఒక స్పూన్ యాలకుల పొడి వేసి అలాగే వెన్న ఉండలు వేసి ఉండలకి పాకం పట్టేలా కలపాలి. పగలకుండా నెమ్మదిగా కలపాలి పాకం గట్టి పడుతుంది వెన్న ఉండలు విడివిడిగా వచ్చేవరకు కలపాలి. అంతే ఎంతో రుచికరమైన వెన్నుండలు రెడీ…