Street Style Pakoda Recipe : పకోడీ అనేది అందరికీ చాలా ఇష్టం.. సాయంత్రం కాగానే స్నాక్స్ లా చిన్నపిల్లలు, పెద్దవాళ్లు చాలా ఇష్టంగా పకోడీ తింటూ ఉంటారు. స్వీట్ షాప్ స్టైల్లో కరకరలాడే ఉల్లిపాయ గట్టి పకోడీ ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.. చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ ఉల్లిపాయ పకోడీ ఈ విధంగా తయారు చేసుకుంటే బండిమీద దొరికే టేస్ట్ వస్తుంది.. ఎందుకు ఆలస్యం పకోడీ కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం..
300 గ్రాముల ఉల్లిపాయలు తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. నాలుగు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ధనియాలు క్రష్ చేసి వేసుకోవాలి.. వీటన్నిటిని బౌల్లో వేసుకొని గట్టిగా ఉల్లిపాయలు ప్రెసరిస్తూ వాటర్ వచ్చేలా కలుపుకోవాలి.
150 గ్రాముల శనగ పిండిలో రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ఉల్లిపాయకు పట్టేలా పొడి పొడి లాడిస్తూ పైకి కిందికి అనుకోండి ఆ తర్వాత పిండిని గట్టిగా కలుపుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసి గట్టిగా కలుపుకోవాలి ఉల్లిపాయ లో ఉన్న నీళ్లే సరిపోతాయి కాస్త ముద్దగా రావాలి కనుక ఒక టీ స్పూన్ నీళ్లు వాడాము. పిండి ఎంత గట్టిగా ఉంటే పకోడీలు అంత క్రంచిగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి డీప్ ఫ్రై ఆయిల్ పోసి నూనె వేడి అయిన తర్వాత పకోడీ పిండిని చేతిలో ముద్దలా తీసుకొని వేళ్ళతో పొడిపొడిగా వేసుకున్నట్టు.
నూనెలో వేసుకోవాలి మరి పొడిపొడిగా కాకుండా కొంచెం ముద్దలుగా వేసుకోండి ఈ పకోడీని మీడియం ఫ్లేమ్ లో క్రిస్పీగా వేయించుకోండి కొంచెం సమయం పడుతుంది. ఉల్లిపాయలను 100% వరకు వేయించుకోకుండా 80% వేయించుకోండి బయటకు తీసాక ఉల్లిపాయలు నల్లగా మాడిపోతాయి.. పకోడీలు వేయించుకొని తీసిన తర్వాత రెండు రెమ్మల కరేపాకు నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వేయించుకున్న కరేపాకు ని పకోడీలు మీద చల్లండి.. క్రంచి ఉల్లిపాయ పకోడీ పర్ఫెక్ట్ స్టీల్ షాప్ పకోడీలు రెడీ..

పకోడీ తయారీ విధానం...
ఉల్లిపాయలు ఆఫ్ కేజీ, పచ్చిమిర్చి 10, శనగపిండి 150 గ్రామ్స్, బియ్యం పిండి 2 స్పూన్స్, కరివేపాకు మూడు రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆఫ్ టీ స్పూన్, రుచికి తగినంత ఉప్పు, నూనె, ఒక బౌల్ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చిని చిన్న చిన్న కట్ చేసి వేయాలి అందులో సన్నగా కట్ చేసిన కరివేపాకు, అల్లంపేస్ట్ రుచికి తగినంత ఉప్పు శనగపిండి, బియ్య పిండి వేయడం వల్ల నూనె పీల్చుకోకుండా క్రిస్పీగా వస్తాయి. బియ్య పిండి వేసి బాగా కలపాలి ఉల్లిపాయలోనే వాటర్ వస్తుంది.
కాబట్టి కొద్దిగా వాటర్ చల్లుకుంటూ కలపాలి. పిండి జోరుగా కాకుండా గట్టిగా కలపాలి.. పిండిని జోరుగా కలపడం వల్ల ఆయిల్ పీల్చుకుంటుంది కాబట్టి పిండి పొడిపొడి లా కలుపుకుంటే పకోడీలు చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో డీప్ ఫ్రై సరిపోయేంత పోయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పకోడీల వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి.. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే పకోడీ వెయ్యాలనుకుంటామో.. ఆ గిన్నెలో ఒక పేపర్ వేసి పకోడీలు వేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన పకోడీ రెడీ… గమనిక.. పకోడీ, బజ్జి, బూంది, కారపూస వీటన్నిటిని శనగపిండితో తయారు చేస్తాం కదా.. పచ్చి శనగపప్పును మిల్లులో పట్టించిన పిండి అయితే చాలా టేస్టీగా వస్తాయి.
Read Also : Mirapakaya Bajji : బండి మీద దొరికే మిర్చి బజ్జి, గారెలు ఇంట్లోనే ఇలా టేస్టీగా చేసుకోవచ్చు తెలుసా?