Mutton Kaju Curry : మటన్ తినడానికి చాలా మంది ఇష్టపడతారు. మటన్‌తో అనేక రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. సాధారంగా రెస్టారెంట్లలో అనేక వెరైటీలతో మటన్ కర్రీలను తయారు చేస్తుంటారు. మన ఇంట్లో కూడా రెస్టారెంట్ స్టైల్లో మటన్ రెసిపీలను అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. హైదరాబాద్ స్టైల్లో మటన్ కాజు మసాల కర్రీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కాజు కర్రీని ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో తెలుసా? ఇలా మటన్ కాజు మసాల కర్రీని తయారు చేస్తే వదిలిపెట్టకుండా తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. మటన్ కాజు మసాల కర్రీ తయారీ విధానం ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.
కావలసిన పదార్థాలు :
మటన్ 1/2 కేజీ, పసుపు 1/2 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 2 స్పూన్, ఉప్పు, నిమ్మకాయ 1, ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, మిరియాలు 1 స్పూన్, దాల్చిన చెక్క2in , లవంగాలు 4, యాలకులు 2, జాపత్రి కొంచెం, గుప్పెడు జీడిపప్పులు, ఎండు కొబ్బెర 1/2, గసాలు 1 టీ స్పూన్, పెరుగు 3 స్పూన్, కాశ్మీర్ రెడ్ చిల్లి 1 స్పూన్ ,టమాట 1, ఉల్లిపాయ 1, కస్తూరి మేతి పొడి 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2,కొత్తిమీర, గరం మసాలా 1/2 స్పూన్..
మటన్ కాజు కర్రీ మసాలా తయారీ విధానం :
శుభ్రంగా కడిగిన మటన్ తీసుకోవాలి. ఒక బౌల్లో మటన్ వేసి ఉప్పు ,పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ రసం, వేసి బాగా కలపాలి 1 హాఫ్ ఆన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. మసాలా దినుసులు వేయించడానికి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి చేసుకుని ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి కొంచెం, 10 జీడిపప్పులు, చిన్న ముక్క కట్ చేసిన ఎండు కొబ్బెర, గసాలు వేసి ఫ్లేమ్ మీడియం లో ఫ్లేమ్ లో ఉంచి ఏమి మాడకుండా దోరగా వేయించుకోవాలి..
ఇప్పుడు మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ వేసి పేస్టులా తయారు చేసుకోవాలి. అదే పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి అయిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీలో ఉల్లిపాయ వేసి మూడు స్పూన్ల పెరుగు వేసి అందులో కాశ్మీర్ రెడ్ చిల్లి ఒక స్పూన్ వేసుకోవాలి. ఈ పౌడర్ రెడ్ చిల్లి ఆప్షనల్/… ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి ముందుగా మ్యాగ్నెట్ మటన్ మొత్తాన్ని వేసి ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి మటన్ లో వాటర్ వస్తుంది అదంతా ఇనికిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది ఐదు నిమిషాలు వేయించాలి.

మీడియం సైజు ఒక టమాట తీసుకొని ముక్కలుగా కట్ చేసి అందులో వేసి ఈ టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో గ్రైండ్ చేసిన ఉల్లిపాయ, పెరుగు పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు విరగకుండా సన్నని మంటపై మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకొని రెండు నిమిషాలు బాగా కలపాలి. మరో నాలుగు నిమిషాల తర్వాత కొన్ని వాటర్ ఒక కప్పు యాడ్ చేసుకోవాలి. అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి..10 నిమిషాలు ఉడికించాలి.
మటన్ గ్రేవీ వచ్చేంతవరకు ఉడికించాలి ఇప్పుడు అందులో కస్తూరి మేతి పొడి ఒక టీ స్పూన్ వేయాలి. కట్ చేసిన పచ్చిమిర్చి రెండు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి మరో 10 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యి ముక్క ఉడికిందా లేదా అని చూసుకొని అందులో గుప్పెడు జీడిపప్పులు వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసి కలుపుకోవాలి అంతే ఎంతో రుచికరమైన హైదరాబాద్ స్టైల్ లో మటన్ కాజు కర్రీ మసాలా రెడీ…
Read Also : Mutton Recipes : ఈజీ మటన్ కూర తయారీ.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఓసారి ట్రై చేయండి..!