Thiruvathirai Kali Prasadam : మన భారత సంస్కృత, సాంప్రదాయాలు, మన నాగరికతలు, భిన్న మతాలు విభిన్న అభిరుచులు, ప్రాంతాన్ని బట్టి కోట్లాది వంటలు, ఆరోగ్య రహస్యాలు, ఎన్నో ఉన్నాయి.. చిదంబర ఆలయం ప్రత్యేక కలి ప్రసాదం.. ధనుర్మాసంలోని ఆరుద్ర నక్షత్రం, పూర్ణిమ నాడు నటరాజు కామ సుందరిగా కొలువైన శివశక్తులకు అభిషేకం అలంకరణ ఊరేగింపు చేసి ప్రత్యేకంగా ఈ కలి ప్రసాదం నివేదిస్తారు. ఈ వేడుక ఆరుద్ర నక్షత్రం తమిళులకు తిరునాది ఆరోజు విశేషంగా ఆలయంలో చేస్తారు. తిరుమారి కలి ప్రసాదం చాలా గొప్ప ప్రసాదంగా చెబుతారు.
కావాల్సిన పదార్థాలు :
బియ్యం ఒక కప్పు, కందిపప్పు పావు కప్పు, పెసర పప్పు పావు కప్పు, నెయ్యి ఒక కప్పు, పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు, జీడిపప్పు, కిస్ మిస్, యాలకుల పొడి, జాజికాయ ఒకటి.. బెల్లం మూడు కప్పులు వరకు అన్నింటిని సమపాలలో కలుపుకోవాలి.
తయారీ విధానం..
స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పావు కప్పు కందిపప్పు, వేసి సన్నని సెగపై రంగు మారకుండా అందులో పావు కప్పు పెసరపప్పు వేసి సువాసన వచ్చేవరకు వేగనివ్వాలి. మీరు ఏ కొలతతో చేసిన పప్పులు బియ్యం లో సగం ఉండాలి. పప్పులు చల్లారక మిక్సీ జారులో ఒక కప్పు బియ్యం వేసుకొని రవ్వ మాదిరిగా పెట్టాలి. బియ్యాన్ని నూకగా గ్రైండ్ చేయకండి.
రవ్వ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసి గ్రైండ్ చేసిన రవ్వను వేసి మంచి సువాసన, రంగు మారే వరకు వేయించుకోవాలి. వేగిన రవ్వలో పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి 30 సెకన్లు వేయించుకోండి. ఆ తర్వాత మూడు కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మీడియం ప్లే మీద అన్నాన్ని మెత్తగా ఉడికించాలి. విడిగా చేస్తే చాలా సమయం పడుతుంది కాబట్టి కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది.
మరోవైపు పాకం కోసం ఒక గిన్నె పెట్టి మూడు కప్పుల బెల్లం, అందులో రెండు కప్పుల నీళ్లు పోసి బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టి తీసుకోండి. ఆ తరవాత బెల్లం పాకం లేతగా జిగురు జిగురుగా అయ్యేంతవరకు ఉంచండి. ఇప్పుడు కించిన పప్పు అన్నాన్ని వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. అన్నం పాకంలో కలిసిపోయి చిక్కబడుతుంది. అందులో నాలుగు నిమిషాల తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసి ఒక జాజికాయ పొడి, పావు చెంచా యాలకుల పొడి వేసి మెల్లగా కలుపుతూ దగ్గర అయ్యేంతవరకు ఉంచాలి.
మూడు నిమిషాల తర్వాత రెండు స్పూన్ల నెయ్యి మిగిలిన పచ్చికొబ్బరి తురుము అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి. ప్రసాదం దగ్గరుండి నెమ్మదిగా కలుపుతూ ఒక్కసారి నెయ్యి వెయ్యకుండా కొంచెం కొంచెం వేస్తూ చేస్తేనే చాలా చక్కటి రంగు, రుచికరంగా ఉంటుంది. ప్రసాదాన్ని పక్కన పెట్టుకోండి. మిగిలిన నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించుకోండి. ఇప్పుడు ప్రసాదంలో కలపండి. అంతే.. ఎంతో ఎంతో రుచికరమైన చిదంబర ప్రసాదం రెడీ.