Veg Fried Rice : కొర్రలతో వెజ్ ఫ్రైడ్ రైస్.. అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉండే మిల్లెట్స్‌తో అనేక రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. మిల్లెట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలా కొర్రలతో టేస్టీగా ఉండే అన్నంలా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. కొర్రలతో వెజ్ ప్రైడ్ ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కొర్రలు ఒక కప్పు తీసుకొని 3 సార్లు బాగా కడిగి రాళ్లు లేకుండా గాలించుకోవాలి. కొర్రలను కడిగిన తర్వాత రెండు కప్పుల వరకు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. నానబెట్టిన నీళ్ళని వంపకుండా అలానే అన్నం వండుతారు. ఈ గిన్నెని గాలి తగిలేచోట ఉంచినట్లయితే చెడు వాసన రాకుండా నానుతాయి.
8 గంటల పాటు నానిన తర్వాత ఈ కొర్రలకు నానబెట్టిన నీళ్లతో కొలిచి ఒకటిన్నర కప్పులు పోసుకోవాలి. ఇందులో నానిన కొర్రలు కూడా వేసుకోవాలి. అన్నం పొడిపొడిగా ఉడికేందుకు ఒక స్పూన్ నూనె వేసి ఈ గిన్నె స్టవ్ మీద పెట్టి మూత వేయాలి. మంటలు ఫ్లేమ్ లోంచి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అలా 5 నిమిషాల తర్వాత మూత తీసి అన్నం ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి మంట లో ఫ్లేమ్ లోనే ఉంచి పూర్తిగా ఉడకనివ్వాలి. ఇలా 7 నుంచి 8 నిమిషాల్లోనే బాగా ఉడికిపోతుంది.

మిల్లెట్స్ ఏవైనా సరిగ్గా నానితేనే త్వరగా ఉడుకుతాయి. అన్నం ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి మూత పెట్టాలి. ఆ వేడికి అన్నం చక్కగా మగ్గి మెత్తగా కొంచెం పొడి పొడిగా కూడా ఉంటుంది. ఈ అన్నం ఇంకా మెత్తగా ఉంటే.. ఇష్టపడేవాళ్లు అరకప్పు నీళ్ళను వేసి ఉడికించుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రైడ్ రైస్ కోసం స్టవ్ మీద కడాయిలో 2 స్పూన్ల నూనె కాగిన తర్వాత అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, కొన్ని ఉల్లిపాయల ముక్కలు, ఒక పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించాలి.
Veg Fried Rice : బియ్యం లేకుండా కొర్రలతో వెజ్ ఫ్రైడ్ రైస్..
ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించాలి. ఆ తర్వాత చక్కగా కడిగి క్లీన్ చేసుకుని చాలా సన్నగా తరిగిన 2 కప్పుల మెంతికూర కూడా వేసుకోవాలి. రెండు మూడు నిమిషాల పాటు మెంతికూరను కూడా కలుపుతూ వేయించిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1/4 స్పూను జీలకర్ర పొడి, అర స్పూను ధనియాల పొడి వేయాలి. ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కొర్రల అన్నాన్ని ఇందులో వేసుకోవాలి.
ఫ్రైడ్ రైస్ కోసం ఒక కప్పు కొర్రలకి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి ఉడికించుకుంటే బెటర్.. ఎందుకంటే.. కూరలు పప్పు, సాంబార్ వాటితో తినడం కోసం ఇంకొంచెం నీళ్లు ఎక్కువ వేసుకొని ఇంకా మెత్తగా ఉడికించుకోవచ్చు. మసాలాలన్నీ అన్నానికి పట్టేలా ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, అర చెక్క నిమ్మరసం పిండుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ కంట్రోల్ లో ఉండటమే కాదు.. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి, కంటిచూపుకి అద్భుతంగా పనిచేస్తుంది.
Read Also : Allam Pachadi : ఏ టిఫిన్లలోకైనా అల్లం పచ్చడి కమ్మగా ఉండాలంటే ఇలా చేయండి.. మెతుకు వదలకుండా తినేస్తారు!