Tomato Bajji Recipe : ఏంటి.. జోరుగా వర్షం పడుతుందా? నోరూ లాగేస్తుందా? వేడివేడిగా ఏం తింటే బాగుంటుందా అనిపిస్తుందా? అయితే ఈ టైంలో అదిరిపోయే రెసిపీ టమాటా బజ్జీ తప్పక టేస్ట్ చేయాల్సిందే.. ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు తెలుసా? వర్షం పడేటప్పుడు మిర్చి బజ్జీ పకోడీలు తినడం కామన్.. అదే సమయంలో టమాటా బజ్జీని కూడా ఓసారి టేస్ట్ చూడండి.. ఒకసారి తిన్నారంటే మళ్లీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది.
వేడి వేడి టమాటా బజ్జీలను తింటుంటే నోరూరిపోవాల్సిందే.. పుల్లగా వేడిగా ఉండే ఈ టమాటా బజ్జీని చిన్నపిల్లలే కాదు.. పెద్దవాళ్లు చాలా ఇష్టంగా తింటారు. కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మిర్చి బజ్జీ ఎలా చేస్తారో తెలుసు.. మరి.. టమాటా బజ్జీని ఎలా చేస్తారు. బండి మీద దొరికే టమాటా బజ్జీలా టేస్టీగా చేయడం ఎలా అంటారా? మీ ఇంట్లోనే ఈజీగా టమాటా బజ్జీ క్షణాల్లో చేసేయొచ్చు.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
Tomato Bajji Recipe : టమాటా బజ్జీ తయారీ విధానం..
కావలసిన పదార్థాలు ఇవే : ముందుగా టమాటాలను 7 వరకు తీసుకోండి. అలాగే, ఒక కప్పు శనగపిండి, తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ కారం, చిటికెడు పసుపును దగ్గర పెట్టుకోండి. రుచి కోసం అర టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా వంట సోడా యాడ్ చేయాలి. ఇక బీట్ రూట్, క్యారెట్ ముక్కలు, తురుమిన కొత్తిమీర, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, వేరుశెనగ గింజలు దోరగా వేయించినవి తీసుకోవాలి. ఇప్పుడు అన్నింటిని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం కలిపిన నిమ్మరసం మిశ్రమాన్ని అందులో కలపాలి. చివరిగా డీప్ ఫ్రై చేసేందుకు నూనె కొద్దిగా తీసుకోండి.
శనగపిండిలో కారం, ఉప్పు, ధనియాల పొడి, వంట సోడాను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి చిక్కగా కలిపి పెట్టాలి. బాగా కడిగిన టమాటాను తీసుకుని శనగపిండి మిశ్రమంలో బాగా ముంచాలి. పిండి బాగా పట్టేలా ముంచాలి. ఆ తర్వాత పిండితో నిండిన టమాటాను నూనెలో వేసి డీప్ ఫ్రైలా చేయాలి. ఆ తర్వాత టమాటా బజ్జీని మధ్యకు కట్ చేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన టమాటా బజ్జీ రెడీ.. మీరు కూడా మీ ఇంట్లో ఓసారి ట్రై చేయండి.. మిచ్చి బజ్జీలకు మించిన టేస్ట్ అదిరిపోతుంది. వర్షం పడే సమయంలో ఇంట్లో ఇలా టమాటా బజ్జీలు చేసి వేడివేడిగా తిన్నారంటే ఆహా ఆ టేస్టే వేరబ్బా అనాల్సిందే..
Read Also : Health Benefits of Lemons : అమ్మలా కాపాడే నిమ్మలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? ఎలాంటి రోగమైన దరిచేరదు..!