Vankaya Gongura Masala Curry : వంకాయ గోంగూర మసాలా కర్రీ రుచిగా ఇలా చేయండి అన్నం చపాతీ పులావ్ లోకి సూపర్ గ ఉంటుంది..

Vankaya Gongura Masala Curry : కావాలా చూద్దాము ఈ కర్రీ మనకు అన్నం చపాతీ పులావ్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ..

ముందుగా వంకాయ గోంగూర కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక యాలక్కాయ పావు టీ స్పూన్ షాజీరా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని దినుసులను మీడియం ఫ్లేమ్ లో దోరగా ఫ్రై చేసుకోవాలి మసాలా దినుసులు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత పావు కిలో వంకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలను మీడియం ఫ్లేమ్ లో మెత్తగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి వంకాయలు ఈ విధంగా మెత్తగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి .

ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే పాన్ లో రెండు చిన్న కట్టలు గోంగూరను కడిగి వేసుకోవాలి. గోంగూరను మీడియం ఫ్లేమ్ లో దగ్గరగా అయ్యేంతవరకు ఉడకనివ్వాలి గోంగూర ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న దినుసులు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి . ఇలా వేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం ఉడికించిన గోంగూర 1/4 గ్లాస్ నీళ్లు పోసుకుని మెత్తటి పేస్ట్ లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ ను ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి.

vankaya gongura masala curry in telugu
vankaya gongura masala curry in telugu

ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు టమాటాలను మీడియం ఫ్లేమ్ లో మెత్తగా అయ్యేంతవరకు ఉడకనివ్వాలి టమాటా ఈ విధంగా మెత్తగా ఉడికాక ముందుగా మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ కు తగినంత ఉప్పు అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మసాలాను మీడియం ఫ్లేమ్ లో రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత మసాలాలోని ఆయిల్ అంతా ఈ విధంగా సైడ్స్ గా వస్తుంది ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న వంకాయలు ఒక గ్లాసు నీళ్లు పోసుకుని కలుపుకోవాలి.

మీకు కర్రీలో గోంగూర ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువగా కావాలనుకుంటే మరో కట్ట గోంగూరను వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి 20 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీలో తరిగిన కొత్తిమీర వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి ఒక నిమిషం తర్వాత వంకాయ గోంగూర కర్రీ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్ లోకి తీసుకొని రైస్ చపాతీ పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ గోంగూర కర్రీ రెడీ..

Read Also : Gongura Chicken Pulao : గోంగూర చికెన్ పులావ్.. చూస్తేనే నోరూరిపోతుందిగా.. తింటే టేస్ట్‌ ఇంకా అదిరిపోద్ది.. నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు..!

Leave a Comment