Vangibath Powder : బోరింగ్ కూరలను కూడా అద్భుతంగా మార్చి వాంగీబాత్ పొడి… ప్రతినిత్యం కూరలు చేస్తూ ఉంటాం. కూరలు మరింత టేస్ట్ రావాలంటే.. ప్రతి కిచెన్ లో ఉండాల్సిన కారంపొడి ఇంట్లోనే ఈ కారం పొడిని ఒక్కసారి చేసి ఉంచుకుంటే రెగ్యులర్ కూరల్లో వేసుకుంటే యమ్మీ యమ్మీ కూరలు టేస్టీగా ఉంటాయి. వాంగీబాత్ పొడి తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు.. మినప్పప్పు 25 గ్రామ్స్, పచ్చిశనగపప్పు 25 గ్రామ్స్, ధనియాలు 25 గ్రామ్స్, లవంగాలు 15, యాలకులు 4, దాచిన చెక్క 2ఇంచులు, మరాటి మొగ్గ 1, గసగసాలు 10గ్రామ్స్, ఎండు కొబ్బెర అరకప్పు, గుంటూరు మిర్చి 8, యాడికి మిర్చి 70 గ్రామ్స్,
తయారీ విధానం.. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ మినప్పప్పు, రెండు టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో 25 గ్రామ్స్ ధనియాలు వేసి దోరగా వేయించుకొని ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ రెండు అంగుళాలు వేసి దోరగా త్వరగా వేగిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ గసగసాలు వేసి చెట్లనివ్వాలి.
ఆ తర్వాత ధనియాల ప్లేట్ లో వేసుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో అరకప్పు ఎండు కొబ్బరి వేసి రెండు నిమిషాలు వేయించిన తర్వాత ప్లేట్ లోకి వేయాలి ఇప్పుడు మూకుల్లో గుంటూరు మిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు యాడికి మిర్చి తొడిమ తీసి బాగా ఎండబెట్టాలి యాడికి మిర్చిని కాశ్మీరం అంటారు. వీటిని మూకుడులో వేసుకొని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో ముందుగా వేయించుకున్న పప్పులు, ధనియాలు ,ఎండు కొబ్బరి, అర టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఇంగువ వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి..
ఇప్పుడు చల్లార్చిన గుంటూరు మిర్చి, యాడంగి మిర్చి వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కారంపొడిని ప్లేట్లో తీసుకొని చల్లార్చాలి.. కారం పొడి కంటెంట్ డబ్బాలో వేసుకుంటే ఐదు నెలలు నిల్వ ఉంటుంది. ఈ కారం పొడిని వాంగీబాత్ లో వాడతారు. అలా కాకుండా నిమ్మకాయ పులిహోరలో ఆఖరిలో వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి కూరలో వేపుల్లో , ఇగురులో కూర ఆఖరిలో కొంచెం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం ధనియాల పొడి గరం మసాలా, కూరలో వాడటం కదా.. అలాగే ఈ పొడి మంచి సువాసనతో వాంగీబాత్ పొడి కూర ఆఖరిలో వేసుకుంటే చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది.
Read Also : Kakarakaya Ulli Karam : కాకరకాయ ఉల్లికారం చేయడం చాలా ఈజీ.. వేడివేడి అన్నంలో కలిపి తింటే ఆ టేస్టే వేరబ్బా..!