Sabudana Khichdi Recipe : సగ్గుబియ్యం కిచిడి.. ఒంట్లో వేడి తగ్గడానికి… కాలుష్య ఐరన్ లోపం, పిల్లలకు మలబద్ధకం, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. వేసవిలో ఒంటికి చలవ చేస్తుంది. సగ్గుబియ్యం తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒక్కసారి ఇలా చేస్తే లొట్టలేసుకొని తింటారు. సగ్గు బియ్యాన్ని పిల్లలకు ఆహారంగా ఇవ్వడం ద్వారా వారిలో జ్ఞాపకశక్తి బాగా మెరుగుపడుతుంది. చదువులోనూ చాలా చురుకుగా ఉంటారు. ఇంతకీ ఈ సగ్గుబియ్యంతో కిచిడి ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు..
సగ్గుబియ్యం ఒక కప్పు, నూనె, నెయ్యి, మిరియాలు 1/3స్పూను, జీలకర్ర 1 స్పూను, పల్లీలు 1/2కప్పు, ఉప్పు, పసుపు 1స్పూను, పచ్చిమిర్చి, కరివేపాకు 1రెమ్మ, ఆలుగడ్డ 2
తయారీ విధానం..
ముందుగా ఒక బౌల్లో లావుగా ఉన్న ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు కడగడం వల్ల సగ్గుబియ్యం కిచిడి పొడిపొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక కప్పు సగ్గుబియ్యానికి ముప్పావు కప్పు నీళ్లు పోసి రాత్రి అంతా నానబెట్టుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంత పీల్చుకొని పొడిపొడిగా ఉంటుంది. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని అర కప్పు పల్లీలు వేసి లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.. పొట్టు తీసిన పల్లీలను మిక్సీ జార్ లో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
స్టవ్ మీద కళాయిలో ఒక స్పూన్ నూనె, ఒక స్పూన్ నెయ్యి వేడి అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచిన మిరియాల పొడి , కరివేపాకు వేసి తరవాత ఒక స్పూను అల్లం పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మరి మెత్తగా కాకుండా సగం ఉడికించిన బంగాళదుంపల ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ లో ఉంచి క్రిస్పీగా అయిన తర్వాత కారం సరిపోయినంత నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి నానిన సగ్గుబియ్యాన్ని వేసి కలపాలి.
లో ఫ్లేమ్ లో ఉంచి పెట్టి మూడు నిమిషాలు మగ్గనివ్వాలి. సగ్గుబియ్యం లో ఉన్న తేమకి ఉడికిపోతాయి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న పల్లి పొడి వేసి సన్నగా తరిమిన కొత్తిమీర వేసి కలపాలి సగ్గుబియ్యం పలుకు అనేది లేకుండా పొడిపొడిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసుకోవాలి కలపాలి. అంతే అండి ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం కిచిడి రెడీ..