Allam Pachadi : అల్లం పచ్చడి ఎప్పుడైనా ఇలా చేశారా? ఒకసారి అల్లం పచ్చడిని చేసుకోండి.. చాలా రుచిగా ఉంటుంది. ఏ టిఫిన్స్ లోనైనా ఎంతో రుచిగా ఉంటుంది. అల్లం పచ్చడిని మీరు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. నెల వరకు కూడా చెడిపోకుండా నిల్వ ఉంటుంది. పచ్చడి నిలువ ఉంటే.. చాలా టేస్టీగా ఉండే అల్లం పచ్చడిని ఎలా తయారీ చేయాలో ఇప్పుడు చూద్దాం.. ఈ అల్లం పచ్చడి కోసం ముందుగా చింతపండును నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఒక 50 గ్రాములు చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకోండి. శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండుని బాగా కాచిన నీళ్లు వేసుకోండి. కాచిన నీళ్లు మాత్రమే పోసుకోవాలి. చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసేసి పక్కన పెట్టేసుకోండి.
ఇప్పుడు 50 గ్రాముల అల్లాన్ని తీసుకోండి. 50 గ్రాముల అల్లం తీసుకోండి. ఈ అల్లానికి పైన పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. 50 గ్రాముల చింతపండు తీసుకుంటే.. 50 గ్రాములు అల్లం తీసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి ఫస్ట్ లైట్ గా వేయించుకోవాలి. ఫ్లేమ్ సిమ్ లోనే పెట్టి వేయించుకోవాలి. మాడకుండా చక్కగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత ఇందులో టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి. మాడితే పచ్చడి రుచి మొత్తం మారిపోతుంది. మాడకుండా లో ఫ్లేమ్‌లోనే వేయించండి. లైట్‌గా కలర్ మారి దోరగా వేగాయి కదా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. అల్లం ముక్కలు ఇలా పల్చగా రౌండుగా కట్ చేసుకుని తొందరగా వేగిపోతాయి.

పల్చగా వచ్చేటట్లు కట్ చేసుకుంటే తొందరగా వేగుతాయి. అల్లం ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఎండు మిరపకాయలు వేసుకోవాలి. 20 గ్రాముల నుంచి 25 గ్రాముల వరకు వేసుకోవచ్చు. చింతపండు ఎంత తీసుకుంటామో దాంట్లో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఎండుమిరపకాయల కలర్ కోసం ఒక 5 నుంచి 6 కాశ్మీర్ చిల్లీస్ వేస్తే మంచి కలర్ వస్తుంది. లేదంటే మామూలు మిరపకాయలే వేసుకోవచ్చు. కశ్మీర్ కారం అయితే అల్లం పచ్చడి బాగుంటుంది. ఈ మిరపకాయలను దోరగా మాడకుండా వేయించుకోవాలి. వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని నీళ్లతో సహా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఫ్లేమ్ లోనే పెట్టి మూత పెట్టి ఉడకనివ్వండి. నీళ్లు అనేది కొద్దిగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది.
Allam Pachadi : అల్లం పచ్చడి తయారీ విధానం ఇలా..
మూత తీసి చూపిస్తున్నాను. ఇలా కొద్దిగా నీళ్లు ఇంకిపోయేంతవరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారిపోయాయి కదా. ఇలా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లో సరిపడా సాల్ట్ వేసుకోండి. 50 గ్రాములు బెల్లం తురుము వేసుకోవాలి. చింతపండు ఎంత అయితే తీసుకుంటామో అంత క్వాంటిటీలో బెల్లం వేసుకోవాలి. ఇందులోనే వేడి నీళ్లు కొద్దిగా పోసుకోవాలి. చన్నీళ్లు పోయకూడదు. పచ్చడి నిలువ ఉండదు. వేడి నీళ్ళే పోసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేశానో ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకొంచెం వేడి నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకోండి. అల్లం పచ్చడి ఏదైనా డబ్బాలో వేసుకొని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే నెలవరకు పాడవక్కుండా ఉంటుంది.
టిఫిన్స్‌లోకి కొద్దిగా పచ్చడిని తీసి పోపు పెట్టుకోవాలి. ఒకటేసారి పోపు పెట్టుకొని అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపు పెట్టి చూపిస్తాను. రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర శనగపప్పు, మినపప్పు అన్ని కలిపి వేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. వేడికి మిగతా పోపు మొత్తం వేగిపోతుంది. ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చాగా దంచి వేయండి. అలాగే 2 ఎండు మిరపకాయలు తుంచి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపును కాస్త వేగనివ్వండి. పోపు వేగిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని పచ్చళ్ళు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. అంతే అల్లం పచ్చడిని ఏ టిఫిన్స్‌లోకి అయినా చాలా రుచిగా ఉంటుంది.